9వ సారి బీహార్ ముఖ్యమంత్రిగా నితీష్ - కాసేపట్లో ప్రమాణ స్వీకారం
ఎట్టకేలకు ఉత్కంఠ వీడిరది. జేడీ(యూ) అధినేత నితీష్ కుమార్ తన ముఖ్యమంత్రి పదవికి రాజీమానా చేసి గవర్నర్‌కు అందజేశారు. కొత్త ప్రభుత్వ ఏర్పాటే తరువాయి...
జేడీ(యూ)అధ్యక్షుడు నితీష్‌కుమార్ మరికాసేపట్లో బీహార్ ముఖ్యమంత్రిగా ప్రమాణ స్వీకారం చేయబోతున్నారు. ఆయన ఈ రోజు (జనవరి 28న) ఉదయం తన పదవికి రాజీనామా చేస్తున్నట్లు ప్రకటించారు. 18 నెలల కిందటే తాను విడిచిపెట్టిన బీజేపీతోనే తిరిగి జతకట్టి కొత్త ప్రభుత్వాన్ని ఏర్పాటు చేయబోతున్నారు నితీష్.
గవర్నర్ రాజీనామా పత్రం..
గవర్నర్ రాజేంద్ర అర్లేకర్‌కు తన రాజీనామాను సమర్పించిన తర్వాత పాట్నాలో నితీష్ విలేకరులతో మాట్లాడారు. ‘‘నేను నా రాజీనామాను గవర్నర్‌కు సమర్పించాను. సాయంత్రంలోగా కొత్త ప్రభుత్వాన్ని ఏర్పాటు చేసే అవకాశం ఉంది’’ అని చెప్పారు.
ఇటు రాష్ట్ర బీజేపీ కార్యాలయంలో పార్టీ ఇన్‌చార్జీ వినోద్ తావ్డే మాట్లాడుతూ.. జేడీ(యూ)కి మద్దతు ఇవ్వాలని, అలాగే ఎన్‌డీఏ ఆధ్వర్యంలో కొత్త ప్రభుత్వాన్ని ఏర్పాటు చేయాలన్న సూచనకు తమపార్టీ ఎమ్మెల్యేలందరూ అంగీకరించారని చెప్పారు.
గత ప్రభుత్వంలో ఆర్జేడీ అధినేత లాలూ ప్రసాద్ కుమారుడు తేజస్వి యాదవ్ ఉపముఖ్యమంత్రిగా, ఆయన పెద్ద సోదరుడు తేజ్ ప్రతాప్ యాదవ్ క్యాబినెట్ మంత్రిగా ఉన్నారు. శాసనసభలో ఆర్జేడీ ఎమ్మెల్యేలు 79 మంది ఉన్నారు.
72 ఏళ్ల నితీష్ రాష్ట్రంలోని మహాఘటబంధన్, ఇండియా కూటమిలోని పరిస్థితులపై తన అసంతృప్తిని వ్యక్తం చేశారు. భారత కూటమి ఏర్పాటుకు సారధ్యం వహించిన తనను కూటమి సరిగా గుర్తించలేదని ఆయన భావించారు. చైర్మన్ పదవి దక్కకపోవడం, భారత కూటమి తరుపున ప్రధాని అభ్యర్థిని ప్రకటించకపోవడంతో నితీష్ మనస్తాపానికి గురయ్యారని ఆయన సన్నిహితుల నుంచి వినిపిస్తున్న మాట.
‘‘నేను ఈ కూటమిలో ఎలా భాగమయ్యానో, పార్టీలను ఏకం చేయడానికి ఎలా కష్టపడ్డానో మీకు తెలుసంటూనే..రాష్ట్రంలో ఇటీవల జరిగిన రాజకీయ సమస్యలపై తాను ఏమీ మాట్లాడలేదని నితీష్ చెప్పారు.
జేడీయూ లెజిస్లేచర్ పార్టీ సమావేశం తర్వాత రాజీనామా లేఖను గవర్నర్‌కు సమర్పించడంతో కొత్త ప్రభుత్వం ఏర్పడే వరకు తాత్కాలిక ముఖ్యమంత్రిగా కొనసాగాలని గవర్నర్ నితీష్‌ను కోరినట్లు సమాచారం.
బీజేపీ జాతీయ అధ్యక్షుడు జగత్ ప్రకాశ్ నడ్డా సమక్షంలో ప్రమాణస్వీకారం జరిగే అవకాశం ఉందని ఇప్పటిదాకా ఉన్న సమాచారం.
నితీష్ తన తన పార్టీ ఎమ్మెల్యేలను విభజించానికి ప్రయత్నిస్తున్నారని ఆరోపిస్తూ.. ఆగస్ట్ 2022లో మహాఘటబంధన్‌లో చేరారు. ఆర్డేజీ, కాంగ్రెస్, మూడు వామపక్ష పార్టీలను కలుపుకొని సంకీర్ణ ప్రభుత్వాన్ని ఏర్పాటు చేశారు.
ప్రస్తుతం పార్టీల బలాబలాలు..
జేడీ(యూ) - 45, బీజేపీ - 78, ఆర్డేజీ - 79, కాంగ్రెస్ -19, లెఫ్ట్ పార్టీ - 16, హెచ్‌ఏఎం - 4, ఏఐఎంఐఎం - 1, ఇండిపెండెంట్ - 1. కాగా బలనిరూపణకు మ్యాజిక్ ఫిగర్ -124.
కాంగ్రెస్ ఫైర్..
ఇండియా కూటమి నుంచి వెదొలిగిన నితీష్‌పై కాంగ్రెస్ ఆగ్రహంతో ఉంది. కాంగ్రెస్ సీనియర్ నేత జైరాం రమేష్ మాట్లాడుతూ.. నితీష్ నిష్క్రమణతో కూటమికి నష్టమేమీ లేదన్నారు. నితీష్‌ను ఊసరవెళ్లితో పోలుస్తూ విమర్శలు చేశారు. ఇండియా కూటమి నిర్వహించిన అన్ని సమావేశాలకు హాజరైన ఆయనకు చాలా ప్రాధాన్యత ఇచ్చామని జైరాం చెపుకొచ్చారు.