నేపాల్: కేపీ శర్మ ఓలీ తరువాత ఎవరూ?
హిమాలయ రాజ్య సంక్షోభంలో డీప్ స్టేట్ పాత్ర ఏమైనా ఉందా?;
నేపాల్ లో చెలరేగిన హింస తరువాత కేపీ శర్మ ఓలీ రాజీనామా తో ఏర్పడిన రాజకీయ సంక్షోభం గురించి ‘ది ఫెడరల్’ కన్సల్టెంట్ ఎడిటర్ కేఎస్ దక్షిణమూర్తితో మాట్లాడింది. నేపాల్ రాజకీయ సంస్కృతికి జనరల్ జెడ్ నిరసనలు ఎలాంటి ప్రభావాన్ని చూపించాయని విశ్లేషించడంతో పాటు భారత్, చైనా వీటిని చూస్తున్నాయో చెప్పారు.
కేపీ శర్మ ఓలీ రాజీనామా తరువాత నేపాల్ లో పరిస్థితిని మీరు ఎలా అర్థం చేసుకుంటారు? నాయకత్వ శూన్యత ఉందా?
ఇది నాయకత్వ శూన్యత కంటే చాలా తీవ్రమైనది. నేపాల్ రాజ్యాంగం మనుగడ గురించి ప్రశ్నలు ఉన్నాయి. కొన్ని ప్రాంతాల ప్రజలు దీనిని పున: పరిశీలించాల్సిన అవసరం ఉందని వాదిస్తున్నారు.
2008 నుంచి నేపాలీ కాంగ్రెస్ కు చెందిన షేర్ బహదూర్ దేవుబా, సీపీఎన్(మావోయిస్ట్ సెంటర్) కు చెందిన పుష్ఫ కమల్ దహల్ ప్రచండ, సీపీఎన్- యూఎంఎల్ కు చెందిన కేపీ శర్మ ఓలి వంటి నాయకులు వివిధ రూపాల్లో అధికారాన్ని పంచుకున్నారు. ఇదే ఈ తిరుగుబాటుకు కారణంగా చెప్పవచ్చు.
క్షేత్ర స్థాయిలో ఆర్థిక పెరుగుదల లేదు. నిరుద్యోగం పీడిస్తోంది. ఇది దేశంలో 22-23 శాతంగా ఉంది. పనికోసం బయటకు వలసలు నిరాటంకంగా కొనసాగుతున్నాయి. యువతరం, ప్రజల్లో నిరాశ అంతరాల్లో పాతుకుపోయింది.
కొందరు రాచరికాన్ని ఇంతకంటే మెరుగైనదిగా ఉండేదని వాదిస్తున్నారు. కానీ ఇది నిజమైనది కాదు. ఇది నిజంగా అలాంటి మానసిక స్థితిని బయటపెట్టింది.
మంగళవారం మనం చూస్తున్నది స్పష్టమైన నాయకత్వం లేకుండా అకస్మాత్తుగా జరిగిన అల్లర్లు. బాలేన్ షా, మాజీ ప్రధాన న్యాయమూర్తి సుశీలా కర్కి వంటి పేర్లు సంఘటనలు జరిగిన తరువాత వెలుగులోకి వచ్చాయి.
పోలీసు కాల్పుల్లో మరణాలు పార్లమెంట్ భవనానికి జరిగిన నష్టాన్ని దృష్టిలో ఉంచుకుంటే తిరుగుబాటుకు ఒక ఫలితం రావాలి. నేపాల్ ఒక కీలకమైన దశలో ఉంది. కొత్తతరం జనరల్ జెడ్ అధికారంలోకి రావడానికి అనువైనదిగా కనిపిస్తోంది.
బాలెన్ షా ప్రజాదరణ పొందిన వ్యక్తిగా మూడు ప్రధాన నిర్మాణాలతో సంబంధం లేని వ్యక్తిగా కనిపిస్తున్నారు. సుశీలా కార్కి స్వతంత్య్ర తీర్పులను రాసి మంచి పేరు తెచ్చుకున్నారు.
ప్రజలు అధికారంలో లేకుండా ఒక నిర్ధిష్ట మార్పును తీసుకురాగల వ్యక్తిని కోరుకుంటున్నట్లు కనిపిస్తోంది. ఆశ, ఆశావాదం ఎల్లప్పుడూ అటువంటి తిరుగుబాట్లతో పాటు ఉంటాయి. అది నేడు స్పష్టంగా కనిపిస్తోంది.
ఈ తిరుగుబాటు నేపాల్ రాజకీయ సంస్కృతిని మార్చి, దీర్ఘకాలిక సంస్కరణలను అందింస్తుందా?
