పొత్తు కుదిరింది, ప్రధాని మోదీ రాకకు ముహూర్తమూ కుదిరింది

చాలా కాలం సస్పెన్స్ లో నానినా, బిజెపి, టిడిపి, జనసేనల పొత్తు చకచకా పూర్తయింది. అంతేకాదు, ప్రధాని మోదీతో క్యాంపెయిన్ మొదలు పెట్టించాలని కూడా నిర్ణయం జరిగింది...

Update: 2024-03-09 16:51 GMT


బిజెపి, తెలుగుదేశం, జనసేన పార్టీల పొత్తు కుదిరింది. ఉమ్మడి క్యాంపెయిన్ కూ ముహూర్తం కుదిరింది. 
ఈ నెల 17న లేదా 18న  ఏపీకి ప్రధాని మోదీ ఒక ఉమ్మడి  బహిరంగ సభలో ప్రసంగించే  అవకాశం ఉంది. ఈ భారీ బహిరంగ సభ నిర్వహణకు ఏర్పాట్లు చేయాలని టిడిపి అధితనేత చంద్రబాబు నాయుడు పార్టీ నేతలను పరమయించారు.  ఢిల్లీలో పొత్తు గురించి ఉమ్మడి ప్రకటన వెలవడిన తర్వాత   చంద్రబాబు పార్టీ ముఖ్యనేతలతో టెలీకాన్ఫరెన్స్ నిర్వహించి  ఢిల్లీ పొత్తు చర్చలు సారాంశం. పొత్తుకు దారి తీసిన పరిస్థితులను వివరించారు.
బీజేపీతో పొత్తు ఖరారైందని  రాష్ట్రాభివృద్ధి ప్రజల ప్రయోజనాలను దృష్టిలో పెట్టుకునే బీజేపీ పొత్తు పెట్టుకున్నట్లు ఢిల్లీ నుంచి  ఆయన వివరించారు. అంతుకు ముందు పొత్తుకు స్వాగతం పలుకుతూ ట్వీట్ ేశారు.  ప్రధాని మోదీ, హోంమంత్రి అమిత్ షా నాయకత్వంలో దేశం పురోగమిస్తూ ఉందని, తెలుగుదేశం పార్టీ ఎన్ డిఎ చేరడం వల్ల ఆంధ్రప్రదేశ్ ప్రజలకు ఈ అభివృధి ఫలాలు దక్కుతాయని ఆయన పేర్కొన్నారు. ఈ పొత్తు వల్ల రాష్ట్ర ప్రజలు వచ్చే ఎన్నికల్లో ఒక చారిత్రక  నిర్ణయం తీసుకుంటారని,  అది ఆంధ్ర ప్రజల  బంగారు భవిష్యత్తు బాట వేస్తుందని పేర్కొన్నారు.


ఇది ఇలా ఉంటే పొత్తు గురించి బిజెపి, టిడిపి, జనసేనల నుంచి ఒక ఉమ్మడి  ప్రకటన ఢిల్లీలో వెలువడింది. మూడు పార్టీల పొత్తును కేంద్ర హోం మంత్రి అమిత్ షా ప్రశంసించారు.
 తెలుగుదేశం పార్టీ, జనసేనలు ఏన్డీయేలో చేరడం అంటే ప్రధాని మోదీ నాయకత్వంలో విశ్వాసం ప్రకటించడమే నని షా ట్వీట్ చేశారు. ప్రధాని నాయకత్వంలో ఎన్డీయే ఇంకా విస్తరిస్తూ ఉందని, ఈ రెండు పార్టీలుచేరిక ఆంధ్రప్రజల కోరికలు ఈడేరుతాయని ఆయన వ్యాఖ్యానించారు.



 బీజేపీతో సీట్ల పంపకంపై చివరి దశకు చేరుకుందని, మరో సమావేశం తర్వాత పూర్తి స్పష్టత వస్తుందని ఈ సంయుక్త ప్రకటనలో పేర్కొన్నారు. చంద్రబాబు నేతలకు తెలిపారు.
టీడీపీ-బీజేపీ-జనసేన మధ్య పొత్తుపై ఎలాంటి గందరగోళం లేదని అన్నారు. జగన్ మోహన్ రెడ్డి ఐదేళ్ల పాలనలో ఏపీ తీవ్రంగా దెబ్బతిన్న నేపథ్యంలో, కేంద్రం సహకారం అవసరమని, పొత్తుకు ఇదే కారణమని చంద్రబాబు నేతలకు వెల్లడించారు.

ఈ నెల 17న టీడీపీ-జనసేన నిర్వహించే ఉమ్మడి భారీ బహిరంగ సభకు ప్రధాని నరేంద్ర మోడీని ఆహ్వానించామని మూడు పార్టీలు కలిసి ఉమ్మడి సభతో ఎన్నికల క్యాంపెయిన్ ప్రారంభిస్తాయని నేతలతో చంద్రబాబు తెలిపారు.


Tags:    

Similar News