ప్రజా దర్బార్ పేరు మారింది!
ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ప్రవేశపెట్టిన ప్రజాదర్బార్ పేరు మారింది. జ్యోతి రావు పూలే ప్రజా భవన్ గా మారిన ప్రగతి భవన్ లో ప్రతి మంగళ, శుక్రవారాల్లో నిర్వహిస్తారు.
By : The Federal
Update: 2023-12-11 16:29 GMT
ప్రజా సమస్యలను తెలుసుకునేందుకు తెలంగాణ నూతన ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ప్రవేశపెట్టిన ప్రజాదర్బార్ పేరు మారింది. ఇకపై ఆ కార్యక్రమాన్ని ప్రజావాణిగా పిలుస్తారు. ప్రస్తుతం జ్యోతి రావు పూలే ప్రజాభవన్ గా మారిన ప్రగతి భవన్ లో ప్రతి మంగళ, శుక్రవారాల్లో నిర్వహిస్తారు. ప్రజలు తమ కష్టనష్టాలను పరిష్కరించే ప్రజావాణి ఇక నుంచి ప్రతీ మంగళ, శుక్ర వారాల్లో రెండు రోజుల పాటు జరుగుతుంది. ఉదయం 10 గంటల నుంచి మధ్యాహ్నం ఒంటి గంట వరకు ఉంటుంది. ఈ ప్రజావాణికి ఉదయం 10 గంటల లోపు పూలే భవన్ కు వచ్చే వారికి అవకాశం ఇస్తారు. వికలాంగులు, మహిళలకు ప్రత్యేక క్యూ-లైన్లు ఉంటుంది. సమస్యలు చెప్పుకునేందుకు వచ్చే వారికి అసౌకర్యం లేకుండా మంచినీళ్లు, మూత్రశాలలు ఏర్పాటు చేయాలని ప్రభుత్వం నిర్ణయించింది.