ఆ ఆర్థిక మంత్రి రికార్డ్ సమం చేయనున్న నిర్మలా సీతారామన్

భారత ఆర్థికమంత్రి నిర్మలాసీతారామన్ ఇంకొక్క అడుగు వేస్తే దేశంలోని మిగిలిన ఆర్థికమంత్రుల సరసన నిలుస్తారు. ఏంటా రికార్డ్.. ఏమా వివరాలు

Update: 2024-01-26 14:35 GMT
కేంద్ర ఆర్థికమంత్రి నిర్మలా సీతారామన్

కేంద్ర ఆర్థికమంత్రి నిర్మలా సీతారామన్ ఫిబ్రవరి 1న బడ్జెట్ ప్రవేశపెడితే, వరుసగా ఆరుసార్లు బడ్జెట్ ప్రవేశపెట్టిన మాజీ ప్రధాని మొరార్జీ దేశాయ్ సరసన చేరతారు. అలాగే ఫిబ్రవరి 1న మధ్యంతర బడ్జెట్ ప్రవేశపెడితే వరుసగా ఐదు బడ్జెట్ లను ప్రవేశపెట్టిన మాజీ ప్రధాని మన్మోహన్ సింగ్, అరుణ్ జైట్లీ, పి చిదంబరం, యశ్వంత్ సిన్హా వంటి మాజీ ఆర్థిక మంత్రుల రికార్డులను అధిగమిస్తారు.

ఆర్థికమంత్రిగా మొరార్జీ దేశాయ్ ఇంతకుముందు 1959 నుంచి వరుసగా 1964 వరకు వరుసగా ఐదు బడ్జెట్ లను ప్రవేశపెట్టారు. తరువాత ఒక మధ్యంతర బడ్జెట్ ను సమర్పించారు. 2024-25 సంవత్సరానికి కూడా నిర్మలా సీతారామన్ ఓట్ ఆన్ అకౌంట్ బడ్జెట్ సమర్పిస్తే కూడా వరుసగా ఆరుసార్లు బడ్జెట్ సమర్పించిన మాజీ ప్రధాని మొరార్జీ దేశాయ్ సరసన నిలుస్తారు.

అయితే ఈ సారి నిర్మలా సీతారామన్ ప్రవేశపెట్టేది తాత్కాలిక బడ్జెట్ కావడంతో ఇందులో పెద్దగా విధానపరమైన మార్పులు ఉండకపోవచ్చు. ఏప్రిల్- మే సార్వత్రిక ఎన్నికల వరకూ నిర్దిష్ట మొత్తంలో డబ్బు ఖర్చు చేసే అధికారాన్ని ఇస్తుంది. తరువాత వచ్చే ప్రభుత్వం జూలైలో పూర్తి స్థాయి బడ్జెట్ ను ప్రవేశపెడుతుంది.

2014 లో మోదీ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తరువాత అరుణ్ జైట్లీ ఆర్థిక మంత్రిగా బాధ్యతలు స్వీకరించారు. తరువాత వరుసగా అంటే 2014-15 నుంచి 2018-19 వరకు ఐదు బడ్జెట్ లను సమర్పించారు. అయితే అనారోగ్య కారణాల రీత్యా తరువాత పీయూష్ గోయల్ మధ్యంతర బడ్జెట్ సమర్పించారు.

అలాగే బానిస చిహ్నలను చెరిపేయడమే లక్ష్యంగా పెట్టుకున్న మోదీ సర్కార్, బడ్జెట్ సమర్పించే తేదీని ఫిబ్రవరి చివరి తేదీ నుంచి ఫిబ్రవరి 1 కి మార్చింది. అలాగే పాత సంప్రదాయ బడ్జెట్ బ్రీఫ్ కేసును తీసివేసి జాతీయ చిహ్నంతో కూడిన ‘బహి- ఖాతా’ను ఆర్థిక మంత్రి సీతారామన్ ప్రవేశపెట్టారు. దీనిలో బడ్జెట్ ప్రసంగం, పత్రాలను లోక్ సభకు తీసుకెళ్తారు.

అత్యధిక బడ్జెట్ సమర్పించింది ఎవరంటే..

దేశంలో పది సార్లు బడ్జెట్ సమర్పించిన మంత్రిగా మొరార్జీ దేశాయ్ రికార్డ్ సృష్టించారు. ఇప్పటి వరకూ ఈ రికార్డు ను ఎవరూ బ్రేక్ చేయలేకపోయారు. అలాగే 1970-71 ఆర్థిక సంవత్సరానికి బడ్జెట్ ను ప్రధాని హోదాలో ఇందిరాగాంధీ ప్రవేశపెట్టారు.

అలా దేశంలో బడ్జెట్ ను ప్రవేశపెట్టిన తొలి మహిళగా ఇందిరాగాంధీ రికార్డు పుటల్లోకి ఎక్కారు. తరువాత దేశంలో బడ్జెట్ ప్రవేశపెట్టిన రెండో మహిళ ఆర్థికమంత్రి నిర్మలా సీతారామన్ చరిత్ర సృష్టించారు. ఇక స్వతంత్ర దేశంలో మొదటి బడ్జెట్ ను ఆర్ కే షణ్ముఖం చెట్టి సమర్పించారు.

భారతదేశం 2027-28 నాటికి 5 ట్రిలియన్ డాలర్ల ఆర్థిక వ్యవస్థగా మారుతుందని నివేదికలు చెబుతున్నాయి. అలాగే 2047 నాటికీ 30 ట్రిలియన్ డాలర్లు ఎకనామీగా మారుతుందని ప్రపంచ ఆర్థిక సంస్థలు అంచనాలు వెలువరిస్తున్నాయి.

Tags:    

Similar News