ఎలక్టోరల్ బాండ్ల బాగోతం రచ్చకీడ్చిన డేరింగ్ లేడీ ఈమెనే...
ఎలక్టోరల్ బాండ్ల వివరాలను మంగళవారంలోగా ఎన్నికల కమిషన్‌కు అందించాలని సుప్రీంకోర్టు స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియాను ఆదేశించింది.
ఎలక్టోరల్ బాండ్ల వివరాలను మంగళవారంలోగా ఎన్నికల కమిషన్‌కు అందించాలని సుప్రీంకోర్టు స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియాను ఆదేశించింది. సుప్రీం సూచనతో మధ్యప్రదేశ్‌లోని సాగర్ జిల్లాకు చెందిన దంతవైద్యురాలు కాంగ్రెస్ మహిళ జయ ఠాకూర్ ముఖ్యంగా హర్షం వ్యక్తం చేశారు. జయ ఠాకూర్ మధ్యప్రదేశ్ మహిళా కాంగ్రెస్ ప్రధాన కార్యదర్శి. ఆమెకు తన స్వంత పార్టీ నుంచి ప్రోత్సాహం లభించనప్పటికీ, ఎన్నికల బాండ్లకు వ్యతిరేకంగా పిటిషన్ దాఖలు చేసింది. సుప్రీంకోర్టు న్యాయవాదిని వివాహం చేసుకున్న ఠాకూర్ గతంలో 2023 చట్టం ప్రకారం కొత్త ఎన్నికల కమిషనర్‌లను నియమించకుండా కేంద్రాన్ని నిరోధించాలని కోరుతూ ఠాకూర్ సుప్రీంకోర్టులో పిటిషన్ దాఖలు చేయడంతో వార్తల్లో కెక్కారు. ఎన్నికల కమిషనర్ అరుణ్ గోయల్ రాజీనామా, అనుప్ చంద్ర పాండే పదవీ విరమణ తర్వాత రెండు ఎన్నికల కమిషనర్ల స్థానాలు ఖాళీ అయ్యాయి.
2017లో ఆర్థిక బిల్లులో ప్రవేశపెట్టిన ఎలక్టోరల్ బాండ్ల పథకాన్ని రద్దు చేయాలని కోరుతూ సుప్రీంకోర్టును ఆశ్రయించిన పిటిషనర్లలో ఠాకూర్ ఒకరు. ఈమెతో అసోసియేషన్ ఫర్ డెమోక్రటిక్ రిఫార్మ్స్ సీపీఐ(ఎం) కలిసి సుప్రీం కోర్టులో కేసు ఫైల్ చేశారు.
సెప్టెంబర్ 2017లో ఈ పథకాన్ని సవాలు చేస్తూ PIL దాఖలు చేశారు. ఇది నిష్పాక్షికమైన ఎన్నికలకు విరుద్ధంగా ఉంది" అని పిటిషనర్లు కోర్టులో కేసు ఫైల్ చేశారు.
ఆరేళ్ల తర్వాత, ఫిబ్రవరి 15, 2024న ఈ పథకానికి వ్యతిరేకంగా దాఖలైన పిటిషన్‌లను విచారించేందుకు ఏర్పాటైన SC ఐదుగురు న్యాయమూర్తుల బెంచ్ ఈ పథకాన్ని రద్దు చేస్తూ పిటిషనర్లకు అనుకూలంగా తీర్పును వెలువరించింది.
ఎలక్టోరల్ బాండ్ అంటే?
రాజకీయ పార్టీలకు రహస్యంగా నిధులు అందించడానికి వీలు కల్పించే ఎన్నికల బాండ్ల పథకాన్ని గత నెల 15న సుప్రీంకోర్టు రద్దు చేసింది. మార్చి 6లోగా పార్టీలకు అందిన సొమ్ము, ఇచ్చిన దాతల వివరాలను ఎన్నికల సంఘానికి అందించాలని నాడు ఎస్‌బీఐని సుప్రీం ఆదేశించింది. ఈ క్రమంలో మరింత గడువు కావాలంటూ ఎస్‌బీఐ సుప్రీంను ఆశ్రయించింది.
సుప్రీం కోర్టు అసహనం..
తాజాగా దీనిపై ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ డి.వై.చంద్రచూడ్ నేతృత్వంలోని ఐదుగురు సభ్యుల రాజ్యాంగ ధర్మాసనం విచారణ జరిపింది. ఎస్‌బీఐ మరింత సమయం కోరడంపై కోర్టు అసహనం వ్యక్తం చేసింది. రేపటిలోగా విరాళాల వివరాల్ని వెల్లడించాలని స్పష్టం చేసింది. సుప్రీం తీర్పుపై పిటిషన్ జయఠాకూర్ స్పందించారు.
పాఠశాల విద్యార్థులకు ఉచితంగా శానిటరీ ప్యాడ్లు..
మహిళల హక్కులపై అవగాహన కల్పించేందుకు మక్కువ చూపే ఠాకూర్.. రాష్ట్రాలు, కేంద్ర పాలిత ప్రాంతాలు 6, 12వ తరగతి చదువుతున్న ప్రతి విద్యార్థికి ఉచితంగా శానిటరీ ప్యాడ్‌లు అందించాలని కోరుతూ సుప్రీంకోర్టులో పిల్ దాఖలు చేశారు.
2023లో ఆమె పిటిషన్‌పై, "అన్ని పాఠశాలల్లో తక్కువ ధరకు శానిటరీ ప్యాడ్‌లను పంపిణీ చేసే వెండింగ్ మెషీన్ల లభ్యత" ఉండేలా చూడాలని సుప్రీంకోర్టు రాష్ట్రాలను ఆదేశించింది.
2022లో ఎన్‌ఫోర్స్‌మెంట్ డైరెక్టరేట్ (ED) డైరెక్టర్ సంజయ్ కుమార్ మిశ్రా పదవీకాలం పదే పదే పొడిగించడంపై పిల్ దాఖలు చేశారు. ప్రజాస్వామ్యంలో ఇది విరుద్దమని ఆమె పేర్కొన్నారు.
2023లో అదానీ గ్రూప్‌పై హిండెన్‌బర్గ్ రీసెర్చ్ రిపోర్టు విడుదలైన తర్వాత.. ఆ గ్రూప్, దాని సహచరులు పెట్టుబడిదారులపై విచారణ జరపాలని సుప్రీం కోర్టును ఆశ్రయించారు.