ముంబైకి షాక్: ఐపీఎల్ లో ‘సూర్య’ ప్రారంభ మెరుపులకి బ్రేక్

ఐపీఎల్ మరో రెండు రోజుల్లో ప్రారంభం కానుంది. అయితే ప్రపంచ టీ20 నంబర్ వన్ బ్యాట్స్ మెన్ సూర్య కుమార్ యాదవ్ కు సేవలు ముంబైకి దక్కకుండా పోయాయి.. ఎందుకంటే..

Update: 2024-03-20 05:58 GMT
సూర్యకుమార్ యాదవ్

ప్రపంచంలోనే అతిపెద్ద క్రికెట్ లీగ్, రెండో అతిపెద్ద కార్పొరేట్ ఆటగా పేరుపొందిన ఐపీఎల్ కు మరో రెండు రోజుల్లో మొదలవబోతోంది. ఇప్పటికే అన్ని జట్లు కూడా తమ తమ ఆటగాళ్లతో ముమ్మర సాధన చేస్తున్నాయి. అయితే రోజు రోజు గాయాలతో దూరమవుతున్న ఆటగాళ్ల సంఖ్య కూడా పెరుగుతోంది.

తాజాగా ఈ లిస్ట్ లో మిస్టర్ 360, భారత స్టార్, ముంబై ఇండియన్స్ ఆటగాడు సూర్యకుమార్ యాదవ్ చేరాడు. తాజాగా అందుతున్న సమాచారం ప్రకారం ప్రారంభ మ్యాచ్ లకు సూర్య దూరమవుతున్నాడని సమాచారం. నేషనల్ క్రికెట్ అకాడమీ (NCA) నుంచి ఫిట్ నెస్ క్లియరెన్స్ రానందును మార్చి 24 గుజరాత్ టైటాన్స్ తో జరిగే మ్యాచ్ కు సూర్య అందుబాటులో ఉండట్లేదని తెలుస్తోంది.

ప్రపంచ నంబర్ T20 బ్యాటర్ సూర్యకుమార్ స్పోర్ట్స్ హెర్నియాకు శస్త్రచికిత్స జరిగిన తరువాత బెంగళూర్ లోని ఏన్ సీ ఏలో కోలుకుంటున్నాడు. గత ఏడాది డిసెంబర్ తరువాత సూర్య మైదానంలోకి దిగలేదు. మంగళవారం సూర్యకు ఫిట్ నెస్ పరీక్ష జరిగింది. అయితే ఇందులో మెరుగైన ఫలితం రాకపోవడంతో ప్రారంభ మ్యాచ్ లకు అందుబాటులో ఉండడం లేదని తెలిసింది.
మార్చి 27న సన్‌రైజర్స్ హైదరాబాద్‌తో, ఏప్రిల్ 1న రాజస్థాన్ రాయల్స్‌, ఏప్రిల్ 7న ఢిల్లీ క్యాపిటల్స్‌తో ముంబయి ఇండియన్స్‌తో మ్యాచ్ లు ఉన్నాయి. ఈ మ్యాచ్ లకు కూడా సూర్య అందుబాటులో ఉంటాడా? లేదా అనేది తరువాత ఫిట్ నెస్ పరీక్షల ఫలితాలపై ఆధారపడి ఉంటుంది.
తను ప్రారంభ మ్యాచ్ లకు అందుబాటులో ఉండట్లేదు అని సూర్య కూడా పరోక్షంగా సామాజిక మాధ్యమం ఇన్ స్టాగ్రామ్ లో హర్ట్ బ్రేక్ అంటూ పోస్ట్ చేశాడు.
Tags:    

Similar News