డెలివరీ వర్కర్లకు గుడ్ న్యూస్ చెప్పిన కేంద్రం..

ప్రస్తుతం జొమాటో, స్విగ్గీ, జెప్టో, అమెజాన్, మీషో అంటూ అనేక ఆన్‌లైన్ డెలివరీ సంస్థల్లో పనిచేస్తున్న డెలివరీ ఉద్యోగులకు కేంద్రం ప్రత్యేక పథకం తీసుకొచ్చింది.;

Update: 2025-02-01 06:26 GMT

ప్రస్తుతం జొమాటో, స్విగ్గీ, జెప్టో, అమెజాన్, మీషో అంటూ అనేక ఆన్‌లైన్ డెలివరీ సంస్థలు అందుబాటులో ఉన్నాయి. వీటి ద్వారా ఆర్డర్ చేస్తే ఇంటికే డెలివరీ వస్తుంది. ఫుడ్, గ్రాసరీ, ఎలక్ట్రానిక్స్, ఎలక్టికల్ అప్లియన్సెస్ ఇలా ఏదైనా ఇంటికి తెచ్చి ఇస్తారు డెలివరీ ఏజెంట్లు. వీరికి ఇప్పటి వరకు ఉద్యోగ భద్రత లేదు. ప్రతి రోజూ కూడా దినదిన గండంగానే వీరి ఉద్యోగం సాగేది. అటువంటి వారికి కేంద్రం ప్రభుత్వం శుభవార్త చెప్పింది. వారికి సైతం సామాజిక భద్రతా పథకాన్ని అందుబాటులోకి తీసుకొచ్చింది. గిగ్ వర్కర్ కోసం సోషల్ సెక్యూరిటీ కంట్రిబ్యూష్ సిస్టమ్ ద్వారా పెన్షన్ అందించనున్నట్లు వెల్లడించారు. ఈ రోజు కేంద్రం బడ్జెట్ ప్రసంగంలో ఈ విషయాన్ని కేంద్ర ఆర్థిక శాఖ మంత్రి నిర్మలాసీతారామన్ వెల్లడించారు.

గిగ్ వర్కర్ల సమస్యలు..

ప్రపంచ వ్యాప్తంగా 2008లో ఆర్థిక సంక్షోభం వచ్చాక పరిస్థితి ఇంకా దుర్భరమైంది. యాప్ కంపెనీల ద్వారా పనిచేసే గిడ్ వర్కర్ల వ్యవస్థ ఏర్పడింది. గంటల చొప్పున కూడా కాదు. పని ఉంటేనే వేతనం. రోజంతా పని ఉండదు. పని ఉంటేనే ఆ పని ఉన్నమేరకు డబ్బులు. ఈ పద్ధతిలో వారిని పార్టనర్స్ ఉంటారు. సరిగా డెలివరీ చేస్తున్నారా లేదా చూస్తారు. 32 ఏళ్ళ లోపు వారినే అపాయింట్ చేసుకుంటున్నారు. వారికి చాలా తక్కువ రెమ్యూనిరేషన్. స్విగ్గి, జుమాటో లో పనిచేస్తున్న గిగ్ వర్కర్లు (Gig Workers) ఆర్డర్లను అందచేయడానికి టిఫిన్ బాక్స్, బైక్ అన్నీ ఆ వర్కరే సమకూర్చుకోవాలి. యజమానికి ఏ బాధ్యత లేదు. అన్నీకూడా గిడ్ వర్కరే చూసుకోవాలి. కార్మికుల కొచ్చే ఏ శ్రేయస్సు లేదు. ఎప్పుడు పని దొరుకుతుందా అని ఎదురుచూస్తాడు. ఫోన్ వచ్చిన 30 సెకండ్ల లోపు ఆమోదం తెలపాలి. రోజంతా సెల్ పుచ్చుకుని చూసుకోవాలి. తక్కువ పని ఇచ్చినా తప్పదు. స్వేచ్చగా చేస్తున్నాడంటే ఎలా? ఇందులో శ్రమ దోపిడీ అత్యున్నత స్థాయి కి చేరుకుందని ఇంటర్నేషనల్ లేబర్ ఆర్గనైజేషన్ అంటోంది.

ఊబర్, ఓలా టాక్సీ సర్వీసు లక్షల మందికి అందుతోంది. ఊబర్ ఒక కారు కూడా కొనుక్కోదు. ఒక డ్రైర్ ను ఏర్పాటు చేసుకోదు. ఊబర్ కు కానీ, ఓలాకు కాని చెపితే కారో, ఆటోనో మన ముందుకు వచ్చేస్తుంది. ఊబర్ ఆటోలున్నాయి. స్థానికంగా తిరగడానికి మనం బుక్ చేస్తే వస్తుంది. మెయింటెనెన్స్ అంతా డ్రైవర్ దే. నయాపైసా పెట్టుబడి, ఏ రిస్కు లేకుండా కార్మికుడిని దోపిడీ చేసే వ్యవస్థ ఇది. ఇంత చేసినా వారి ఉద్యోగానికి ఎటువంటి భద్రతా లేదు. ఏ రోజున ఉద్యోగం నుంచి పీకేస్తారో తెలియక వారు భయంభయంగానే ప్రతిరోజూ ప్రారంభించాల్సి ఉంది. అటువంటి వారికి కేంద్రం చేసిన ప్రకటన ఉంతో స్వాంతన అందిస్తుంది.

గిగ్ వర్కర్లకు ఐడీ కార్డ్‌లు

బడ్జెట్ ప్రసంగంలో గిగ్ వర్కర్లకు గుడ్ న్యూస్ చెప్పారు నిర్మలా సీతారామన్. గిగ్ వర్కర్లకు కూడా హెల్త్ ఇన్యూరెన్స్ అందించడం కోసం తమ ప్రభుత్వం ‘జన్ ఆరోగ్య పథకం’ తీసుకురానున్నట్లు తెలిపారు. దీని కింది ప్రతి గిగ్ వర్కర్‌కు ఐడీ కార్డ్ అందించనున్నట్లు వెల్లడించారు. ‘‘న్యూ-ఏజ్ ఎకానమీకి గిగ్ వర్కర్లు కొత్త ఉత్సాహం అందిస్తున్నారు. వారికి ప్రభుత్వం ఐడీ కార్డ్లు, రిజిస్ట్రేషన్‌లను అందించనుంది. అంతేకాకుండా పీఎం జన్ ఆరోగ్య యోజన కింద వారికి ఆరోగ్య బీమా కూడా అందించనున్నాం. కోటికి పైగా గిగ్ వర్కర్‌లకు ఉపయోగపడేలా చర్యలు తీసుకోబడతాయి’’ అని నిర్మలమ్మ వెల్లడించారు.

Tags:    

Similar News