జమ్మూలోని ఎయిర్ పోర్ట్ పై దాడి చేసిన పాకిస్తాన్
పఠాన్ కోట్, జైసల్మీర్, పోఖ్రాన్ పై మిస్సైళ్ల వర్షం కురిపించిన దాయదీ దేశం;
పాకిస్తాన్ దుస్సాహానికి దిగింది. జమ్మూలోని తొమ్మిది ప్రాంతాలపై ఆత్మాహుతి డ్రోన్లు, మిస్సైళ్లతో దాడులకు దిగింది. అలాగే పఠాన్ కోట్ లోని వైమానిక స్థావరంపై ఎఫ్- 16 తో దాడికి దిగింది.
అయితే భారత ఎయిర్ ఢిపెన్స్ వ్యవస్థ ఈ దాడులను అడ్డుకుని ఎఫ్ -16 ని కూల్చివేసింది. ఈ యుద్ద విమానానికి తోడుగా వచ్చిన రెండు జేఎఫ్-10 విమానాలను సైతం న్యూట్రలైజ్ చేసినట్లు తెలుస్తోంది.
పాకిస్తాన్ దాడులతో దేశంలోని ఉత్తర భారతంలో ఎక్కడికక్కడ విద్యుత్ సరఫరాను ప్రభుత్వం నిలిపివేసింది. జైసల్మీర్ లోని వైమానికి స్థావరం పైకి కూడా పాక్ ఆత్మాహుతి దాడులు చేశారు.
వీటిలో ఎంతమేర నష్టం జరిగిందనే విషయంలో స్పష్టత లేదు. సరిహద్దులో భారీ ఎత్తున దాడులు, ప్రతిదాడులతో దద్దరిల్లుతున్నాయి. సైరన్ల మోతలతో ఉత్తర భారతంలో గంభీర వాతావరణం నెలకొంది.
ప్రస్తుతం అందుతున్న సమాచారం ప్రకారం.. భారత్ ధీటుగా బదిలిస్తోంది. ఇప్పటి వరకూ ఎనిమిది మిస్సైళ్లను కూల్చివేసింది. అనేక ఆత్మాహుతి డ్రోన్లను సైతం సరిహద్దు నగరాలకు పంపింది. వీటిలో కొన్ని భారత ఆర్మీ కంటోన్మెంట్లలో తాకినట్లు సమాచారం.