మోదీ- ట్రంప్ భేటీ మంచి దౌత్య పరిణామం: ‘ది ఫెడరల్’ ఎడిటర్

భారత్ తో ట్రంప్ అనుసరిస్తున్న వాణిజ్య విధానం ఇంతకుముందు ఫెయిల్ అయిందని విదేశాంగ నిపుణులు;

Update: 2025-02-15 07:27 GMT

విజయ్ శ్రీనివాస్

భారత ప్రధాని నరేంద్ర మోదీ, అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ ను కలవడం ఉత్తమమైన దౌత్య పరిణామం అని ‘ది ఫెడరల్’ ఎడిటర్ ఎస్ శ్రీనివాసన్, విదేశాంగ నిపుణుడు శ్రీధర్ కృష్ణస్వామి అన్నారు.

వాణిజ్యం, రక్షణ, ఇంధన సహకారం, సుంకాలు, సాంకేతిక బదిలీ వంటి ముఖ్యమైన అంశాలపై సమస్యలను పరిష్కరించుకోవడానికి ఇరువురు దేశాధినేతలు ప్రయత్నించారని విశ్లేషించారు.

వాణిజ్య చర్చలు..
ఈ పర్యటనలో ప్రధాన ఆకర్షణ అమెరికా- భారత్ మధ్య జరిగిన వాణిజ్య చర్చలు. బేరసారాల విధానానికి పేరుగాంచిన ట్రంప్, భారత వృద్దిరేటును ప్రశంసిస్తూనే, ఇరుదేశాల మధ్య జరుగుతున్న వాణిజ్యంలో లోటును భర్తీ చేయాలని ఒత్తిడి చేశారు.
ప్రస్తుతం రెండు దేశాల మధ్య 157 బిలియన్ల డాలర్ల విలువన వాణిజ్యం నడుపుతున్నాయి. కానీ ఇందులో భారత్ లాభపడుతోంది. ట్రంప్ ప్రతిపాదిస్తున్న సుంకాల వ్యూహం దేశాలపై ఒత్తిడి పెంచే వ్యూహామని ఎడిటర్ ఎస్. శ్రీనివాసన్ అభిప్రాయపడ్డారు.
‘‘ మోదీ అమెరికాలో దిగి దిగానే ట్రంప్ సుంకాలతో హడలుగొట్టే ప్రయత్నం చేశారు. అయితే ఇంతకుముందే ట్రంప్ తో డీల్ చేసే అనుభవం ఉన్న మన అధికారులకు అందుకు తగ్గట్లుగా సిద్దంగా ఉన్నారు’’ అని ఎడిటర్ అన్నారు.
Full View

