సీఎస్కేని ఓడిస్తే.. ఆర్సీబీ ఐపీఎల్ కప్ ను గెలవదు: రాయుడు

ఆర్సీబీకి మొదటి నుంచి భారతీయ ప్రతిభకు సరైన నమ్మకం ఉంచలేకపోతుందని భారత మాజీ బ్యాట్స్ మెన్ అంబటి రాయుడు అన్నారు. అందుకే 17 ఏళ్లుగా..

Update: 2024-05-24 06:26 GMT

తొలి ఐపీఎల్ టైటిల్ కోసం ఆర్సీబీ మరో ఏడాది వరకూ వేచి చూడాల్సిన అవసరం వచ్చిందని భారత మాజీ బ్యాట్స్ మెన్ అంబటి రాయుడు అన్నారు. మొన్న అహ్మదాబాద్ లోని నరేంద్ర మోదీ స్టేడియంలో జరిగిన ఎలిమినేటర్ మ్యాచ్ లో రాజస్థాన్ చేతిలో రాయల్ ఛాలెంజర్స్ బెంగళూర్ ఓటమి పాలయింది. ఫాఫ్ డు ప్లెస్సిస్ నేతృత్వంలోని ఆర్సీబీ మొదటి దశలో వరుసగా ఓటమి పాలయ్యింది. 

అయితే తరువాత అద్భుతంగా ఫుంజుకుని వరుసగా ఆరు మ్యాచ్ లను గెలిచి ప్లేఆఫ్ కు చేరుకుంది. అయితే ఎలిమినేటర్ మ్యాచ్ లో మాత్రం రాజస్థాన్ రాయల్స్ చేతిలో ఓటమి పాలయింది. దీనిపై భారత మాజీ బ్యాట్స్ మెన్, మాజీ సీఎస్కే ఆటగాడు అంబటి రాయుడు స్పందించాడు. ఆర్సీబీ, చెన్నైని ఓడించిన ప్రతిసారీ ఐపీఎల్ టైటిల్ ను గెలవలేకపోయిందని అన్నారు.

శనివారం బెంగళూర్ లోని ఎం చిన్నస్వామి స్టేడియంలో ప్లే ఆఫ్ లో స్థానం సంపాదించడానికి సీఎస్కేని ఓడించినప్పుడు ఆర్సీబీ ఆటగాళ్లు, వారి అభిమానులు చేసిన భారీ వేడుకలను రాయుడు గుర్తు చేసుకున్నాడు.
‘‘ మీరు ఈ రోజు ఆర్సీబీ గురించి మాట్లాడినట్లు అయితే ఓ విషయం చెప్పదలుచుకున్నాను.  అభిమానం, దూకుడు మాత్రమే మ్యాచ్ లను గెలిపించలేదు. సరైన ప్రణాళికలతో వచ్చినప్పుడు మాత్రమే మీరు ట్రోఫిలను గెలవగలరు. ప్లే ఆఫ్ ను చేరుకోవడం ద్వారా మాత్రమే మీరు ట్రోఫిలను గెలవలేరు. ఆకలితో ఆడాలి. సీఎస్కేను ఓడించి ఐపీఎల్ ను ట్రోఫిని గెలుస్తామని అనుకోవద్దు. మీరు కప్పు కోసం వచ్చే ఏడాది మరోసారి ఆడాలి’’ అని రాయుడు ఓ స్పోర్ట్స్ ఛానల్ కు ఇచ్చిన ముఖాముఖిలో వ్యాఖ్యానించారు.
ఆర్సీబీ ఫ్రాంచైజీ ప్రారంభం అయినప్పటి నుంచి విరాట్ కోహ్లి తప్ప ఇతర బ్యాట్స్ మెన్లు ఇక్కడ నిలదొక్కుకోలేక పోయారని అన్నారు. 2008 లో లీగ్ ప్రారంభమైన దగ్గర నుంచి ఈ 17 సంవత్సరాలలో ఒక్క సారి కూడా ఆర్సీబీ టైటిల్ గెలవలేదని అన్నారు.
‘‘ మీరు విరాట్ కోహ్లిని తప్ప మరే ఇతర భారత బ్యాట్స్ మెన్ పై విశ్వాసం ఉంచలేదు. కోహ్లి తప్ప ఏ ఇతర బ్యాట్స్ మెన్ ఇక్కడ 1000 పరుగుల మైలురాయిని సాధించలేదు, భారత ప్రతిభపై మీరు ఎలాంటి విశ్వాసం లేదని విషయాన్ని ఇది తెలియజేస్తోంది’’ అని రాయుడు అన్నారు. అలాగే సీఎస్కే ఐదు టైటిల్లు గెలిచిన విషయాన్ని కూడా తన ఇన్ స్టాగ్రామ్ ఖాతాలో రిమైండర్ ద్వారా తెలియజేసే ప్రయత్నం చేశాడు.
ఐపీఎల్ 2014 ఎడిషన్ లో ఆర్సీబీ తరపున బరిలోకి దిగిన విరాట్ కోహ్లి అద్భుతంగా రాణించాడు. అతను 15 మ్యచుల్లో 741 పరుగులు సాధించి ఆరెంజ్ క్యాప్ సొంతం చేసుకున్నాడు.
Tags:    

Similar News