‘ఆ బౌలర్ కు విశ్రాంతి అవసరం’ మెక్ గ్రాత్ మాట
ఆ బౌలర్ యాక్షన్ సాధారణం కంటే కష్టమైనది. కేవలం క్రీజు ముందు మాత్రమే అతని బౌలింగ్ లో వేగం పెరుగుతుంది. సమయం దొరికినప్పుడు తగిన విశ్రాంతి తీసుకోవాలని..
By : The Federal
Update: 2024-03-20 07:52 GMT
భారత బౌలర్ జస్ప్రీత్ భూమ్రాకు తగినంత విశ్రాంతి అవసరమని ఆస్ట్రేలియ దిగ్గజ ఆటగాడు మెక్ గ్రాత్ అభిప్రాయపడ్డాడు. భూమ్రా బౌలింగ్ యాక్షన్ వైవిధ్యంగా ఉంది. దాని వల్ల నడుంపై ఎక్కువ ఒత్తిడి పడుతుంది. అందువల్ల భూమ్రాకు మరోసారిగాయం తిరగబెట్టే అవకాశం ఉందని మెక్ గ్రాత్ హెచ్చరించాడు.
బుమ్రా మార్చి 2023లో తన వెన్ను నొప్పికి శస్త్ర చికిత్స తీసుకున్నాడు. అంతకుముందు సెప్టెంబర్ 2022 నుంచి ఆటకు దూరంగా ఉన్నాడు. మధ్యలో ఆస్ట్రేలియాలో జరిగిన టీ20 ప్రపంచ కప్ కు, తరువాత ఐపీఎల్ కు దూరమయ్యాడు.
తరువాత ఆగస్టులో ఐర్లాండ్‌లో జరిగిన మూడు-మ్యాచ్‌ల T20 పర్యటనకు ఎంపికయ్యాడు. తరువాత జరిగిన ప్రపంచకప్ కు సైతం ఎంపికై 20 వికెట్లు పడగొట్టాడు.
MRF పేస్ ఫౌండేషన్‌లో మీడియాతో మాట్లాడిన సందర్భంగా మెక్‌గ్రాత్ భూమ్రా గురించి చెబుతూ "అతను తీసుకునే చివరి రెండు లెన్త్ లతో బౌలింగ్ లో వేగం పెరుగుతుంది. అక్కడే వైవిధ్యం కూడా ఉందని వివరించాడు.
"బుమ్రా వంటి వ్యక్తికి ఆఫ్-సీజన్ అవసరం ఎందుకంటే అతను ప్రతి బంతికి చాలా ఎక్కువ శ్రమ ఉపయోగిస్తాడు. కాబట్టి అతనికి విరామం అవసరం. విరామం లేకుండా ఆడుతుంటే ఒత్తిడి పెరిగి కచ్చితంగా గాయపడతాడు. ఇది గతంలో కూడా రుజువు అయింది” అని మెక్ గ్రాత్ పేర్కొన్నాడు.
భారత జట్టులో ఇప్పుడు ఉన్న కుడిచేతి వాటం పేసర్లలో స్థిరత్వం ఉందని అందుకని ఎడమ చేతి బౌలర్ల కోసం వెతకాల్సిన అవసరం లేదని మెక్ గ్రాత్ అన్నారు.
"భారత ఫాస్ట్ బౌలింగ్ చాలా కాలంగా సెట్ చేయబడింది. పెద్దగా టర్నోవర్ లేదు. షమీ, బుమ్రా, సిరాజ్ ఉమేష్ యాదవ్ జట్టుకు మెరుగైన సేవలు అందించారు. వారు ఆట నుంచి వెళ్లిపోయాక కొత్తవారి గురించి ఆలోచించండి అని మెక్ గ్రాత్ సలహా ఇచ్చాడు.
" ప్రస్తుతం ఆవేశ్ ఖాన్ వంటి కుర్రాళ్లు ఉన్నారు. భవిష్యత్తులో ఇంకా అనేకమంది వస్తారు. వీరిలో చాలామంది రైట్ ఆర్మ్ బౌలర్లు కావడంతో మనం మంచి లెప్ట్మార్ పేస్ బౌలర్లను చూడలేకపోయాం" అని మెక్ గ్రాత్ వివరించారు. బౌలర్లకు మంచి ఐపీఎల్ లో మంచి డిమాండ్ ఉందని అన్నారు. తన దేశానికి చెందిన ప్యాట్ కమిన్, మిచెల్ స్టార్క్ ఇద్దరు కూడా అత్యధిక ధరను పొందారని విషయాన్ని గుర్తు చేశారు.
స్టార్క్‌ను కోల్‌కతా నైట్ రైడర్స్ రూ. 24.75 కోట్లకు కొనుగోలు చేయగా, కమిన్స్‌ను సన్‌రైజర్స్ హైదరాబాద్ రూ. 20 కోట్లకు కొనుగోలు చేసింది. “స్టార్క్ కోసం, అతను వ్యక్తిగత కారణాల వల్ల IPLకి రాకూడదని నిర్ణయించుకున్నాడు. కానీ అతను తిరిగి వస్తే మరోసారి రికార్డు ధరను పొందుతాడు, ”అని మెక్‌గ్రాత్ చెప్పారు. అయితే వారి ఆటపై ధర ఏమాత్రం ప్రభావం చూపదని అన్నారు.