పోటీకి రాజవంశీకులు భయపడుతున్నారు: మోదీ
లోక్‌సభ ఎన్నికలలో పోటీ చేసేందుకు రాజవంశీకులు భయపడుతున్నారని అందుకే రాజ్యసభ గుండా పార్లమెంట్‌లోకి ప్రవేశించాలని చూస్తున్నారని ప్రధాని నరేంద్ర మోదీ అన్నారు
లోక్‌సభ ఎన్నికలలో పోటీ చేసేందుకు రాజవంశీకులు భయపడుతున్నారని అందుకే రాజ్యసభ గుండా పార్లమెంట్‌లోకి ప్రవేశించాలని చూస్తున్నారని ప్రధాని నరేంద్ర మోదీ శనివారం ప్రతిపక్షాలపై విరుచుకుపడ్డారు.
ఔరంగాబాద్ జిల్లాలో జరిగిన ర్యాలీని ఉద్దేశించి మోదీ మాట్లాడుతూ.. రాజవంశ పాలనతో ప్రజల్లో భయాందోళనలు సృష్టించిన వారిని మూలన కూర్చోబెట్టామని అన్నారు. బీహార్‌లో అభివృద్ధి, చట్టబద్ధ పాలన, మహిళలు భయం లేకుండా జీవించడానికి తాను గ్యారంటీ ఇస్తానని చెప్పారు.
ఇటీవల ముఖ్యమంత్రి నితీష్ కుమార్ సంకీర్ణానికి తిరిగి రావడం గురించి మోదీ ప్రస్తావించారు. "బీహార్‌లో ఇప్పుడు మళ్లీ డబుల్ ఇంజన్ ప్రభుత్వం ఉంది. బీహార్‌లో రాజవంశాలను ఎన్‌డిఎ పక్కకు నెట్టివేసింది" అని అన్నారు. అయోధ్యలో రామ మందిరాన్ని ప్రతిష్టించినప్పుడు రాష్ట్రంలో ఉత్సాహం వెల్లివిరిసిందని, మాజీ ముఖ్యమంత్రి కర్పూరీ ఠాకూర్‌కు భారతరత్న బిహార్‌కు దక్కిన గౌరవమని పేర్కొన్నారు.
RJD పాలన గురించి ప్రస్తావిస్తూ.."బీహార్‌లో చాలా మంది యువకులు వలస బాట పట్టారు. అలాంటి పరిస్థితులు తిరిగి పునరావతం కాకుండా చూస్తాం’’ అని హామీ ఇచ్చారు. .