మేము బ్యాటింగ్, బౌలింగ్ లో మెరుగవ్వాలి: వార్నర్
తమ జట్టు బ్యాటింగ్, బౌలింగ్ లో మెరుగవ్వాలని ఓపెనర్ డేవిడ్ వార్నర్ అభిప్రాయపడ్డారు. ప్లే ఆఫ్ చేరాలంటే అన్ని మ్యాచ్ లు గెలవాలని అన్నారు.
By : The Federal
Update: 2024-04-23 10:46 GMT
ప్రస్తుత ఐపీఎల్ లో తాము ప్లే ఆఫ్ చేరాలంటే అన్ని మ్యాచ్ లు గెలవాలని, అందుకోసం బ్యాటింగ్, బౌలింగ్ లో మా ప్రతిభను మెరుగుపరుచుకోవాలని ఢిల్లీ క్యాపిటల్ జట్టు ఓపెనర్ డేవిడ్ వార్నర్ అభిప్రాయపడ్డారు. " ఇప్పుడు మేము ప్లే ఆఫ్ చేరాలంటే అన్ని మ్యాచ్ లు గెలవాల్సిందే. వేరే మార్గం లేదు. మా బ్యాటింగ్, బౌలింగ్ లో ఉత్తమ నైపుణ్యాలు వెలికి తీయాలి " అని అభిప్రాయపడ్డారు. ఇప్పటివరకు ఆడిన ఎనిమిది మ్యాచ్‌లలో ఐదింటిలో ఓడిపోయిన DC, బుధవారం గుజరాత్ టైటాన్స్‌తో జరిగిన మ్యాచ్ లో ఆ జట్టును చిత్తు చేసింది.
" మేము గుజరాత్‌పై ఆడినట్లుగా ప్రతి గేమ్ ఆడగలము," అని వార్నర్ మీడియా ఇంటరాక్షన్ సందర్భంగా చెప్పారు. ఆస్ట్రేలియాకు చెందిన ఈ లెప్ట్ హ్యాండర్ ఇంకా మాట్లాడుతూ "మేము బ్యాట్, బాల్ రెండింటిలోనూ కొంత మెరుగవ్వాలి. లోపాలను తగ్గించగలిగితే, చాలా బాగుంటుంది. మొదట బ్యాటింగ్ చేస్తే, వీలైనన్నీ ఎక్కువ పరుగులు సాధించడం, లక్ష్యాన్ని కాపాడుకోవడానికి ఉత్తమ వనరులను ఉపయోగించాలని అన్నారు. గుజరాత్ తో మ్యాచ్ సందర్భంగా ఢిల్లీ క్యాపిటల్స్ ప్రత్యర్థిని కేవలం 89 పరుగులకే ఆలౌట్ చేసింది. ఈసందర్భంగా తమ జట్టు బౌలింగ్ ను వార్నర్ హైలెట్ చేశారు.
" యువ బ్యాట్స్ మెన్ ను ఇందులో తప్పుపట్టలేము. కొన్ని సార్లు మనం అనుకున్నా ప్రణాళికలను గ్రౌండ్ లో అమలులో పెట్టలేకపోతుంటాం. మ్యాచ్ ప్రారంభంలో బౌలింగ్ లో ఎదురుదాడి చేసి రెండు, మూడు వికెట్లు పడగొట్టి ప్రత్యర్ధి జట్లను ఆత్మరక్షణలో పడేసి, తరువాత బ్యాటింగ్ లో ఎదురుదాడి చేయాలని ప్రణాళికలు వేసుకుంటున్నాం" అన్నారు. జట్టులో యువ బ్యాట్స్ మెన్ గురించి ప్రశ్నించినప్పుడు వార్నర్ సమాధానమిస్తూ.. "జేక్ (జేక్ ఫ్రేజర్-మెక్‌గర్క్) చాలా మంచివాడు. ఉత్తమ ప్రతిభావంతుడు. అభిషేక్ పోరెల్ కూడా అత్యుత్తమంగా ఉన్నాడు.
"అభిషేక్ మొదటి గేమ్‌లో ఆడలేదు, కానీ మేము ప్రారంభంలోనే వికెట్లు కోల్పోయిన తర్వాత ఇంపాక్ట్ ప్లేయర్‌గా వచ్చాడు. మొదటి మ్యాచ్ లో తొమ్మిది బంతులను ఎదుర్కొని 30 పరుగులు సాధించి మ్యాచ్ స్వరూపాన్ని మార్చాడు. నాకు సరిగా గుర్తులేదు కానీ, భవిష్యత్ లో మంచి ఆటగాడు అవుతాడని కొనియాడాడు