ఐఏఎస్‌ కావాలనుకున్న ఒడిశా అమ్మాయికి గవర్నర్‌ చేసిందేమిటి?

గవర్నర్‌ సాయం ఆమెకు ప్రోత్సాహా నిచ్చింది.లక్ష సాధనకు గమ్యాన్ని సుగమం చేసింది..ఎవరా గవర్నర్‌.. చేసిన సాయం ఏమిటో తెలుసుకుందాం..

Update: 2023-12-21 07:28 GMT
Odisha Governor Raghubar Das - IAS Aspirant Kabitha

ఒడిశా (Odisha) గవర్నర్‌  రఘుబర్‌ దాస్‌ జిల్లాల పర్యటనలో భాగంగా మల్కాన్‌గిరి జిల్లాకు వచ్చారు. ఓ కార్యక్రమంలో పాల్గొనేందుకు మత్తిలి పరిధిలోని పంగం బడగూడ గ్రామానికి చేరుకున్నారు. గ్రామస్థులంతా వినతిపత్రాలను చేతపట్టుకుని తమ సమస్యలను గవర్నర్‌కు చెప్పుకోడానికి క్యూ కట్టారు. అదే వరుసలో కబిత కారా అనే అమ్మాయి కూడా నిలుచుంది. తన వంతు రానే వచ్చింది. ఐఏఎస్‌ కావాలనుకుంటున్నానని చెబుతూనే..తన పేద కుటుంబ నేపథ్యం, ఆర్థిక ఇబ్బందులను గవర్నర్‌కు వివరించింది.వెంటనే స్పందించిన గవర్నర్‌ ఆమెకు రూ. లక్ష ఆర్థిక సాయం (Financial assistance) చేస్తానని చెప్పారు.

ఈ సందర్భంగా కబిత మాట్లాడుతూ.. ‘‘మా గ్రామానికి గవర్నర్‌ రావడం.. ఆయన్ను నేను నేరుగా కలవడం నిజంగా నా అదృష్టం. కొందరు గ్రామసమస్యల గురించి, కొంతమంది తమ వ్యక్తిగత సమస్యల గురించి ఆయనకు చెప్పారు. గవర్నర్‌ నా గురించి కూడా అడిగారు. నేను ఐఏఎస్‌ అధికారి కావాలనుకుంటున్నానని చెప్పాను. నేను నా కుటుంబం, ఆర్థిక సమస్యల గురించి చెప్పడం ముగించడానే.. గవర్నర్‌ (Odisha Governor Raghubar Das) చిరునవ్వుతో నాకు రూ.1 లక్ష ఆర్థిక సాయం చేస్తానని హామీ ఇచ్చారు. నేను దానిని సాయంగా కాకుండా దేవుని ఆశీర్వాదంగా భావిస్తా. గవర్నర్‌కు ఎంతో రుణపడి ఉంటా’’నని ఎంతో సంతోషంగా చెప్పింది కబిత.

Tags:    

Similar News