అమెరికాను నమ్మి వాతలు పెట్టుకున్న కమేడియన్ జెలెన్ స్కీ
అమెరికా యూరప్ దేశాలే ఉక్రెయిన్ రష్యా యుద్ధానికి కారకులు;
By : బిఎస్ రాములు
Update: 2025-02-24 04:28 GMT
అమెరికా యూరప్ నాటో దేశాలే ఉక్రెయిన్-రష్యా యుద్ధానికి కారకులు అని చాలా స్పష్టంగా ఈయుద్ధం జరుగుతున్న తీరు చూస్తే అర్థమవుతుంది. చరిత్ర తెలియని ఉక్రెయిన్ అధ్యక్షుడు వొలొదిమిర్ జెలెన్ స్కీ (Volodymyr Oleksandrovych Zelensky) ప్రపంచ సంక్షోభానికి తుపాకి తూటా లా సాధనమయ్యాడు. రాజకీయాల్లోకి రాకముందు జెలెన్ స్కీ హాస్యనటుడు. అయితే, ఆయన ఉక్రెయిన్ ప్రభుత్వంలోని అవినీతి జనం ముందు ఉంచేందుకు ఈనటనా కౌశలాన్ని వాడుకున్నాడు. విజయవంతమయ్యాడు. అయితే, ఈనటుడు తనకు పనికొస్తాడని ఆమెరికా కూడా భావించింది. అంతే, జెలెన్ స్కీ 2019 దేశాధ్యక్షుడిగా ఎన్నికయ్యాడు.
జెలెన్ స్కీ కి రాజకీయ , చారిత్రక అవగాహన లోపం యుద్ద పరిస్థితులకు దారి తీసింది. ఇజ్రాయిల్ కు అమెరికా పూర్తి మద్దతు ఇచ్చినట్టు యూరప్ అమెరికా నాటో దేశాలు ఉక్రెయిన్ కు పూర్తి మద్దతు ఇస్తాయని మాయ మాటలు నమ్మి జెలెన్ స్కీ ప్రపంచం ఆర్థిక సంక్షోభంలో మునగడానికి కారకుడయ్యాడు. చరిత్ర తెలియక చేసిన పొరపాటు ఇది. నాలుగు కోట్ల ఉక్రెయిన్ ప్రజలు విద్వంసానికి కారకుడయ్యాడు. నాటోలో చేరాలనుకున్న ఆయన మోజు ఉక్రెయిన్ ప్రాణం మీదికి తెచ్చింది. ఇది నచ్చని రష్యా అధ్యక్షుడు వ్లదిమిర్ పుతిన్ 2022 ఫిబ్రవరిలో ఉక్రెయిన్ మీద యుద్ధం ప్రకటించాడు. అది ఇంకా కొనసాగుతూ ఉంది.
చరిత్రలోకి వెల్తే మరికొన్ని తెలుస్తాయి. సోవియట్ యూనియన్ (Soviet Union) లో ఉన్నపుడే ఉక్రెయిన్ ఎంతో అభివృద్ది చెందింది. 1972. నాటి సోవియట్ భూమి తెలుగు పత్రికలో ఉక్రెయిన్ అభివృద్ది గురించి ప్రత్యేక వ్యాసాలు వచ్చేవి. విడి పోయిన తరువాత సోవియట్ యూనియన్ దేశాలకు రష్యాకు వ్యతిరేకంగా యూరప్ అమెరికాలతో జత కట్టాలని నాటో (NATO)లో కోవడం పెద్ద పొరపాటు.
ఆ పొరపాటుకు కారణం యూరప్ అమెరికా దేశాల ఒత్తిడిలో కారణం. నిజానికి నాటో కూటమిలో చేరడం వల్ల ఉక్రెయిన్ కు కలిగే ప్రయోజనం ఏమీ లేక పోగా రష్యాకు తీవ్ర ఇబ్బందులు ఎదురవుతాయి. ఇంటెనక నాటో ట్యాంకులుఉన్నపుడు రష్యా సహజంగా అభద్రతా భయంకు లోనయింది . జెలెన్స్కీ ఎవరి మాయ మాటలో విని ఉక్రెయిన్ ను బలి చేశాడు.
నాలుగు కోట్ల మందిలో కోటి మందిని వలస బాట పట్టించాడు. బడులు లేవు. చదువులు లేవు. మార్షల్ లా తో ఏదీ బయటకు రానీయలేదు.
ఉక్రెయిన్ పై రష్యా యుద్దం ప్రకటించడం కన్న కూతురు పై యుద్దం చేయడమే. నాటోలో చేర కూడదు చేరితే , చేర్చుకుంటే ఖబర్దార్ అని రష్యా మెుదటే హెచ్చరించి వుంటే సమస్య ఉత్పన్నం అయ్యేది కాదు. అసలు రష్యా చేసిన మొదటి తప్పు ఏమంటే 13 దేశాలుగా విడి పోవడానికి అంగీకరించడమే.
‘మనమంతా కామన్ వెల్త్ దేశాల వలె కలిసి వుండాలి. పరస్పరం సాంకేకేతికత ఇచ్చి పుచ్చుకోవాలి. పరిపాలనలో కరెన్సీ ముద్రణలో మీ ఇష్టం. కాని మనమంతా సాంస్కృతికంగా , సైనిక పరంగా ఒకే కూటమిగా ఉండాలి . ఎప్పటిలా మన సోవియట్ దేశాల సాహిత్య ప్రచురణలు రష్యా కొనసాగిస్తుంది. వీసాలు లేకుండా పాస్ పోర్టు ఐడెంటిటీ కార్డుతో సోవియట్ యూనియన్ పౌరుల్లా అందరు కలిసి మెలిసి తిరగ వచ్చు,’ అని ఒప్పించి మెప్పించి ఉంటే ఇలా జరిగిఉండేది కాదు.
అఫ్ఘనిస్తాన్ లో రష్యా జోక్యం చేసుకోవడం సంక్షోభానికి దారి తీసింది. సరే అది అలా ఉంచుదాం. విడిపోయేటప్పుడు పెద్దన్నగా, తండ్రిగా, తల్లిగా రష్యా సరైన పాత్ర నిర్వహించలేదు. తూర్పు పాకిస్తాన్ బంగ్లా దేశ్ గా విడి పోయినపుడు ఇండియా నిర్వహించినట్టు గా రష్యా నిర్వహించ లేకపోయింది.