సుప్రీం సంచలన తీర్పు: ఎన్నికల బాండ్ల పథకం రద్దు

రాజకీయ పార్టీలకు నిధులు సమకూర్చేందుకు తీసుకొచ్చిన ఎన్నికల బాండ్ల చెల్లుబాటుపై దాఖలైన పిటిషన్లపై అత్యున్నత న్యాయస్థానం సంచలన తీర్పు వెలువరించింది.

Update: 2024-02-15 14:00 GMT

 టి. లక్ష్మీనారాయణ,  సామాజిక ఉద్యమకారుడు

రాజకీయ పార్టీలకు నిధులు సమకూర్చేందుకు తీసుకొచ్చిన ఎన్నికల బాండ్ల చెల్లుబాటుపై దాఖలైన పిటిషన్లపై అత్యున్నత న్యాయస్థానం సంచలన తీర్పు వెలువరించింది. ప్రాథమిక హక్కుల ఆర్టికల్‌ 19(1)(ఎ) ప్రకారం.. ఈ పథకం సమాచార హక్కును ఉల్లంఘిస్తుందని..రాజ్యాంగ విరుద్ధమని ధర్మాసనం పేర్కొంది. 

1. ఎన్నికల బాండ్ల పథకాన్ని రద్దుచేస్తూ సుప్రీం కోర్టు ఇచ్చిన తీర్పు చారిత్రాత్మకమైనది.

2. ఈ పథకం రాజ్యాంగ వ్యతిరేకమైనదని సుప్రీం కోర్టు అభివర్ణిస్తూ రద్దు చేయడం ప్రజాస్వామ్యానికి మేలు చేకూర్చుతుంది.

3. సమాచార హక్కు చట్టాన్ని ఉల్లంఘిస్తూ గడచిన ఐదేళ్ళుగా ఈ పథకాన్ని అమలు చేశారు.

4. కార్పోరేట్ సంస్థలు అధికారంలో ఉన్న రాజకీయ పార్టీలతో "క్విడ్ ప్రోకో"కు అవకాశం కల్పిస్తూ కంపెనీల చట్టాన్ని సవరించి అమలు చేశారు. కార్పోరేట్ సంస్థలు గడచిన ఐదేళ్ళుగా చక్కగా ఉపయోగించుకొని, లబ్ధిపొందాయి.

5. 2024 జనవరి 2 నుండి 11 మధ్య రు.570 కోట్లు ఎన్నికల బాండ్లు అమ్మారని తాజాగా ఒక సమాచార హక్కు చట్టం కార్యకర్త వెల్లడించారు.

6. నల్ల ధనాన్ని అరికట్టడానికి ఈ పథకాన్ని అమలు చేస్తున్నామని మోడీ ప్రభుత్వం చెప్పింది. కానీ, ఆచరణలో అధికారాన్ని అడ్డం పెట్టుకొని వందల, వేల కోట్ల రూపాయల నిధులను కార్పోరేట్ సంస్థల నుండి అధికార పార్టీలు పిండుకొన్నాయి.

7. రాజకీయ పార్టీలకు ఏ సంస్థ లేదా వ్యక్తుల నుండి ఎంతెంత విరాళం అందిందో మొత్తం జాబితాను వెబ్ సైట్ ద్వారా 2024 మార్చి 31 నాటికి బహిరంగంగా వెల్లడించాలని ఎస్.బి.ఐ. ని సుప్రీం కోర్టు ఆదేశించడం హర్షణీయం.

8. ఎన్నికల్లో డబ్బు ప్రభావం పెరిగిపోయిన నేపథ్యంలో రానున్న సాధారణ ఎన్నికల ముందు సుప్రీం కోర్టు ఇచ్చిన తీర్పు కొంత మేరకు సానుకూల ప్రభావం కల్పిస్తుందని ఆశిద్దాం!


Tags:    

Similar News