ఎన్డీయేకు ఎంఎన్‌ఎస్ మద్దతు ప్రకటించిన రాజ్ థాకరే
మహారాష్ట్ర నవనిర్మాణ సేన (MNS) చీఫ్ రాజ్ థాకరే లోక్‌సభ ఎన్నికల్లో 'మహాయుతి' (మహాకూటమి)కి మద్దతు ప్రకటించారు.
By : The Federal
Update: 2024-04-10 12:25 GMT
మహారాష్ట్ర నవనిర్మాణ సేన (MNS) చీఫ్ రాజ్ థాకరే లోక్‌సభ ఎన్నికల్లో 'మహాయుతి' (మహాకూటమి)కి మద్దతు ప్రకటించారు.
ముంబైలో గుడి పడ్వాలో భాగంగా జరిగిన పార్టీ వార్షిక సమావేశంలో రాజ్ ఠాక్రే మాట్లాడుతూ.. ‘‘ప్రధాని నరేంద్ర మోదీకి, ఎన్డీయేకు మహారాష్ట్ర నవనిర్మాణ సేన బేషరతుగా మద్దతు ఇస్తోంది. ఎన్నికలకు ప్రతి ఒక్కరూ సిద్ధం కావాలని కార్యకర్తలకు పిలుపునిచ్చారు.
`30 ఏళ్ల తర్వాత ఓ వ్యక్తి పూర్తి మెజారిటీతో ఎన్నికయ్యారు. మీకు గుర్తుంటే నరేంద్రమోదీ దేశానికి ప్రధాని కావాలని బీజేపీ కంటే ముందే చెప్పాను.’అని పేర్కొన్నారు.
ఏక్‌నాథ్ షిండే నేతృత్వంలోని శివసేన, అజిత్ పవార్ నేతృత్వంలోని ఎన్‌సిపి వర్గం కూడా మహాయుతి కూటమిలో భాగమే. అయితే ఇప్పటి వరకు ఎంఎన్‌ఎస్‌కు సీట్లు కేటాయించలేదు.
రాజ్ థాకరేకు ధన్యవాదాలు తెలిపిన షిండే..
తనకు మద్దతు ఇచ్చినందుకు థాకరేకు మహారాష్ట్ర ముఖ్యమంత్రి ఏక్‌నాథ్ షిండే ధన్యవాదాలు తెలిపారు. మాజీ ముఖ్యమంత్రి ఉద్ధవ్ ఠాక్రే పేరును ప్రస్తావించకుండా.. ''కోవిడ్ సమయంలో ఇంట్లో కూర్చుని 'రొకడ్' (డబ్బు) లెక్కించే వారికి మోడీని విమర్శించే హక్కు లేదు'' అని షిండే దుయ్యబట్టారు. మహాయుతి లోక్‌సభ సీటును ఎంఎన్‌ఎస్‌కు ఇస్తుందా?’’ అనే ప్రశ్నకు షిండే, ‘‘ఎంఎన్‌ఎస్ ఎలాంటి షరతులు పెట్టలేదని చెప్పారు. శివసేన (యుబిటి) అధ్యక్షుడు ఉద్ధవ్ ఠాక్రే తన అధికార పార్టీని 'చైనీస్ ఆర్మీ'గా అభివర్ణించడంపై స్పందిస్తూ.. ``ఎవరిది శివసేన?'' బాలాసాహెబ్ సిద్ధాంతాన్ని అనుసరించలేని వారు, V.D. సావర్కర్ కు జరిగిన అవమానాన్ని అంగీకరించే మనల్ని విమర్శించే ముందు ఆలోచించాలి. శివసేనను కాపాడేందుకే మేం ఈ స్టాండ్ తీసుకున్నాం.’’ అని బదులిచ్చారు షిండే.