తెలంగాణ ఈఏపీసెట్ నోటిఫికేషన్ వచ్చేసింది..

విద్యా సంవత్సరం 2025-2026కుగానూ తెలంగాణలో ఈఏపీసెట్ నోటిఫికేషన్‌ను అధికారులు విడుదల చేశారు.;

Update: 2025-02-21 05:25 GMT

విద్యా సంవత్సరం 2025-2026కుగానూ తెలంగాణలో ఈఏపీసెట్ నోటిఫికేషన్‌ను అధికారులు విడుదల చేశారు. ఇంజినీరింగ్, ఫార్మా, బీఎస్సీ అగ్రికల్చర్, వెటర్నరీ సైన్స్ తదిర కోర్సుల్లో దరఖాస్తులను ఫిబ్రవరి 25 నుంచి స్వీకరించనున్నారు. దరఖాస్తు చేసుకోవాలనుకునే వారు జేఎన్‌టీయూహెచ్ అధికార వెబ్‌సైబ్‌ను వీక్షించాలి. ఫిబ్రవరి 25 నుంచి ఏప్రిల్ 4 వరకు దరఖాస్తుల స్వీకరణ ప్రక్రియ జరుగుతుంది. ఆ తర్వాత అయితే రూ.2500 నుంచి రూ.5వేల వరకు ఆలస్య రుసుముతో దరఖాస్తు చేసుకోవాల్సి ఉంటుంది. కాగా ఆలస్య రుసుం చెల్లించి దరఖాస్తు చేసుకున్నవారికి హైదరాబాద్ జోన్‌4లో మాత్రమే పరీక్ష కేంద్రాలు కేటాయించబడతాయని నోటిఫికేషన్ స్పష్టం చేశారు. అధికారులు. ఇక పరీక్షల వివరాలకు వస్తే ఏప్రిల్ 29, 30 తేదీల్లో అగ్రికల్చర్, ఫార్మా పరీక్షలు జరగనున్నాయి. మిగిలిన పరీక్షలన్నీ కూడా మే 2 నుంచి 5 వరకు జరగనున్నాయి.

అయితే ఇంజినీరింగ్ సహా ఇతర కోర్సుల్లో ప్రవేశానికి విద్యార్థులు ఎస్సీ, ఎస్టీ అయితే ఇంటర్‌లో 40శాతం మార్కులు కలిగి ఉండాలి, ఇతరులు అయితే 45శాతం మార్కులు సాధించి ఉండాలి. విద్యార్థుల వయసు తప్పనిసరిగా 2025 డిసెంబర్ 31 నాటికి 16 సంవత్సరాలు నిండిఉండాలి. గరిష్ఠ వయోపరిమితి ఏమీ లేదు. కాగా బీటెక్ డెయిరీ టెక్నాలజీ, అగ్రికల్చర్ ఇంజినీరింగ్, ఫుడ్ టెక్నాలజీతో ాటు బీఎస్సీ అగ్రికల్చర్, వెటర్నరీ సైన్స్, హార్టికల్చర్‌కు దరఖాస్తు చేసుకునే విద్యార్థులు 31 డిసెంబర్ 2025 నాటికి 17ఏళ్ల వయసు నిండిఉండాలి. ఈ కోర్సుల్లో చేరడానికి ఎస్సీ, ఎస్టీలు 25, ఇతరులకు 22 సంవత్సరాల గరిష్ఠ వయోపరిమితిని అధికారులు నిర్ణయించారు. సిలబస్, కోర్సుల పూర్తి వివరాల కోసం ఇక్కడ క్లిక్ చేయండి.

Tags:    

Similar News