ముందస్తు పథకం ప్రకారమే ఈ నివేదికలు: అదానీ గ్రూపు
షార్ట్ సెల్లింగ్ విషయంలో సుప్రీంకోర్టు తమకు క్లీన్ చిట్ ఇచ్చిందని అదానీ గ్రూప్ వెల్లడించింది. ముందుస్తుగా అనుకున్న ప్రణాళిక ప్రకారం హిండెన్ బర్గ్ నివేదికలు..
అదానీ విషయంలో సుప్రీంకోర్టు క్లీన్ చిట్ ఇచ్చిన హిండెన్ బర్గ్ మాత్రం తన ఆరోపణలు మానడం లేదు. తాజాగా సెబీ చైర్మన్ పై కూడా అనేకానేక అర్ధరహిత ఆరోపణలకు దిగింది. అదానీ షార్ట్ సెల్లర్ విషయంలో సెబీ హిండెన్ బర్గ్ ను సంప్రదించిన కనీసం స్పందించని ఈ సంస్థ మరోసారి ఇదే తరహ ఆరోపణలకు దిగింది.
ఇండియా ఇన్ఫోలైన్ ద్వారా నిర్వహించబడుతున్న ఫండ్ స్ట్రక్చర్‌లో భాగమైన ఆఫ్‌షోర్ సంస్థలలో మాదాబి, ఆమె భర్త పెట్టుబడులు పెట్టారని, అందులో గౌతమ్ అదానీ సోదరుడు వినోద్ అదానీ కూడా పెట్టుబడులు పెట్టారని హిండెన్‌బర్గ్ శనివారం పేర్కొంది. వీటి విలువ దాదాపు రూ. 83 కోట్ల వరకూ ఉంటుందని హిండెన్ బర్గ్ ఆరోపించింది. ఇవన్నీ కూడా బెర్మూడా వంటి ట్రాక్స్ ఫ్రీ దేశాల్లో ఉన్నాయంది. ఈ ఆరోపణలను అదానీ గ్రూప్ ఖండించింది. హిండెన్ బర్గ్ "హానికరమైన", "మానిప్యులేటివ్ సెలెక్షన్స్" పబ్లిక్ ఇన్ఫర్మేషన్‌గా పేర్కొంది. మాదాబి, ఆమె భర్త ఇప్పటికే ఆరోపణలను కొట్టిపారేశారు .