ప్రొఫెసర్ వైఎస్ఆర్ మూర్తికి జాతీయ అవార్డు
జస్టిస్ జేఎస్ వర్మ జాతీయ పురస్కారాన్ని అందించిన సుప్రీంకోర్టు జడ్జ్ జస్టిస్ కోటిశ్వర్ సింగ్.;
ప్రొఫెసర్ వైఎస్ఆర్ మూర్తికి అరుదైన గౌరవం లభించింది. మానవ హక్కుల న్యాయశాస్త్రంలో ఆయన అందించిన సేవలకు గుర్తింపుగా జేఎస్ వర్మ్ జాతీయ అవార్డును అందించారు. న్యూఢిల్లీలో కాపిటల్ ఫౌండేషన్ సొసైటీ నిర్వహించిన కార్యక్రమంలో ఈ వార్డును సుప్రీంకోర్టు న్యూయమూర్తి జస్టిస్ కోటిశ్వర్ సింగ్.. మూర్తికి ప్రదానం చేశారు. ఒకవైపు జాతీయ మానవహక్కుల కమిషన్‌లో విధులు నిర్వర్తిస్తూ మరోవైపు మానవహక్కులపై అవగాహన కల్పించడంలో మూర్తి అపారమైన కృషి చేశారు. పబ్లిక్ హెల్త్, మానసిక ఆరోగ్యం, వైకల్యం ఉన్న వ్యక్తి హక్కులు ఇలా అనేక అంశాలపై ఆయన విస్తృత ప్రచారం చేశారు. 12 సంవత్సరాల పాటు మానవహక్కులకు ఆయన చేసిన సేవలకు లభించిన గుర్తింపే జస్టిస్ జేఎస్ వర్మ్ అవార్డ్.
ప్రొఫెసర్ మూర్తి 2009-2020 మధ్య ఓపీ జిందాల్ గ్లోబర్ యూనివర్శిటీ(JGU)లో రిజిస్ట్రార్‌గా పనిచేశారు. అప్పటి నుంచే వర్సిటీలో మానవహక్కుల విద్య కోసం ప్రత్యేక సెంటర్‌ను స్టార్ట్ చేశారు. అక్కడ అనేక రకాల కార్యక్రమాలు నిర్వహించారు. ఆ సెంటర్‌లో ఓటు హక్కు, మరణశిక్ష రద్దు, దక్షిణఆసియా మానవహక్కుల పనితీరు ఇలా అనేక అంశాలకు సంబంధించి కీలక నివేదికలను విడుదల చేశారు. దాంతో పాటుగానే మణిపూర్‌లో చట్టవిరుద్ద హత్యలకు వ్యతిరేకంగా, అసోంలో విదేశీయుల ట్రిబ్యునళ్లపై కూడా పనిచేశారు.
ఆ తర్వాత ఆయన జస్టిస్ జేఎస్ వర్మ్ మెమోరియల్ లెక్చర్ సిరీస్‌ను స్టార్ట్ చేశారు. జేడీయూలో చేసిన ఈ కార్యక్రమంలో ఎంతో మంది ప్రముఖుల చేత ప్రసంగాలు ఇప్పించారు. 2020-2024 మధ్య ఆర్‌వీ యూనివర్సిటీ ఫౌండింగ్ వైస్ ఛాన్సలర్‌గా ఉన్న ఆయన అదే సమయంలో ఆర్‌వీ వర్సిటీలో మానవహక్కుల స్టడీస్‌కు ప్రత్యేక సెంటర్‌ను స్టార్ట్ చేశారు. అక్కడ చాలా కీలక కార్యక్రమాలు నిర్వహించారు కూడా. మూర్తి.. మానవహక్కులపై రెండు MOOC కోర్సులను సిద్ధం చేశారు. అవి ఏడేళ్లుగా సక్సెస్‌ఫుల్‌గా కొనసాగుతున్నాయి. అంతేకాకుండా ఆ కోర్సులు ఇప్పటి వరకు ఎనిమిది భారీతీయ భాషల్లోకి అనువాదించబడ్డాయి.
వీటితో పాటుగానే మహిళా సాధికారత, ఎస్సీ, ఎస్టీ, టార్చర్ నియంత్రణ వంటి వాటిపై అనేక ఎన్‌జీవోలతో కలిసి మూర్తి వర్క్ చేస్తున్నారు. మూర్తి సేవలకు జేఎస్ వర్మ జాతీయ అవార్డు కన్నాముందు దాదాపు 11 ఇతర అవార్డులు కూడా వచ్చాయి. వాటిని లా, మెడిసిన్, డిఫెన్స్, ఎంఎస్ఎంఈ రంగాలకు చెందిన ప్రముఖులు ప్రదానం చేశారు. 12 సంవత్సరాల పాటు జాతీయ మానవహక్కుల కమిషన్ సెక్రెటరీ మానవ హక్కుల చైతన్యం పెంచేందుకు ఆయన చేసిన సేవలకు లభించిన గుర్తింపే జస్టిస్ జేఎస్ వర్మ్ అవార్డ్.