‘కోహ్లి’ లేకుండానే సెషన్ ప్రారంభించిన ఆర్సీబీ

ఐపీఎల్ కి అన్ని జట్లు ముమ్మరంగా సన్నద్దం అవుతున్నాయి. అత్యధిక ఫ్యాన్ ఫాలోయింగ్ ఉన్న ఆర్సీబీ సైతం తాజాగా ఇందులో చేరింది. అయితే క్యాంప్ లో విరాట్ కోహ్లీ మాత్రం..

Update: 2024-03-14 06:33 GMT

వచ్చే వారంలో ఐపీఎల్ సీజన్ ప్రారంభం కానుంది. మార్చి 22న డిఫెండింగ్ ఛాంపియన్ చెన్నై సూపర్ కింగ్స్ తో రాయల్ ఛాలెంజర్స్ బెంగళూర్ పోటీ పడనుంది. ఇప్పటికే అన్ని జట్లు కూడా తమ తమ ఆటగాళ్లతో సెషన్ ప్రారంభించాయి. తాజాగా ఆర్సీబీ కూడా తన సెషన్ ను బెంగళూర్ కేంద్రంగా ఆరంభించింది.

దీనికి ఆటగాళ్లు అందరూ హజరయ్యారు. కానీ పితృత్వ విరామంలో ఉన్న భారత స్టార్ క్రికెటర్ విరాట్ కోహ్లి మాత్రం ఇప్పటి వరకు జట్టుతో కలవలేదు. కొత్త ప్రధాన కోచ్ ఆండీ ఫ్లవర్ క్రికెట్ డైరెక్టర్ మో బోబాట్ మార్గదర్శకత్వంలో చాలా మంది దేశీయ ఆటగాళ్లు శిబిరంలో చేరారు బుధవారం క్యాంప్ ప్రారంభ రోజున వారు పేస్ బౌలింగ్ ప్రాక్టీస్ చేయించారు.

వెస్టిండీస్ ఫాస్ట్ బౌలర్ అల్జారీ జోసెఫ్‌తో పాటు కెప్టెన్ ఫాఫ్ డు ప్లెసిస్ ఈ ప్రీ టోర్నమెంట్ క్యాంపులో పాల్గొన్నారు. ఇప్పటికే ఇంగ్లండ్ తో భారత్ వేదికగా జరిగిన టెస్ట్ సిరీస్ కు కోహ్లి విరామం తీసుకున్న సంగతి తెలిసిందే.
"కొహ్లీ రాబోయే కొద్ది రోజుల్లో ఆర్సీబీ తో చేరే అవకాశం ఉంది" అని ఐపిఎల్ జట్లలో పరిణామాలను ట్రాక్ చేస్తున్న ఓ సంస్థ జాతీయ మీడియాకు తెలియజేసింది. గార్డెన్ సిటీలో జరిగే 'RCB అన్‌బాక్స్' అనే హై-ప్రొఫైల్ వార్షిక ఈవెంట్‌లో ఫ్రాంచైజీ కోసం కోహ్లీ మొదటిసారి కనిపించవచ్చని తెలుస్తోంది.
ఆర్సీబీకి ఆండీ ప్లవర్ కోచ్ గా ఉండడం అదృష్టంగా భావిస్తున్నట్లు కెప్టెన్ డు ప్లెస్సిస్ అన్నాడు. దయగల, సహృదయం ఉన్న వ్యక్తి  ఆండీ ప్లవర్ అని డు ప్లెసిస్ RCB 'బోల్డ్ డైరీస్'లో పేర్కొన్నాడు.
ఫ్లవర్ కూడా ఇదే తన డైరీలో తన అభిప్రాయం వ్యక్తం చేశాడు. "RCB కథలో కొత్త అధ్యాయం, రాయడానికి మాకు అవకాశం లభించింది. ఇది నిజంగా సంతోషించాల్సిన విషయం." అని రాశారు. 
Tags:    

Similar News