భారత్, పాక్ అణ్వాయుధాల మాటేమిటి? ఎవరి దగ్గర ఎన్ని ఉన్నాయి?

ప్రపంచంలో అణు వార్ హెడ్ ల సంఖ్య పై సిప్రి నివేదిక ఇచ్చింది. ఆశ్చర్యకరంగా చైనా వార్ హెడ్ ల సంఖ్య తక్కువ సంఖ్యలో పెరిగినప్పటికీ దాని వేగం మాత్రం అసాధారణంగా..

Update: 2024-06-18 07:26 GMT

భారత్ కు చుట్టూ రెండు అణ్వాయుధ దేశాలు ఉన్నాయి. కొన్ని లెక్కల ప్రకారం అవి రెండు నిరంతరం తమ అణ్వాయుధ సంపత్తిని పెంచుకోవడానికే ప్రయత్నాలు చేస్తుంటాయి. చైనా సంగతి ఏమో కానీ పాక్ అణ్వాయుధాలు మాత్రం భారత్ ను ఉద్దేశించే తయారు చేస్తున్నట్లు పాకిస్తాన్ మంత్రులు చాలా సార్లు హెచ్చరించారు. దీనితో భారత్ కూడా తప్పనిసరి పరిస్థితుల్లోనే తన అణు పాటవాన్ని పెంచుకోవాల్సి వస్తోంది.

తాజాగా స్టాక్ హోమ్ ఇంటర్నేషనల్ పీస్ రీసెర్చ్ఇన్‌స్టిట్యూట్ (SIPRI), స్వీడిష్ థింక్-ట్యాంక్,రిపోర్ట్ ప్రకారం ఉపయోగించడానికి ప్రపంచ వ్యాప్తంగా 2100 అణు క్షిపణులు ప్రయోగానికి సిద్ధంగా ఉన్నాయి.
యుఎస్, రష్యా, ఫ్రాన్స్, చైనా, ఇండియా, పాకిస్తాన్‌తో సహా తొమ్మిది అణ్వాయుధ దేశాలు తమ అణ్వాయుధాలను ఆధునీకరించడాన్ని కొనసాగించాయని సిప్రి తన రిపోర్ట్ లో పేర్కొంది. వాటిలో చాలా వరకూ 2023 లో కొత్త అణ్వాయుధ వ్యవస్థలను మోహరించినట్లు పేర్కొంది.
నివేదిక వెల్లడించిన కొన్ని ఆసక్తికరమైన విషయాలు..
1. ఈ సంవత్సరం జనవరిలో భారతదేశం "నిల్వ చేసిన" అణు వార్‌హెడ్‌ల సంఖ్య 172 కాగా, పాకిస్తాన్ సంఖ్య 170. 2023లో భారతదేశం తన అణు ఆయుధాలను కొద్దిగా విస్తరించింది. ఆ సంవత్సరంలో భారత్-పాకిస్తాన్ రెండూ కొత్త రకాల అణు సరఫరా వ్యవస్థలను అభివృద్ధి చేయడం కొనసాగించాయి. "భారత అణ్వాయుధాలు పాకిస్తాన్ ప్రధాన కేంద్రంగా ఉన్నప్పటికీ, చైనా అంతటా లక్ష్యాలను చేరుకోగల సామర్థ్యంతో ఉన్న సుదూర శ్రేణి క్షిపణులన అభివృద్ధి చేసింది.
2. చైనా అణు ఆయుధాలు జనవరి 2023లో 410 వార్‌హెడ్‌ల నుంచి 2024 జనవరిలో 500కి పెరిగాయి. వాటి సంఖ్య ఇంకా పెరుగుతూనే ఉందని సిప్రి తెలిపింది.
3. భారతదేశం, పాకిస్తాన్, ఉత్తర కొరియాలు బాలిస్టిక్ క్షిపణులపై బహుళ వార్‌హెడ్‌లను మోహరించే సామర్థ్యాన్ని అనుసరిస్తున్నాయి, రష్యా, ఫ్రాన్స్, యుకె, యుఎస్ ఇటీవల కాలంలో చైనా వీటిని సాధించాయని పేర్కొంది. వీటి సంఖ్య చాలా వేగంగా పెరుగుతున్నట్లు అలాగే అణ్వాయుధ దేశాలకు ఎక్కువ సంఖ్యలో ఎక్కువ లక్ష్యాలను నాశనం చేసే కొత్తతరం సాంకేతికతపై దృష్టిపెట్టినట్లు తెలిపింది.
4.మోహరించిన వార్‌హెడ్‌లలో దాదాపు 2,100 బాలిస్టిక్ క్షిపణులు అన్ని కూడా యూఎస్, రష్యాకు చెందినవే మెజారిటీ అని పీస్ సంస్థ వెల్లడించింది. అయితే, మొదటిసారిగా చైనా కొన్ని వార్‌హెడ్‌లను హై ఆపరేషనల్ అలర్ట్‌లో సిద్ధంగా ఉంచినట్లు తెలిపారు.
5. ప్రపంచం మొత్తం మీద 2024 జనవరి నాటికి 12,121 అణు వార్ హెడ్ లు ఉన్నాయని, వాటిలో 9, 585 వినియోగానికి సిద్ధంగా ఉన్నాయని ఉన్నాయని నివేదించింది. వాటిలో 3,904 అణు క్షిపణులు యుద్ధ విమానాల్లో మోహరించారంది. 2023 జనవరితో పోల్చుకుంటే ఈ సంవత్సరం మరో 60 అణు వార్ హెడ్లు పెరిగాయని, మిగిలినవి సెంట్రల్ స్టోరేజ్ లో ఉన్నాయంది.
6. రష్యా - US కలిసి మొత్తం అణ్వాయుధాల్లో దాదాపు 90 శాతం కలిగి ఉన్నాయి. జనవరి 2023 కంటే దాదాపు 36 వార్‌హెడ్‌లను రష్యా తన బలగాలతో మోహరించినట్లు అంచనా వేసినప్పటికీ, మొత్తానికి దాని నిల్వలు స్థిరంగా ఉన్నాయి.
7. దశాబ్దం ముగిసే సమయానికి రష్యా లేదా యుఎస్‌ల వలె చైనా కూడా అనేక ఖండాంతర బాలిస్టిక్ క్షిపణులను (ICBMలు) కలిగి ఉండవచ్చు. అయినప్పటికీ, చైనా అణు వార్‌హెడ్‌ల నిల్వ ఇప్పటికీ రష్యా- యుఎస్‌ల నిల్వల కంటే చాలా తక్కువగా ఉంటుందని భావిస్తున్నారు.
"చైనా తన అణ్వాయుధాలను ఇతర దేశాల కంటే వేగంగా విస్తరిస్తోంది" అని SIPRI వెపన్స్ ఆఫ్ మాస్ డిస్ట్రక్షన్ ప్రోగ్రామ్‌తో అసోసియేట్ సీనియర్ ఫెలో,ఫెడరేషన్ ఆఫ్ అమెరికన్ సైంటిస్ట్స్ (FAS) వద్ద న్యూక్లియర్ ఇన్ఫర్మేషన్ ప్రాజెక్ట్ డైరెక్టర్ హన్స్ M క్రిస్టెన్‌సెన్ అన్నారు. చైనాతో పోల్చుకుంటే అమెరికా అణు పరిజ్ఙానం కనీసం 15 సంవత్సరాలు వెనకబడి ఉందని తెలిపారు.
Tags:    

Similar News