ఒప్పందం లేదు, వైరమూ లేదు....
ముగిసిన ట్రంప్- పుతిన్ అలస్కా చర్చలు...;
అమెరికా అలస్కాలో జరిగిన ఆ అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్, రష్యాఅధ్యక్షుడు వ్లదిమీర్ పుతిన్ ల సమావేశం ఎలాంటి ఒప్పందం కుదరకుండానే ముగిసింది.
సమావేశం ఆగస్టు 15 జరిగింది. రష్యా, యుక్రెయిన్ ల మధ్య యుద్ధాన్ని అపేందుకు ట్రంప్ చేస్తున్న ప్రయత్నాల్లో భాగంగా ఈ సమావేశం జరిగింది. ఈ సమావేశానికి పుతిన్ హాజరుకావాలనుకోవడమే పెద్ద విశేషం. ఎందుకంటే, ఆయన మీద అంతర్జాతీయ కోర్టు యుద్ధ నేరాల అరెస్టు వారంట్ ఇచ్చింది. అందుకే ఆయన మిత్రదేశాలు మినహా మరొక దేశం పర్యటించడం లేదు. ఇపుడు అమెరికా పర్యటనకు రావడం అందుకే విశేషం.
ఏడెనిమిది గంటలు జరుగుతుందనుకున్న ఈ సమావేశం కేవలం మూడు గంటల్లో ముగిసింది. అనంతరం ఇద్దరు అగ్రనేతలు మీడియాతో మాట్లాడారు. అయితే, మీడియా నుంచి ఎలాంటి ప్రశ్నలు లేకుండానే సమావేశం ముగించారు. సమావేశంలో ఏ అంశాలు చర్చకు వచ్చాయి, ఏమి జరిగిందనే సమాచారం బయటకు పొక్కలేదు. అయితే, మాస్కోకి రావాలని పుతిన్ ట్రంప్ ని ఆహ్వానించారు
సమావేశం మీద, యుద్ధ నివారణ మీద ఎలాంతి ప్రకటన లేదకాబట్టి ఉహాగానాలు తప్ప మరొక మార్గం లేదు. చాలా మంది నిపుణులు వారిద్ధరి బాడీ లాంగ్వేజీ ని పరిశీలించి సమావేశంలో ఏజరిగి ఉంటుందో అంచనా వేస్తున్నారు.
విలేకరుల సమావేశంలో మాట్లాడుతూ తాను, ట్రంప్ యుక్రెయిన్ గురించి ఒక ‘అవగాహన’కు వచ్చామని, దానిని చెడగొట్టే ప్రయతనం చేయవద్దని పుతిన్ యూరోప్ దేశాలను కోరారు. అయితే, ట్రంప్ విచిత్రమయిన వ్యాఖ్య చేశారు. " ఒప్పందం కుదిరినపుడే ఒప్పందం కుదిరినట్లు," అని వ్యాఖ్యానించారు. ఈ చర్చల వివరాలను తొందరలోనే తాను యుక్రెనియర్ అధ్యక్షుడు జెలెన్ స్కీకి, ఇతర యూరోప్ దేశాల నేతలకు తెలియచేస్తానని ట్రంప్ తెలిపారు.
చక్కటి సమావేశం
‘సమావేశం చక్కగా సాగింది. అనేక అంశాలమీద ఏకాభిప్రాయం కుదిరింది. కొన్ని అంశాలే తేల్చాల్సి ఉంది. కొన్ని విషయాలను అంత ముఖ్యం కాదు. ఒక ముఖ్యమయిన అంశం ఉంది. దానిని పరిష్కరించుకోగలము అనే అనమ్మకం ఉంది. ఇప్పటికది పరిష్కారంకాలేదు,’ అని ట్రంప్ అన్నారు.
రెండో ప్రపంచ యుద్ధం తర్వాత ఇంతకాలం కొనసాగుతున్నయుద్దం రష్యా-యుక్రెయిన్ యుద్ధమే. మూడున్నరేళ్లుగా మండుతున్న వైషమ్యం ఇది. ఇలాంటి యుద్ధాన్ని ఆపేందుకు ఇద్దరు అగ్రరాజ్య నేతలు కలిసిన పుడు ఏదో ఒక ఒప్పందం కుదురుతుందని అనుకుంటారు. ఈ సమావేశం మాత్రం ఒప్పందం లేకుండా ముగిసింది. అంతేకాదు, అనంతరం ఇరువురు లీడర్లు ఒక సంయుక్త ప్రకటన విడుదల చేస్తారని అంతా భావించారు. అయితే అదీ జరగలేదు. మీడియా సమావేశంలో వేర్వేరుగ మాట్లాడారు. మొదట పుతిన్ నాలుగు ముక్కలు చెబితే తర్వాత ట్రంప్ మూడు వాక్యాల్లో ముగించారు.
స్నేహపూర్వక సమావేశం నిర్వహించినందుకు ట్రంప్ కు పుతిన్ ధన్యవాదాలు తెలిపారు. రష్యా, అమెరికా సహరించుకుంటు ముందుకు పోయేందుకు అలాస్కా సమావేశం దోహడపడుతుందని అన్నారు.
ట్రంప్ కు ప్రశంస
ఆయన ట్రంప్ ను ప్రశసంచారు. ‘ట్రంప్ కు ఏమిచేయాలో స్పష్టమయిన ఐడియా ఉంది. అమెరికా సుసంన్నం అయ్యందుకు ఏమి చేయాలో ఆయన స్పష్టంగా తెలుసు . అదే విధంగా ఆయనకు రష్యా జాతీయ ప్రయోజనాలు ఏమిటో కూడా బాగా తెలుసు," అని పుతిన్ పేర్కొన్నారు.
దీనికి బదులిస్తూ, " తొందర్లోనే మీతో మళ్లీ మాట్లాడతాను. చాలా తొందర్లోనే మీతో కలుస్తాను," అని అన్నారు. పుతిన్ చిరునవ్వుతో దీనికి స్పందించారు.
ఎపుడు చిటపటలాడే ట్రంపు ఈ సారి చాలా నెమ్మదిగా ఉన్నారు. ఆయన హావభావాలన్నీ సానుకూలంగా స్నేహ పూర్వకంగా ఉన్నాయి. ఈ చర్చలు ముందుకు సాగుతాయనేందుకు ఇది సంకేతం. సమావేశంలో రష్యాయుక్రెయిన్ యుద్ధ నివారణకు ఒప్పందం లేకపోవచ్చు, ఇద్దరి మధ్య శతృభావం లేకుండా స్నేహ వాతావరణం ఏర్పడటం విశేషమని ఢిల్లీ జవహర్ లాల్ నెహ్రూ విశ్వవిద్యాలయానికి చెందిన అంతర్జాతీయ వ్యవహారాల నిపుణుడు ప్రొఫెసర్ స్వరణ్ సింగ్ ‘ఫెడరల్ న్యూస్ ’ వ్యాఖ్యానించారు.