ఒంటిమిట్ట సీతారామ కల్యాణానికి అరుదైన తలంబ్రాలు

ఈ తలంబ్రాలను ఎలా తయారుచేశారో తెలుసా?

Update: 2024-04-21 07:17 GMT

ఆంధ్రప్రదేశ్ కడప జిల్లా ఒంటిమిట్టలో సోమవారం జరగనున్న శ్రీ సీతారాముల కల్యాణానికి అపురూపంగా తయారుచేసిన తలంబ్రాలు వాడుతున్నారు.




తూర్పుగోదావరి జిల్లా కోరుకొండకు చెందిన శ్రీకృష్ణ చైతన్య సంఘం అధ్యక్షుడు శ్రీ కళ్యాణ అప్పారావు ఈ అరుదైన తలంబ్రాలు దేవాలయ అధికారులకు అందించారు. ఈ తలంబ్రాలకు వాడే బియ్యం వెనక అసాధారణ భక్తి ఉంది. ఇవన్నీ వడ్లను మిల్లాడించినవో, దంచినవో కాదు. గోటితో ఒలిచిన వడ్ల నుంచి తీసిన బియ్యం తలంబ్రాలు. ఇలాంటి కోటి తలంబ్రాలను అప్పారావు ఆదివారం ఆలయానికి సమర్పించారు. మొత్తం 180 కిలోల బరువైన ఈ తలంబ్రాలను ఆలయం వద్ద డెప్యూటీ ఈవో శ్రీ నటేష్ బాబు, అర్చకులు శ్రీ శ్రావణ్ కుమార్ సమక్షంలో ఆయన అందించారు.




అంతేనా. కాదు, మరొక విశేషం కూడా ఉంది.

ఈ తలంబ్రాల కోసం వరిపంటను ప్రత్యేకంగా పండించారు.

తలంబ్రాలకోసమే ఆరు నెలల పాటు వరిని ప్రత్యేకంగా పండించినట్లు అప్పారావు చెప్పారు.

"నాలుగు రాష్ట్రాలకు చెందిన భక్తులు ఎంతో భక్తిభావంతో మూడు నెలల పాటు ఈ వడ్లను గోటితో ఒలిచి సిద్ధం చేశారు. మా సంఘం ఆధ్వర్యంలో 13 ఏళ్లుగా భద్రాద్రి రామునికి, ఏడేళ్లుగా ఒంటిమిట్ట రామునికి కల్యాణోత్సవం సందర్భంగా ఇలా కోటి గోటి తలంబ్రాలను అందజేస్తున్నాము," అని కళ్యాణ అప్పారావు తెలిపారు

Tags:    

Similar News