రక్షణ పరికరాలు, ఇంధన ఉత్పత్తులు సహ మరిన్ని అమెరికన్ ఉత్పత్తులు భారత్ చేత కొనుగోలు చేయించడానికి ఒత్తిడి చేస్తున్నారు. అయితే ఈ కొనుగోళ్లు వాణిజ్య అసమతుల్యతను పరిష్కరించవని నిపుణులు హెచ్చరిస్తున్నారు.
‘‘1980 లలో అమెరికా, జపాన్ తో ఇదే విధమైన వ్యూహాన్ని అనుసరించింది. కానీ అది విఫలమైంది’’ అని కృష్ణస్వామి అన్నారు. ‘‘వాణిజ్యంలో నిర్మాత్మక సమస్యలను కేవలం, మరిన్ని యుద్ద విమానాలు, లేదా గ్యాస్ సరఫరాలను అమ్మడం ద్వారా భర్తీ చేయలేము’’ అన్నారు.
రక్షణ ఒప్పందాలు
ఈ పర్యటనలో అత్యంత ముఖ్యమైన అంశం.. అమెరికా అమ్మజూపిన ఎఫ్ -35 స్టెల్త్ ఫైటర్ జెట్. అమెరికా దీనిని అమ్మడానికి సిద్దంగా ఉన్నప్పటికీ భారత్ సవాళ్లను ఎదుర్కొనే అవకాశం కనిపిస్తుంది. ముఖ్యంగా సాంకేతిక బదిలీ, దీర్ఘకాలిక నిర్వహణ ఖర్చలు భారంగా మారతాయని అన్నారు.
‘‘అమెరికన్ ఉత్పత్తులు, ముఖ్యంగా రక్షణ పరికరాలు కొనుగోలు చేయడమనేది షరతులతో ముడిపడి ఉంటుంది. విడిభాగాలు, నిర్వహణ, యూఎస్ చట్టసభల నుంచి అడ్డంకులు ఎదురయ్యే అవకాశం ఉంది’’ అని కృష్ణ స్వామి హెచ్చరించారు.
అమెరికా కంటే రష్యాతో మనకు సన్నిహిత రక్షణ సంబంధాలు ఉన్న విషయాన్ని ఆయన ఈ సందర్భంగా ప్రస్తావించారు. మాస్కో మనకు సాంకేతిక బదిలీల విషయంలో మరింత ఎక్కువ అనుకూలంగా ఉందన్నారు. దీనివల్ల ఎస్ యూ-57 దేశ రక్షణ వ్యూహానికి మరింత ఆకర్షణీయమైన ఛాయిస్ గా ఉంటుందన్నారు.
ఇమ్మిగ్రేషన్, హెచ్ వన్ బీ వీసాలు..
అమెరికాకు అక్రమంగా వలస వచ్చి ఉంటున్న భారతీయులను తిరిగి తీసుకోవడానికి మోదీ అంగీకరించడం ఇరువురు నాయకులకు రాజకీయంగా బాగా పనిచేస్తుందని వక్తలు అభిప్రాయపడ్డారు. అయితే ఈ పక్రియకు సంవత్సరాలు పడుతుందని కృష్ణ స్వామి అభిప్రాయపడ్డారు.
‘‘దాదాపు 8 లక్షల మంది భారతీయుల అక్కడ అక్రమంగా ఉంటున్నట్లు తేలింది. ఇందులో 18 వేల మందిని మాత్రమే బహిష్కరించడానికి ఉత్తర్వులు ఇచ్చారు. ఇందులో కేవలం 104 మంది మాత్రమే ఇక్కడకు వచ్చారు.’’ అని ఆయన చెప్పారు.
భారతీయ నిపుణులు, హెచ్ వన్ బీ వీసా కేటాయింపులు, గ్రీన్ కార్డ్ కోటాల భవిష్యత్ ల విషయంలో అమెరికా విధానాలపై ప్రపంచం ఆసక్తి చూస్తుందన్నారు.
ఇంధనం, టెస్లా ప్రవేశం..
అమెరికా సరఫరా చేయబోయే ఇంధనం, వ్యాపార పెట్టుబడులు కూడా మోదీ తన ఎజెండాలో భాగంగా చేసుకున్నారు. టెస్లా సీఈఓ ఇలాన్ మస్క్ తో మోదీ సమావేశం దేశంలో ఎలక్ట్రిక్ వాహానాల తయారీపై ఆసక్తిని రేకెత్తించింది.
‘‘భారత్ లో తన ఎలక్ట్రిక్ వాహనాలను పంపడానికి టెస్లా ఒత్తిడి చేస్తోంది. కానీ భారత ప్రభుత్వం స్థానిక తయారీని కోరుకుంటోంది, చర్చలు సాగుతున్నాయి’’ అని శ్రీనివాసన్ చెప్పారు.
ఈ పర్యటనలో భారత్ తన ఇంధన దిగుమతులను వైవిధ్యపరచడానకి కూడా ప్రయత్నించింది. అమెరికా నుంచి కీలకమైన సహజ గ్యాస్ వాయువును దిగుమతి చేసుకోవడానికి అంగీకరించింది. అయితే ధర నిర్ణయం అనేది అడ్డంకిగా మారింది.
తహవ్వూర్ రాణా అప్పగింత..
26/11 ఉగ్రవాద నిందితుడు తహవ్వూర్ రాణా అప్పగించడానికి అమెరికా ఆమోదం తెలిపింది. ఇది ప్రధాన దౌత్యపరమైన విజయం. ఉగ్రవాదంపై ఇరు దేశాలు కలిసి పనిచేస్తాయని ప్రకటించడం కూడా మోదీ విజయమే.
‘‘ఉగ్రవాదీ తహవ్వూర్ రాణాను విచారించడానికి భారత్ కు అమెరికా అప్పగించడం మోదీ సాధించిన గొప్ప విజయం. ఇది ఉగ్రవాదాన్ని ఎదుర్కోవడంలో ఆయన విధానాలను బలపరస్తుంది. గత ప్రభుత్వాల పని తీరు నుంచి ఆయన ప్రభుత్వాన్ని వేరుపరిచే అంశం’’ అని శ్రీనివాసన్ విశ్లేషించారు.
మెగా సంబంధం..
ఇద్దరు నాయకులు అమెరికా - భారత్ మధ్య ఉన్న సంబంధాలను ‘‘మెగా భాగస్వామ్యం’’ అని అంచనా వేసినప్పటికీ ఈ బంధం కేవలం లావాదేవీలపరంగానే ఉంటుందని హెచ్చరిస్తున్నారు.
‘‘ట్రంప్ ఓ వ్యాపారవేత్త. ఆయనకు మెరుగైన ఒప్పందాలతో తన వాణిజ్యం, సైనిక పరికరాల అమ్మకం, లోటు పూడ్చుకోవడం కావాలి. అదే సమయంలో భారత్ తన వ్యూహాత్మక ప్రయోజనాలను కాపాడుకోవాలి’’ అని కృష్ణ స్వామి అన్నారు.
సుంకాలు, రక్షణ కొనుగోళ్లు, వలసల వంటి ముఖ్యమైన పరిష్కారం కాకపోవడంతో మోదీ పర్యటన ప్రభావం రాబోయే నెలల్లో కనిపిస్తుందని అన్నారు.


Tags:    

Similar News