ఆప్ చీఫ్ కేజ్రీవాల్‌కు జూన్ 1వరకు బెయిల్ మంజూరు

లోక్‌సభ ఎన్నికల ప్రచారం నిమిత్తం ఢిల్లీ ముఖ్యమంత్రి అరవింద్ కేజ్రీవాల్‌కు జూన్ 1 వరకు సుప్రీంకోర్టు మధ్యంతర బెయిల్ మంజూరు చేసింది.

Update: 2024-05-10 09:31 GMT

లోక్‌సభ ఎన్నికల ప్రచారం నిమిత్తం ఢిల్లీ ముఖ్యమంత్రి అరవింద్ కేజ్రీవాల్‌కు జూన్ 1 వరకు సుప్రీంకోర్టు మధ్యంతర బెయిల్ మంజూరు చేసింది.

ఎక్సైజ్ పాలసీ కుంభకోణంతో ముడిపడి ఉన్న మనీలాండరింగ్ కేసులో అరెస్టయిన కేజ్రీవాల్ జూన్ 2న లొంగిపోయి తిరిగి జైలుకు వెళ్లాల్సి ఉంటుందని న్యాయమూర్తులు సంజీవ్ ఖన్నా, దీపాంకర్ దత్తాలతో కూడిన ధర్మాసనం పేర్కొంది. జూన్ 4న ఓట్ల లెక్కింపు జరిగిన తర్వాతి రోజు వరకు మధ్యంతర బెయిల్ మంజూరు చేయాలంటూ కేజ్రీవాల్ తరపు న్యాయవాది అభిషేక్ సింఘ్వీ అభ్యర్థనను ధర్మాసనం తిరస్కరించింది.

ఢిల్లీ మద్యం పాలసీ కుంభకోణంలో కేజ్రీవాల్‌ను మార్చి 21న ఎన్‌ఫోర్స్‌మెంట్ డైరెక్టరేట్ (ఈడీ) అరెస్టు చేసిన విషయం తెలిసిందే. లోక్‌సభ ఎన్నికల ప్రచారం కోసం తనను విడుదల కావాలని కేజ్రీవాల్ వేసిన పిటిషన్ ను న్యాయమూర్తులు సంజీవ్ ఖన్నా, దీపాంకర్ దత్తాలతో కూడిన ధర్మాసనం విచారించి తీర్పును రిజర్వ్ చేసింది. ప్రస్తుతం కేజ్రీవాల్ జ్యుడీషియల్ కస్టడీలో తీహార్ జైలులో ఉన్నారు.

ఢిల్లీలోని మొత్తం ఏడు స్థానాలకు మే 25న ఓటింగ్ జరగనుంది.

Tags:    

Similar News