సుప్రీం సంచలన తీర్పుపై ప్రధాని ఏమని ట్వీట్ చేశారు?

ఎమ్మెల్యే, ఎంపీ లంచం తీసుకుంటే విచారణ ఎదుర్కోవాల్సిందేనని అత్యున్నత న్యాయస్థానం సోమవారం సంచలన తీర్పు ఇచ్చింది. ఈ తీర్పును ప్రధాని నరేంద్ర మోదీ స్వాగతించారు.

Update: 2024-03-04 10:47 GMT

ఎమ్మెల్యే, ఎంపీ లంచాలు తీసుకుంటే విచారణ ఎదుర్కోవాల్సిందేనని సుప్రీంకోర్టు సోమవారం తీర్పు ఇచ్చింది. ఏడుగురు సభ్యుల ధర్మాసనం ఇచ్చిన తీర్పును ప్రధాని మోదీ స్వాగతించారు. ఇకపై దేశంలో స్వచ్ఛమైన రాజకీయాలు కొనసాగుతాయి. వ్యవస్థలపై ప్రజలకు విశ్వాసం పెరుగుతుంది అని’ సోషల్ మీడియా ఎక్స్‌లో ఆయన పోస్ట్ చేశారు.


ఏం జరిగిందంటే..?

1993లో అప్పటి ప్రధాని పీవీ నరసింహా రావు ప్రభుత్వం అవిశ్వాన్ని ఎదుర్కొవాల్సి వచ్చింది. జేఎంఎం ఎంపీ శిబు సోరెన్ తో పాటు ఆ పార్టీకి చెందిన నలుగురు ఎంపీలు లంచాలు తీసుకున్నారని ఆరోపణలు వచ్చాయి. లంచం తీసుకొని అవిశ్వాస తీర్మానానికి వ్యతిరేకంగా ఓటు వేశారు. దీంతో మైనార్టీలో ఉన్న పీవీ ప్రభుత్వం గట్టెక్కింది.

అనంతరం ఈ కేసును చీఫ్‌ జస్టిస్‌ డి.వై. చంద్రచూడ్‌ నేతృత్వంలోని ఐదుగురు సభ్యుల ధర్మాసనం విచారించింది. సభలో చేసే ప్రసంగాలు, అక్కడ వేసే ఓట్లపై ఎంపీలకు రాజ్యాంగపరమైన రక్షణ ఉంటుందని పీవీ నరసింహారావు వర్సెస్‌ సీబీఐ కేసులో 1998లో ఇచ్చిన తీర్పును పునఃపరిశీలించాల్సిన అవసరం ఉందని తెలిపింది. ఇందుకోసం ఏడుగురు సభ్యుల విస్తృత ధర్మాసనాన్ని ఏర్పాటు చేసింది.

తాజాగా విస్తృత ధర్మాసనం విచారణ జరిపి నేడు కీలక తీర్పు వెలువరించింది. అవినీతికి పార్లమెంటరీ అధికారాల ద్వారా రక్షణ ఉండదని కోర్టు ఈ సందర్భంగా వెల్లడించింది. 1998లో ఇచ్చిన తీర్పు రాజ్యాంగంలోని 105, 194 అధికరణలకు విరుద్ధంగా ఉందని పేర్కొంది. లంచం తీసుకోవడం అనే ఆరోపణలు ప్రజాజీవితంలో విశ్వసనీయతను దెబ్బతీస్తాయని తెలిపింది.

సంచలన తీర్పు

ఎంపీ, ఎమ్మెల్యేల లంచం కేసును సోమవారం సుప్రీంకోర్టు చీఫ్ జస్టిస్ డివై చంద్రచూడ్ నేతృత్వంలోని ఏడుగురు సభ్యుల ధర్మాసనం విచారించి సంచలన తీర్పును ఇచ్చింది. లంచం తీసుకుంటే ఎమ్మెల్యేలు, ఎంపీలు విచారణ ఎదుర్కొవాల్సిం దేనని స్పష్టం చేసింది. లంచం కేసుల్లో ప్రజా ప్రతినిధులకు రాజ్యాంగ రక్షణ కల్పించలేమని తేల్చిచెప్పింది. అసెంబ్లీ, పార్లమెంట్‌లో ప్రశ్నలు వేసేందుకు లంచం తీసుకున్న విచారణను ఎదుర్కోవాల్సిందేనని తెగేసి చెప్పింది. 

Tags:    

Similar News