ప్రభుత్వం సోషల్ మీడియా నిషేధం విధించిన తరువాత ఇది ప్రారంభం అయింది. వేగంగా వ్యాప్తించి బడబాగ్నిలా మార్చింది. నేపాల్ ఇప్పుడు కూడలిలో ఉంది. ఇందులో ఒకటి ఒక ప్రజాస్వామ్య పునర్జీవనం.. అంటే రాజ్యాంగం, పార్లమెంట్, సంస్థాగత చట్రాన్ని నిలుపుకోవడం, కొత్త నాయకులను తీసుకురావడం.
మరొకటి రాజ్యాంగం, పార్టీ వ్యవస్థతో సహ 2008- లో పరిష్కరించబడిన ప్రాథమిక ప్రశ్నలను తిరిగి తెరవడం. రాచరికం తిరిగి తేవాలని లేదా నేపాల్ ను లౌకికంగా ఉండటానికి బదులుగా హిందూ రాష్ట్రంగా ప్రకటించాలని ఆ వైపు వెళ్లడం. ఇవి ప్రధాన స్రవంతిలోకి వస్తాయా? లేదా అని కచ్చితంగా తెలియదు. కానీ చర్చ మాత్రం ఉంది.
నేపాల్ లో పాత నాయకత్వం కనుమరుగైంది. నాయకులు కుటుంబాలు తప్పించుకోవడానికి ప్రయత్నిస్తున్నట్లు నివేదికలు వస్తున్నాయి. గణతంత్య్రం, లౌకికవాదం, ప్రజాస్వామ్యం, సమర్థించే వారికి ఒక చట్రం ఉంటుంది.
సంక్షోభాల నుంచి బయటపడి నిర్థిష్టంగా పాలన అందించే నాయకత్వం. రాజ్యాంగాన్ని తిరిగి రాసుకోవడానికి ఏడు సంవత్సరాలు పట్టింది. ఆ ప్రక్రియ తిరిగి ప్రారంభించడం చాలా కష్టమైన పని. ఇప్పటికే ఉన్న నిర్మాణాన్ని ఉపయోగించి ముందుకు సాగడం సులభం.
ఓలీ పతనంలో డీప్ స్టేట్ కుట్ర ఉందనే వాదనలు బలంగా వినిస్తున్నాయి. సీక్రెట్ హ్యండ్స్ వాదనలు ఎంతవరకు నిజం? వాటిని నమ్మోచ్చా?
ఇలాంటి సమయంలో డీప్ స్టేట్ హస్తం ఉందని చెప్పడం కొంతమందికి ఉత్సాహం కలిగిస్తుంది. ఇవి ఎక్కువగా కుట్ర సిద్ధాంతంలో భాగంగా బయటకు వస్తాయి. పైకి చూస్తే సంఘటనలను నియంత్రించే కీలుబొమ్మలాటా వ్యక్తి కనిపించడం లేదు.
బాహ్యంగా భారత్, చైనా, యూఎస్ఏ ముగ్గురు కనిపిస్తారు. కానీ ఇక్కడ ఎవరికి స్పష్టమైన ఉద్దేశ్యాలు లేవు. భారత్, చైనాకు ఇక్కడ మంచి ప్రభావం ఉంది. అమెరికా ఇక్కడ నుంచి దూరంగా ఉంది.
తక్షణ జోక్యానికి దానికి కారణం కనిపించడం లేదు. అంతర్గతంగా ఒకే సమూహం నియంత్రణలో ఉందని ఊహించుకోవడం కూడా కరెక్ట్ కాదు. ఇక్కడ నాయకత్వ లేమీ, అస్తవ్యస్థ తిరుగుబాటు కనిపించింది. కొన్ని సందర్భాలలో అరాచకం హద్దులు దాటింది. దీన్ని బట్టి చూస్తే ఇది ఎవరూ నియంత్రించలేదని అర్థమవుతోంది. ఇప్పుడు ప్రజలు, సైన్యం శాంతి భద్రతలను పునరుద్దరించడానికి కదులుతున్నప్పటికీ ఇందులో ఏవీ ముందస్తు ప్రణాళికతో చేసినట్లు కనిపించడం లేదు.
శ్రీలంక, బంగ్లాదేశ్ లో జరిగిన తిరుగుబాట్లతో ఇక్కడ పోలీకలు ఉన్నాయంటున్నారు? ఇవి నిజమేనా?
ఈ సారూప్యతలు అద్భుతమైనవి. 2022- 2025 కాలంలో ఇవి జరిగాయి. ఎక్కువగా ఆకస్మికంగా జరిగిన తిరుగుబాట్లు వాటి కారకాలు భిన్నంగా ఉంటాయి. శ్రీలంకలో 2022 లో గోటబాయ రాజపక్సే, మహిందా రాజపక్సే హాయాంలో తీవ్రమైన ఆర్థిక నిర్వహణ లోపం, రుణ సంక్షోభం దీనికి ముఖ్య కారణం. ఇంధన కొరత, ప్రాథమిక అవసరాలకు కూడా క్యూలో నిల్చోవడం ప్రజల్లో తీవ్ర వ్యతిరేకతకు కారణం అయ్యాయి. దీనితో నిరసనలు చెలరేగాయి.
