‘ది టెలిగ్రాఫ్’ ఎడిటర్ సంకర్షన్ ఠాకూర్ మృతి

మీడియా రంగంలో 40 ఏళ్ల అనుభవం;

Update: 2025-09-08 05:53 GMT
సంకర్షన్ ఠాకూర్

‘ది టెలిగ్రాఫ్’ ఎడిటర్ సంకర్షణ్ ఠాకూర్ మృతి చెందాడు. టెలిగ్రాఫ్ ఎడిటర్ గా ఆయన 2023 లో బాధ్యతలు స్వీకరించాడు. అంతకుముందు ఆయన ఇదే సంస్థ లో నేషనల్ ఎఫైర్స్ లో ఇన్ ఛార్జ్ గా పనిచేశారు.

ఆయనకు మీడియా రంగంలో 40 సంవత్సరాల అనుభవం ఉంది. ఠాకూర్ 1984 లో సండే మ్యాగజైన్ లో సాధారణ జర్నలిస్టు గా తన కెరీర్ ప్రారంభించాడు. ఆయన ఎక్కువగా బీహార్, కశ్మీర్ లో రిపోర్టింగ్ చేశారు.

ఠాకూర్ పొలిటికల్ జర్నలిజంలో చేసిన కృషికి 2001 లో ‘ప్రేమ్ భాటియా’ అవార్డు అందుకున్నాడు. కాశ్మీర్ పై ఆయన రాసిన ఆర్టికల్స్ కు గాను అప్నా మీనన్ ఫాల్ షిప్ ను పొందాడు. బీహార్ మాజీ ముఖ్యమంత్రి లాలూ ప్రసాద్ యాదవ్ పేరుతో ‘‘ ద మేకింగ్ ఆఫ్ లాలూ యాదవ్: ది ఆన్ మేకింగ్ ఆఫ్ బీహార్’’ పేరుతో ఒక బుక్ రాశారు.

అలాగే ప్రస్తుత బీహార్ ముఖ్యమంత్రి నితీశ్ కుమార్ ఆటో బయోగ్రఫీకి సైతం రచయిత గా వ్యవహరించారు. ‘‘సింగల్ మ్యాన్: ది లైఫ్ అండ్ టైమ్స్ ఆఫ్ నితిశ్ కుమార్ ఆఫ్ బీహార్’ పేరుతో ఇది మార్కెట్లోకి వచ్చింది. సంకర్షన్ ఠాకూర్ పాట్నాకు చెందినవాడు అయినప్పటికీ ఢిల్లీ యూనివర్శిటీలోని హిందూ కాలేజ్ లో పోలిటికల్ సైన్స్ అభ్యసించాడు.

Tags:    

Similar News