రిసార్ట్, హోటళ్లకు ఎవరూ రారు: డీకే శివకుమార్

ఐదు రాష్ట్రాల్లో జరిగిన ఎన్నికల్లో కాంగ్రెస్ నుంచి గెలిచిన ఎమ్మెల్యేలు కర్నాటకకు రారని డిప్యూటీ సీఎం డీకే శివకుమార్ అన్నారు.

Translated by :  Chepyala Praveen
Update: 2023-12-02 09:47 GMT
డీకే శివకుమార్

ఫలితాల అనంతరం గెలిచిన అభ్యర్థులు బెంగళూర్ లో ఉన్న హోటళ్లు, రిసార్టులకు తరలిస్తారనే వార్తలను ఆయన ఖండించారు. స్థానిక నాయకత్వం వీటిని అక్కడే పరిశీలిస్తారని డీకే చెప్పారు. కాంగ్రెస్ అధిష్టానం నుంచి కానీ మిగతా ఎక్కడి నుంచి కానీ తనకు ఎటువంటి ఫోన్ కాల్స్ రాలేదని వివరించారు. 2017 నాటి రాజ్యసభ ఎన్నికల సందర్భంగా గుజరాత్ కి చెందిన 44 మంది కాంగ్రెస్ ఎమ్మెల్యేలను చేజారిపోకుండా చేసిన ఏర్పాట్లను తిరిగి చేయాలని కాంగ్రెస్ పార్టీ తనను కోరినట్లు వస్తున్నట్లు వార్తల్లో వాస్తవం లేదన్నారు.

ఐదు రాష్ట్రాల్లో జరిగిన ఎన్నికల్లో తామే విజయం సాధిస్తామని ఆయన ధీమా వ్యక్తం చేశారు. అయితే గుజరాత్ తరహ పరిస్థితి వస్తే, పార్టీ తనను ఆదేశిస్తే అలాంటి ఏర్పాట్లు చేస్తానని ఆయన ఓ ప్రశ్నకు సమాధానంగా చెప్పారు. కాగా ఐదు రాష్ట్రాల అసెంబ్లీ ఎన్నికలు నవంబర్ ఏడున మొదలై 30 న ముగిశాయి. డిసెంబర్ మూడున ఎన్నికల ఫలితాలు విడుదల కానున్నాయి. తెలంగాణ ఎన్నికల ఫలితాల అనంతరం ఏం చేయాలనే దానిపై డీకే శివకుమార్ దృష్టి పెట్టినట్లు తెలుస్తోంది. అందులో భాగంగా సాయంత్రం డీకే హైదరాబాద్ రానున్నారు. ఇక్కడ పూర్తి మెజారిటీతో ప్రభుత్వాన్ని ఏర్పాటు చేస్తామని ఆయన ఇప్పటికే ధీమా వ్యక్తం చేశారు. ప్రతి కాంగ్రెస్ అభ్యర్థి వెనక ఒక ఏఐసీసీ పరిశీలకులను నియమిస్తారని తెలుస్తోంది. ఎన్నికల సంఘం గెలుపు ధృవపత్రం జారీ చేసిన వెంటనే వారిని హైదరాబాద్ కు తీసుకువస్తారని సమాచారం. 

Tags:    

Similar News