సందేశ్‌ఖాలీలో రేప్ కంప్లైంట్ ఎందుకు విత్ డ్రా చేసుకున్నారు?

సందేశ్ ఖాలీకి చెందిన ఇద్దరు మహిళలు తృణమూల్ కాంగ్రెస్ (టిఎంసి) నాయకులపై చేసిన అత్యాచార ఫిర్యాదును వెనక్కు తీసుకున్నారు.

Update: 2024-05-09 12:34 GMT

పశ్చిమ బెంగాల్‌లోని సందేశ్‌ఖాలీ వివాదం నాటకీయంగా మలుపు తిరిగింది. సందేశ్ ఖాలీకి చెందిన ఇద్దరు మహిళలు తృణమూల్ కాంగ్రెస్ (టిఎంసి) నాయకులపై చేసిన అత్యాచార ఫిర్యాదును వెనక్కు తీసుకున్నారు. బిజెపితో సంబంధం ఉన్నవాళ్లు ఒత్తిడి చేయడంతో అలా చేయవలసి వచ్చిందని వారు అంటున్నారు.

ఒక మహిళ, ఆమె అత్త ఉపాధి పనులకు వెళ్లేవారు. వారికి కూలీ డబ్బులు రావాల్సి ఉంది. ఈ విషయం తెలుసుకున్న ఓ మహిళ..కూలీ డబ్బులు ఇప్పిస్తానని తెల్ల కాగితాలపై సంతకాలు చేయించుకుంది. ఆ తర్వాత టీఎంసీ నేతలు తమపై అత్యాచారానికి ఒడిగట్టారని రాసి ఉన్న ఆ కాగితాలు పోలీసులకు అందడంతో రాజకీయ దుమారం రేగింది. వాస్తవానికి తాము కేవలం సంతకం మాత్రం చేశామని, మేం అత్యాచార బాధితులం కాదని అత్తాకోడళ్లు చెబుతుండడంతో కేసు మరో మలుపు తిరిగింది. " సంతకం చేయించుకున్న ఆమె బయటి వ్యక్తి. ఇక్కడ ఉన్న అందరి గురించి ఆమెకు ఎలా సమాచారం అందిందో మాకు తెలియదు. ఆమె బీజేపీలో ఉన్నట్లు మాకు తర్వాత తెలిసింది. మాకు అబద్ధాలు చెప్పి మాతో సంతకం చేయించుకున్న ఆమెకు శిక్ష పడాలి. అత్యాచార ఫిర్యాదును ఉపసంహరించు కున్నందుకు తనకు, తన కుటుంబసభ్యులకు బెదిరింపులు వస్తున్నాయని అత్తా కోడళ్లు చెబుతున్నారు.

ఈ విషయం తెలిసి అధికార TMC వెంటనే దాడికి మొదలుపెట్టింది. రాజకీయాల కోసం బిజెపి మహిళలను వాడుకుంటోందని ఆరోపించింది. తృణమూల్ ఎంపీ సుస్మితా దేవ్ మాట్లాడుతూ..బీజేపీ మహిళలను రాజకీయాల కోసం వాడుకోవడమే కాకుండా, ప్రతిపక్ష పార్టీకి వ్యతిరేకంగా మాట్లాడే మహిళలను ఇప్పుడు బీజేపీ బెదిరించడం మొదలుపెట్టిందని ఆరోపించారు. అత్యాచారం ఆరోపణలను ఉపసంహరించుకున్న మహిళలను స్థానిక బీజేపీ నేతలు బెదిరించారని బెంగాల్ మహిళా, శిశు అభివృద్ధి శాఖ మంత్రి శశి పంజా అంటున్నారు.

Tags:    

Similar News