హిమాలయాల్లో పెరిగిన సరస్సుల విస్తీర్ణం.. కారణం ఏంటీ?

వాతావరణ మార్పుల వల్ల హిమాలయాల్లోని సరస్సుల విస్తీర్ణం పెరిగినట్లు సీడబ్ల్యూసీ నివేదిక వెల్లడించింది.

Update: 2024-11-03 13:13 GMT

వాతావరణ మార్పుల వల్ల గడచిన దశాబ్దకాలంలో హిమాలయా నదాలు వేగంగా కరుగుతున్నాయని కేంద్ర ప్రభుత్వం వెల్లడించింది. ప్రభుత్వ డేటా ప్రకారం 2011 నుంచి 2024 వరకూ హిమానీ నదాలు 10.81 శాతం విస్తీర్ణంలో కరిగాయి. నదాలు వేగంగా కరగడం వల్ల వేగంగా వరదలు సంభవించాయని తెలిపింది.

సెంట్రల్ వాటర్ కమిషన్ (CWC) నివేదిక ప్రకారం, హిమానీ నదాలు భూఉపరితల వైశాల్యంలో 33.7 శాతం కరిగాయని దీనితో దేశంలో సరస్సులు గణనీయంగా నీటిని పొందాయని వెల్లడించాయి. "భారతదేశంలో హిమానీ నదుల వల్ల సరస్సుల వల్ల 2011లో 1,962 హెక్టార్లు కాగా, 2024 (సెప్టెంబర్) నాటికి 2,623 హెక్టార్లకు పెరిగింది. విస్తీర్ణంలో 33.7 శాతం పెరుగుదల ఉంది’’ అని నివేదిక పేర్కొంది.
పెరిగిన ప్రమాదం..
దేశంలోని 67 సరస్సులో 40 శాతం అధిక నీటిని పొందాయని సీడబ్ల్యూసీ వెల్లడించింది. లడఖ్, హిమాచల్ ప్రదేశ్, ఉత్తరాఖండ్, సిక్కిం, అరుణాచల్ ప్రదేశ్ వంటి రాష్ట్రాలలో సరస్సులు ఎక్కువ మొత్తంలో నీటిని పొందాయి. ఇది నిజంగా విపత్తులను తీసుకొచ్చేది. హిమాలయ ప్రాంతంలోని హిమానీనద సరస్సులు, ఇతర నీటి వనరులు వాతావరణ మార్పుల కారణంగా 2011లో 5,33,401 హెక్టార్ల నుంచి 2024 నాటికి 5,91,108 హెక్టార్లకు 10.81 శాతం పెరిగిందని నివేదిక పేర్కొంది.
ఈ ప్రాంతంలో పెరుగుతున్న ఉష్ణోగ్రతల కారణంగా హిమానీనదాలు వేగంగా కరిగిపోవడమే ఈ సరస్సుల వేగవంతమైన విస్తరణకు కారణమని,  ఈ పరిణామంతో నీటి వనరులపై ఆధారపడి జీవిస్తున్న సమాజంలో మౌలిక సదుపాయాలు, జీవవైవిధ్యానికి తీవ్రమైన విపరిణామాలు ఎదురయ్యే అవకాశం ఉందని పేర్కొంది.
పటిష్టమైన పర్యవేక్షణ అవసరం
భౌతికంగా, పర్వత హిమానీనదాలు తగ్గిపోవడం, సరస్సుల విస్తరణ వాతావరణం ఎంత వేగంగా వేడి ఎక్కుతుందో సూచిస్తుంది. ఈ సరస్సులలోకి అత్యధిక మొత్తం నీరు చేరినప్పుడు అవి గట్లు తెగి ఆకస్మికంగా భారీ మొత్తంలో విపత్తు వరదలు సృష్టిస్తాయి. ఈ సరస్సులలో పెరిగిన నీటి వ్యాప్తికి కఠినమైన పర్యవేక్షణ, తక్షణ ప్రమాద నిర్వహణ వ్యూహాలు అవసరమని సీడబ్ల్యూసీ నొక్కి చెప్పింది.
ఇలాంటి సరస్సులను ట్రాక్ చేయడంలో సవాళ్లను అధిగమించడానికి, CWC అధునాతన ఉపగ్రహ సాంకేతికతను, ప్రత్యేకించి సెంటినెల్-1 సింథటిక్ ఎపర్చరు రాడార్ (SAR), సెంటినెల్-2 మల్టీస్పెక్ట్రల్ చిత్రాలను ఉపయోగించిందని, ఇవి ఖచ్చితమైన, అన్ని-వాతావరణ పర్యవేక్షణను ప్రారంభించగలవని సీనియర్ అధికారి ఒకరు తెలిపారు.
సరిహద్దు ప్రమాదాలు
"ఈ ఉపగ్రహాల అధిక-రిజల్యూషన్ సామర్థ్యాలు క్లౌడ్ కవర్ వంటి కఠిన పరిస్థితులలో కూడా 10-మీటర్ల ఖచ్చితత్వంతో సరస్సు పరిమాణంలో మార్పులను గుర్తిస్తాయి ” అని అధికారి తెలిపారు. CWC నివేదిక భూటాన్, నేపాల్, చైనాతో సహా పొరుగు దేశాలలో హిమనదీయ సరస్సులను విస్తరించడం ద్వారా ఎదురయ్యే సరిహద్దు ప్రమాదాలను కూడా గుర్తించింది.
ఉమ్మడి పర్యవేక్షణ ప్రయత్నం
సమగ్రమైన రిస్క్ అసెస్‌మెంట్, ఉపశమన వ్యూహాన్ని రూపొందించడానికి సంయుక్త పర్యవేక్షణ ప్రయత్నాలు డేటా షేరింగ్ కోసం సీడబ్ల్యూసీ నివేదిక పిలుపునిచ్చింది. ముందస్తు హెచ్చరిక వ్యవస్థలను అభివృద్ధి చేయడం, విపత్తు నిర్వహణ ప్రణాళికలను మెరుగుపరచడం, హాని కలిగించే జనాభాను రక్షించడానికి కమ్యూనిటీ అవగాహన కార్యక్రమాలను ప్రోత్సహించడంలో అంతర్జాతీయ, ప్రాంతీయ సహకారం తక్షణ అవసరాన్ని ఇది హైలైట్ చేసింది.
హిమనదీయ సరస్సుల విస్తరణ వల్ల ఆకస్మిక వరదలే కాకుండ, గంగా, బ్రహ్మపుత్రా, సింధూ నదీ పరివాహక వ్యవస్థలో నీటి లభ్యత ప్రభావితం అయ్యే అవకాశం కూడా ఉంది. 2011 నుంచి డేటాను ఉపయోగించడం, ఐదు, పది సంవత్సరాల సగటులతో పోల్చడం ద్వారా, CWC నివేదిక హిమనదీయ సరస్సు విస్తరణ నమూనాలను గుర్తించింది.
ఇది అధిక-ప్రమాదకర ప్రాంతాలను గుర్తించడానికి అధికారుల పని సులువు చేసింది. CWC హిమాలయ హిమానీనద సరస్సుల ద్వారా ఎదురవుతున్న సవాళ్లను ముందుగానే గుర్తించడం, ప్రతిస్పందన కోసం ఒక బలమైన వ్యవస్థను ఏర్పాటు చేయాలని లక్ష్యంగా పెట్టుకుంది.
Tags:    

Similar News