వచ్చే వరల్డ్ కప్ లో ఆ ఇద్దరు ఉండాలి: గంగూలీ

అమెరికా- వెస్టీండీస్ వేదికగా జూన్ లో మొదలయ్యే వరల్డ్ కప్ లో ఆ ఇద్దరి ఆటగాళ్లని చోటివ్వాలని మాజీ కెప్టెన్ సౌరవ్ గంగూలీ సూచించాడు. ఆ ఆటగాళ్లు ఎవరంటే..

Update: 2024-04-27 07:13 GMT

అమెరికా- వెస్టీండీస్ వేదికగా జూన్ లో ప్రారంభమయ్యే టీ20 వరల్డ్ కప్ లో భారత జట్టులో ఇద్దరు లెప్ట్ హ్యాండ్ బ్యాటర్లు ఉండాలని భారత మాజీ కెప్టెన్ సౌరవ్ గంగూలీ అభిప్రాయపడ్డారు. వారిలో ఒకరు ఢిల్లీ క్యాపిటర్ కెప్టెన్, వికెట్ కీపర్ రిషబ్ పంత్ అని, మరో ఆటగాడు అక్సర్ పటేల్ అని చెప్పాడు. ముఖ్యంగా ఎనిమిదో నెంబర్ లో వచ్చి బౌలింగ్, బ్యాటింగ్ చేయగల సమర్థులు ఉంటే ఉత్తమం అని అభిప్రాయపడ్డారు. అందుకు గాను అక్షర్ పటేల్ సరిపోతాడని మాజీ కెప్టెన్ పేర్కొన్నారు. 

మ్యాచ్ పరిస్థితిని బట్టి అక్షర్ పటేల్ బ్యాటింగ్ ఆర్డర్‌లో పైకి, కిందికి మారే అవకాశం ఉంది. రాబోయే T20 ప్రపంచకప్ కోసం భారత జట్టులో అక్షర్ తన స్థానాన్ని బుక్ చేసుకుంటాడని మాజీ కెప్టెన్ సౌరవ్ గంగూలీ వ్యాఖ్యానించారు. ఐపీఎల్ లో అక్షర్ 7.06 ఎకానమీ రేటుతో అన్ని సీజన్లలో అద్భుతంగా బౌలింగ్ చేశాడు. బ్యాటింగ్ లో ప్రమోట్ అయినప్పుడు, గుజరాత్ టైటాన్స్‌పై తన బ్యాటింగ్ పరాక్రమాన్ని చూపించాడు.
"అక్షర్ కు జట్టులో చోటు ఖాయం. టి20 ప్రపంచకప్‌లో రిషబ్, అక్షర్ ఇద్దరూ ఉండాలి. టి20లో ప్రస్తుత పరిస్థితుల దృష్ట్యా, ఎనిమిదో నంబర్ లో కూడా ఎవరైన బ్యాటింగ్, బౌలింగ్ చేయగల సామర్థ్యం ఉన్న ఆటగాడు ఉండాలని కెప్టెన్ రోహిత్ శర్మ కోరుకుంటాడు.
చివర్లో వేగంగా 15- 20 పరుగులు సాధిస్తే జట్టుకు ఉపయోగంగా ఉంటుంది. ఈ పనిని అక్షర్ సులువుగా చేయగలడని అనిపిస్తోంది. వెస్టీండీస్ పిచ్ లు చాలా నెమ్మదిగా ఉంటాయి. అటువంటి పరిస్థితుల్లో అక్షర్ చాలా ఉపయోగపడతాడని అనిపిస్తోంది"అని గంగూలీ చెప్పారు. జడేజా, అక్షర్ ఇద్దరు ప్రతిభావంతులే. ఇద్దరితోని ప్రయోజనం ఉంది. కానీ అక్షర్ చాలావేగంగా బ్యాటింగ్ చేస్తున్నాడు. ఎడమచేతి వాటం ఆటగాడు, ఆల్ రౌండర్‌ అయిన అక్షర్‌కు టెస్టులతో పాటు టీ20ల్లోనూ బ్యాటింగ్ చేయగల సత్తా ఉందని అన్నాడు.
"నీకు బంతిని కొట్టే సామర్థ్యం ఉండాలి. T20 క్రికెట్‌లో టెక్నిక్ కోసం సమయం అవసరం లేదు. అక్షర్ కు ఈ సామర్థ్యం ఉంది" అని గంగూలీ కొనియాడారు. "భారత్ తరఫున టెస్టుల్లో అతని బ్యాటింగ్ చూసినప్పుడు, అతను టర్నింగ్ పిచ్‌లపై ఒత్తిడిలో పరుగులు సాధించాడు. T20లో మీకు స్ట్రైక్ చేయగల సామర్థ్యం అవసరం. ఈ సామర్థ్యం అతనిలో ఉంది. "అతను అద్భుతమైన క్రికెటర్ -- బ్యాట్‌, బౌల్స్, ఫీల్డింగ్ లోనూ నైపుణ్యం ఉంది. టి20 క్రికెట్‌లో పవర్ హిట్టింగ్ చేయగలడు. అతను చాలా ప్రతిభావంతుడైన క్రికెటర్," గంగూలీ చెప్పారు.
కారు ప్రమాదం తరువాత పంత్ పూర్తిగా కోలుకుని మైదానంలోకి రావడం, పూర్థి స్థాయి సామర్థ్యంతో బ్యాటింగ్ చేస్తున్నాడని కొనియాడారు. ఇప్పటి వరకూ ఐపీఎల్ లో మూడు అర్ధసెంచరీలు సాధించాడు. గుజరాత్ టైటాన్స్ తో జరిగిన మ్యాచ్ లో ఆకాశమే హద్దుగా చెలరేగాడు. ప్రస్తుతం వికెట కీపింగ్ కోసం జట్టులో నలుగురి మధ్య పోటీ ఉందని గంగూలీ వివరించాడు. ఇషాన్ కిషన్, సంజూ శాంసన్ తో పాటు దినేష్ కార్తీక్ పోటీ పడుతున్నారని అన్నాడు. కానీ పంత్ తుది జట్టులో ఉంటాడని అభిప్రాయపడ్డారు.
"నేను రిషబ్, సంజులను ఇష్టపడుతున్నాను. రిషబ్ T20 ప్రపంచ కప్‌కు వెళ్తాడు. సంజు కూడా వెళ్ళవచ్చు, అతను వద్దు అని నేను చెప్పడం లేదు. అతను అందరిలాగే మంచి ఆటగాడు, కీపింగ్, బ్యాటింగ్, రాజస్థాన్ కెప్టెన్ గా మంచి ప్రతిభ కనపరుస్తున్నాడు. ఇద్దరు జట్టుతో వెళ్లవచ్చని అంటున్నాడు.
Tags:    

Similar News