12 లక్షల ఆదాయం దాకా ఇన్ కమ్ టాక్స్ లేదు
మధ్యతరగతి ప్రజలకు నిర్మల భారీ వరం;
మిడిల్ క్లాస్ ప్రజలకు కేంద్రం బడ్జెట్‌లో భారీ ఊరట లభించింది. ఇంతకాలం రూ.7 లక్షల వరకు మాత్రమే పన్ను రహిత ఆదాయం ఉండగా ఇప్పుడు దానిని రూ.12లక్షలకు పెంచారు కేంద్రం ప్రభుత్వం. ఇన్‌కమ్ ట్యాక్స్ స్లాబ్స్‌లో కూడా కీలక మార్పులు తీసుకొచ్చారు. ఈ వివరాలను కేంద్రం ఆర్థిక శాఖ మంత్రి నిర్మలాసీతారమన్.. బడ్జెట్ ప్రసంగంలో వివరించారు. ఇంతకాలం అమలులో ఉన్న ఆదాయ పన్నులో తాజాగా కొన్ని సవరణలను తీసుకురావడం జరిగింది. మధ్యతరగతి వారికి లాభం చేకూర్చడం కోసమే తమ ప్రభుత్వం ఈ నిర్ణయం తీసుకున్నట్లు తెలిపారు. అయితే ట్యాక్స్‌లో చేసిన ఈ సవరణలు వ్యక్తులు, సంస్థలు తదితరాలకు 2025-2026 ఆర్థికసంవత్సరంలో మారవని, ఈ సవరణలు 2026-2027 ఆర్థిక సంవత్సరానికి అమలవుతాయని చెప్పారు.
దేశ అభివృద్ధికి మధ్యతరగతి కీలక సోమానంగా ఉంటుందని తమ ప్రభుత్వం భావిస్తుంది. అందుకనే వారికి లాభం చేకూర్చేలా మోదీ నేతృత్వంలోని ప్రభుత్వం నిర్ణయం తీసుకుంది. అందులో భాగంగానే ఆదాయ పన్నుల్లో కీలక సవరణలు తీసుకురావడం జరిగింది. రూ.12 లక్షల వరకు ఎటువంటి ఆదాయపన్ను ఉండదు. రూ.12 లక్షలపైన మరో రూ.75,000 వరకు స్టాండర్డ్ డిడక్షన్ అందిస్తున్నట్లు తెలిపారు. క్యాపిటల్ గెయిన్స్ విషయంలో మాత్రం కొత్త స్లాబ్స్ తీసుకొచ్చినట్లు వెల్లడించారు.
పన్ను స్లాబ్స్ ఎలా ఉన్నాయంటే..
కొత్త సవరణల ప్రకారం పన్ను స్లాబ్స్‌లో కీలక మార్పులు తీసుకొచ్చారు. రూ.0-4లక్షల వరకు ఎటువంటి పన్ను ఉండదు. రూ.4-8 లక్షల క్యాపిటల్ గెయిన్స్‌కు 5శాతం పన్ను ఉంటుంది. 8-12 లక్షల వరకు 10శాతం, 12-16 లక్షల వరకు 15శాతం, 16-20 లక్షల వరకు 20శాతం, 20-24 లక్షల వరకు 25శాతం, రూ.24లక్షల పైన ఆదాయం వస్తే 30శాతం పన్ను ఉండనున్టన్లు నిర్మలా సీతారామన్ వివరించారు.
క్యాపిటల్ గెయిన్స్ అంటే..
సాధారణంగా మనకు వచ్చే జీతా బత్యాలను సాధారణ ఆదాయంగానే ఉంటుంది. అది కాకుండా భౌతిక, ఆర్థిక ఆస్తుల నుంచి వచ్చే ఆదాయాన్ని క్యాపిటల్ గెయిన్స్ అంటారు. అంటే భూములు, అద్దెలకు ఇళ్లు ఇవ్వడం ద్వారా వచ్చే ఆదాయాలు, పలు సంస్థల్లో పెట్టే పెట్టుబడులు వంటి వాటిని క్యాపిటల్ గెయిన్స్ అంటారు. వీటికి మాత్రమే పన్ను విధించడం జరుగుతుందని కేంద్ర ఆర్థిక మంత్రి నిర్మల సీతారామన్ వెల్లడించారు. సాధారణంగా శాలరీ ద్వారా వచ్చే ఆదాయంపై మాత్రం రూ.12 లక్షల వరకు ఎటువంటి పన్ను వేయడం లేదని స్పష్టతనిచ్చారు.