సునీతా విలియమ్స్ రోదసీ యాత్ర ఎందుకు ఆగిపోయింది?

భారత సంతతికి చెందిన అమెరికన్‌ వ్యోమగామి సునీతా విలియమ్స్‌ రోదసీ యాత్ర ఆగిపోయింది. సాంకేతిక కారణాల వల్ల యాత్రను ఆపేసినట్లు నాసా ప్రకటించింది.

Update: 2024-05-07 08:19 GMT

భారత సంతతికి చెందిన అమెరికన్‌ వ్యోమగామి సునీతా విలియమ్స్‌ రోదసీ యాత్ర ఆగిపోయింది. సాంకేతిక కారణాల వల్ల యాత్రను ఆపేసినట్లు నాసా (అమెరికా అంతరిక్ష పరిశోధన సంస్థ) ప్రకటించింది. యాత్ర తిరిగి ఎప్పుడు ఉంటుందనే దానిపై స్పష్టత ఇవ్వలేదు.

బోయింగ్‌ సంస్థకు చెందిన స్టార్‌లైనర్‌ వ్యోమనౌక భారత కాలమానం ప్రకారం మంగళవారం ఉదయం 8.04 గంటలకు ఫ్లోరిడాలోని కేప్‌ కెనావెరాల్‌ నుంచి నింగిలోకి దూసుకెళ్లాల్సి ఉంది. సునీతా విలియమ్స్, బుచ్‌ విల్‌మోర్‌ ఇందులో ప్రయాణించాల్సి ఉంది. సరిగ్గా స్పేస్‌క్రాప్ట్ నింగిలోకి ఎగరడానికి రెండు గంటల ముందు సాంకేతిక సమస్య తలెత్తింది. దీంతో ఇద్దరు వ్యోమగాములు వ్యోమనౌక నుంచి నిష్ర్కమించారు.

ఆక్సిజన్ సరఫరా చేసే వాల్వులో సాంకేతిక లోపం తల్తెతిందని చెప్పిన వ్యోమనౌక ఇంజనీర్ దిల్లాన్ రైస్ స్పేస్‌క్రాప్ట్ ప్రయోగానికి మరికొంత సమయం పడుతుందని పేర్కొన్నారు.

సునీతా విలియమ్స్..

59 ఏళ్ల సునీతా విలియమ్స్‌కు ఈ పర్యటన ఆమె మూడవ అంతరిక్ష ప్రయాణం. అయితే కొత్త అంతరిక్ష నౌకలో ప్రయాణించడం గురించి తనకు ఎలాంటి గందరగోళం లేదని చెప్పారు. "నేను అంతర్జాతీయ అంతరిక్ష కేంద్రానికి చేరుకున్నప్పుడు ఇంటికి తిరిగి వెళ్ళినట్లుగా ఉంటుంది" అని ఆమె ఒక ఇంటర్వ్యూలో చెప్పారు. తాను ఈ ప్రయాణంలో గణేశ విగ్రహాన్ని తీసుకువెళ్లాలనుకున్నానని చెప్పారు. అంతకుముందు ఆమె 'భగవద్గీత' కాపీని తన వెంట అంతరిక్షంలోకి తీసుకువెళ్లారు. సునీత ఇప్పటికే 322 రోజులు అంతరిక్షంలో గడిపారు. విలియమ్స్ తన మొదటి అంతరిక్ష యాత్రను డిసెంబర్ 9, 2006న ప్రారంభించారు. అది జూన్ 22, 2007 వరకు కొనసాగింది. రెండోసారి జూలై 14 నుండి నవంబర్ 18, 2012 వరకు అంతరిక్షంలో ప్రయాణించారు.

Tags:    

Similar News