కీరవాణిని వ్యభిచారి అంటున్న ఈ సినీడైరెక్టర్ ఎవరు?
అతనో అహంకారని, వ్యభిచారని, పాటపై ప్రేమతో వచ్చే పిల్లలతో వెట్టి చాకిరీ చేయించుకుంటారంటూ రకరకాల వ్యవహారాలు బయటకు వస్తున్నాయి;
By : The Federal
Update: 2025-04-27 11:55 GMT
ప్రముఖ సంగీత దర్శకుడు కీరవాణిపై వివాదం ముసురుకుంది. ఆయన వ్యక్తిత్వంపై తీవ్ర విమర్శలు చెలరేగుతున్నాయి. ఇప్పటికే ఓ ఛానల్ లో వచ్చే కార్యక్రమంపై వివాదం ముదిరి బజారున పడగా ఇప్పుడు ఆయన వ్యక్తిత్వంపై మచ్చ పడేలా కొందరు సినీ ప్రముఖులే ఆరోపణలు చేశారు. అతనో అహంకారని, వ్యభిచారని, పాటపై ప్రేమతో వచ్చే పిల్లలతో వెట్టి చాకిరీ చేయించుకుంటారంటూ రకరకాల వ్యవహారాలు బయటకు వస్తున్నాయి. తాజాగా సీనియర్ డైరెక్టర్ గీత కృష్ణ ఓ రేంజ్ లో రెచ్చిపోయారు. కీరవాణిపై తీవ్ర ఆరోపణలు చేశారు.
"కీరవాణి ఒక వ్యభిచారి.. వాడి గురించి నాకు 40 సంవత్సరాల నుంచి తెలుసు.. వాడి గురించి మనకెందుకులే అని వదిలేశాను. చాలామంది నా దగ్గరకు వచ్చి చెప్పేవాళ్లు. తనపై దుమ్మెత్తిపోయాల్సిన అవసరం నాకేంటని మౌనంగా ఉన్నాను. ఎప్పుడైనా రెండు, మూడు పార్టీల్లో కలిశాడు. అంతే! ఇప్పుడిక మౌనంగా ఉండలేను" అన్నారు గీత కృష్ణ.
"పాడుతా తీయగా" షోలో తనకు అన్యాయం జరిగిందని సింగర్ ప్రవస్ధి ఆవేదన వ్యక్తం చేసిన నేపథ్యంలో గీత కృష్ణ ఈ ఆరోపణ చేశారు. ఆ షో నిర్మాతలు, జడ్జిలు కీరవాణి, సునీత, చంద్రబోస్ తనను చీడపురుగులా చూశారని, అవమానించారని ప్రవస్థి ఆరోపించింది. దీనిపై సినీ సంగీత ప్రపంచంలో కలకలం చెలరేగింది.
కీరవాణి (MM Keeravani) దగ్గర మెప్పు పొందేందుకు తను కూడా ఐదారేళ్లు కష్టపడిందని.. తర్వాతే ఆయన దగ్గర పాడే అవకాశం దక్కిందని సింగర్ లిప్సిక తెలిపింది. కీరవాణి దగ్గర చాకిరీ చేయడం సింగర్స్ అందరికీ ఇష్టమేనని.. చాకిరీ అంటే నోట్స్ రాయడం, ప్రాక్టీస్ చేయడంలాంటివి ఉంటాయంది. లిప్సిక మాత్రమే కాదు పలువురు సింగర్లు సైతం.. ప్రవస్తిని తప్పుపడుతూ జడ్జిలకు సపోర్ట్ చేస్తూ వీడియోలు రిలీజ్ చేశారు. తాజాగా ఓ తెలుగు దర్శకుడు మాత్రం ప్రవస్తికి సపోర్ట్ చేస్తూ మాట్లాడాడు.
సీనియర్ డైరెక్టర్ గీతా కృష్ణ ఏమన్నారంటే...
సీనియర్ డైరెక్టర్ గీతా కృష్ణ ఓ ఛానల్ కి ఇచ్చిన ఇంటర్వ్యూలో తప్పంతా కీరవాణిదే అన్నారు. "కీరవాణి ఒక వ్యభిచారి.. వాడి గురించి నాకు 40 ఏళ్లుగా తెలుసు.. వాడి గురించి మనకెందుకులే అని వదిలేశాను. చాలామంది నా దగ్గరకు వచ్చి చెప్పేవాళ్లు. తనపై దుమ్మెత్తిపోయాల్సిన అవసరం నాకేంటని మౌనంగా ఉన్నాను.." అన్నారు.
"రాజమౌళి గురించి అటువంటి రిమార్క్ వినలేదు. కీరవాణి తండ్రి కూడా నాతో చాలా బాగా మాట్లాడతాడు. ఇప్పుడు కీరవాణి గురించి ఎందుకి లా అంటున్నానంటే.. వీడికి అమ్మాయిలను సప్లై చేసేవారితో స్కూల్ పిల్లలు కావాలని అడుగుతాడట! కీరవాణిపై పోక్సో కేస్ వేయాలి. కీరవాణికి క్లాసికల్ వచ్చు కానీ వెస్ట్రన్ కీబోర్డ్ ప్లే చేయడం రాదు. ఈ విషయంలో మణిశర్మ కీరవాణికి సాయం చేశేవాడు" అని గీత కృష్ణ ఆరోపించారు.
ఒకప్పటి కీరవాణికి ఇప్పటి వ్యక్తికి చాలా తేడా ఉందన్నారు. "అప్పట్లో కీరవాణిని ఆఫీస్‌లో నుంచి గెంటేశారని తెలిసి నా సినిమాకు పిలిపించుకుని వెయ్యి రూపాయలు ఇచ్చాను. ఇప్పుడేమో పెళ్లిళ్లలో పాటలు పాడేవారంటే చిరాకు.. మా ఇంటికొచ్చి వెట్టిచాకిరీ చేయాలి" అని వెధవ కబుర్లు చెప్తున్నావ్.. నువ్వేం మహారాజువి కాదు" అని గీతా కృష్ణ ఆగ్రహం వ్యక్తం చేశాడు. గీతా కృష్ణ కూడా చాలా సినిమాలకు దర్శకత్వం వహించారు. వాటిలో సంకీర్తన, కోకిల, కీచురాళ్లు, సర్వర్ సుందరంగారి అబ్బాయి వంటివి ఉన్నాయి. సంకీర్తన చిత్రానికి నంది అవార్డు అందుకున్నాడు.
గీత కృష్ణ ఆరోపణలతో సినీ ప్రపంచంలో కల్లోలం బయలుదేరింది. ఇదే అదునుగా పలువురు కీరవాణిపై విరుచుకుపడుతున్నారు. ఆయనకు మద్దతు పలికిన ప్రముఖ సింగర్ సునీతను కూడా సోషల్ మీడియాలో ట్రోల్ చేస్తున్నారు.