నిరసనకారులు అధ్యక్షుడిని లక్ష్యంగా చేసుకున్నారు. పార్లమెంట్ ను మాత్రం ముట్టుకోలేదు. దీని వలన ఎంపీలు రణిల్ విక్రమ సింఘేను ఎన్నుకున్నారు. ఆయన తరువాత ఐఎంఎఫ్ వైపు మొగ్గు చూపారు. భారత్ భౌతికంగా సాయం చేసింది. బాహ్య కుట్ర లేదు.
బంగ్లాదేశ్ లో 2024 లో షేక్ హసీనా రాజకీయంగా స్థిరంగా ఉన్నప్పటికీ నిరంతర అణచివేత, ప్రతిపక్షాలను లక్ష్యంగా చేసుకోవడం వల్ల ఆగ్రహం ఏర్పడింది. బంగ్లా విముక్తి యుద్ధంలో ముడిపడి ఉన్న ఉద్యోగాల కోటాను పునరుద్దరించాలని సుప్రీంకోర్టు తీర్పు ఇవ్వడం మరొక కారణం. ప్రభుత్వ కఠిన వైఖరి ఉద్యమాన్ని ఉధృతం చేసింది. ఫలితంగా ఆమె భారత్ కు పారిపోయి వచ్చింది. న్యూఢిల్లీతో నెరిపిన సన్నిహిత సంబంధాలను ఆమెకు ఆశ్రయం లభించేలా చేసింది.
అమెరికా తన ప్రభావాన్ని ఉపయోగించుకుని మహ్మద్ యూనస్ ను పీఠంపై కూర్చోబెట్టింది. జమాతే ఇ ఇస్తామీ అనుబంధ విద్యార్థి సంఘాలు ఇప్పుడు పుంజుకున్నాయి. తరువాత సైన్యం రంగంలోకి దిగి శాంతిని పునరుద్దరించింది.
నేపాల్ లో చాలాకాలంగా రాజకీయ అస్థిరత రాజ్యమేలుతోంది. ఆర్థిక పురోగతిలో వైఫల్యం, ఉన్నత వర్గాల ఆధిపత్యం ఈ ఉద్యమానికి ఇంధనంగా పనిచేసింది. నిరుద్యోగం, జీవనోపాధిపై జెన్- జెడ్ కోపం వ్యక్తం చేసింది. బయట ఈ ఉద్యమాలలో సారూప్యతలు ఉన్నప్పటికీ అంతర్గత కారణాలు భిన్నంగా ఉన్నాయి. మనం వీటిని జాగ్రత్తగా పరిశీలించాలి.
ఈ పరిణామాలతో భారత్, చైనాలు.. నేపాల్ లో దశను ఎలా మార్చబోతున్నాయి?
ఎవరూ అధికారంలో ఉన్నా నేపాల్ విషయంలో భారత్, చైనా కీలకంగా వ్యవహరిస్తాయి. భారత్- నేపాల్ సంబంధాలు చారిత్రకంగా దగ్గరగా ఉన్నాయి. సాంస్కృతిక సంబంధాలు, భాషాపరమైన అనుబంధం, వీసాలు లేకుండా ఉన్న సరిహద్దులు. కానీ ఇక్కడ నేపాల్ మన రాష్ట్రం కాదు.
2015 లో కొన్ని సార్లు భారత్ కొన్నిలైన్లు అతిక్రమించింది. ఇది ప్రజాభిప్రాయ రంగును పులుముకుంది. చాలామంది నేపాలీలు భారత్ లో పనిచేస్తున్నారు. ప్రజల మధ్య సంబంధాలకు విలువ ఇస్తారు.
కొందరూ రాజకీయంగా భారత్ ను పెద్ద అన్నగా భావిస్తారు. న్యూఢిల్లీ ఇప్పుడు చాలా సున్నితంగా వ్యవహరించాలి. రాజ్యాంగాన్ని సమర్థించే వర్గం, హిందూ దేశంగా మార్చే నినాదాలు.. అక్కడ వినిపిస్తున్నాయి.
ముఖ్యంగా 2015 తరువాత సాయం చేయడానికి ముందుకు వచ్చిన తరువాత చైనా మరింత ప్రభావవంతంగా మారింది. బీజింగ్ రోజువారీ రాజకీయాలలో తన మాట చెల్లుబాటు అయ్యేలా చేసుకుంది.
అంతిమంగా తదుపరి నేపాలీ నాయకత్వం రెండింటిని ఎలా సమతుల్యం చేస్తుందనేది కీలకం. భారత్, చైనా రెండింటికి లొంగిపోకుండా నేపాల్ కు ప్రయోజనం చేకూరాలి. అయితే ఏ సందర్భంలో నైనా పెద్ద శక్తులు మాత్రం పెద్ద పాత్రలు పోషిస్తూనే ఉంటాయి.