కెసిఆర్ ఎల్కతుర్తిలో ఏం చెబుతారు? ఏమైనా మారతారా?

రాష్ట్ర రాజకీయాలకు, జాతీయ స్థాయి వ్యూహాలను ప్రకటిస్తారా?;

Update: 2025-04-26 11:33 GMT

సెప్టెంబర్ 2, 2018న హైదరాబాద్ శివార్లలోని కొంగర కలాన్‌లోమాజీ ముఖ్యమంత్రి కల్వకుర్తి చంద్రశేఖర్ రావు ( కెసిఆర్‌) ప్రగతి నివేదన సభ జరిపి నప్పుడే ఆయన కొత్త వ్యూహం చేపడుతున్నట్టు అందరూ భావించారు. ‘మీరు ఢల్లీకి బానిసలుగానే ఉంటారా’ అని ఆయన ప్రశ్నించారు మరి నాలుగు రోజుల్లో శాసనసభను రద్దుచేసి హుస్నాబాద్‌ లో ‘ప్రజా ఆశీర్వాద సభతో ప్రచార సభల పరంపర ప్రారంభించారు. ఆ ఏడాది డిసెంబర్‌ 7న జరిగిన ఎన్నికల్లో టిఆర్‌ఎస్‌ అఖండ విజయం సాధించింది. మొదటిసారి అధికారంలోకి వచ్చినదాంతో పోలిస్తే రెండవ సారి కెసిఆర్‌ ప్రభుత్వం టిఆర్‌ఎస్‌ పార్టీ ఎదుర్కొన్న సవాళ్లు ,ఎదురు దెబ్బలు చాలా ఎక్కువ. 117లో 88 స్థానాలు గెలుచుకొని డిసెంబర్‌ 13న కేసీఆర్‌ రెండవ సారి ముఖ్యమంత్రిగా ప్రమాణ స్వీకారం చేశారు. ఆ మరుసటి రోజునే కెసిఆర్, కెటి రామారావు (కేటీఆర్‌) ను టిఆర్‌ఎస్‌ వర్కింగ్‌ ప్రెసిడెంట్‌ గా నియమించడంతో నాయకత్వ సమస్యల్లో ఒక కీలకమైన అడుగు పడిరది.

ఉద్యమ కాలంలో ఎలా గడిచినా అధికారం అంటూ వచ్చాక కేసీఆర్‌ తర్వాతి స్థానం ఎవరిది అనే ప్రశ్న రాజకీయ మీడియా వర్గాలను వర్గాలలో తరచు వినిపిస్తూనే వచ్చింది. ఈ ఎన్నికలకు ముందు ఒక దశలో కెటిఆర్‌ పట్టాభిషేకం నిర్ణయమైందనే అన్నారు. హరీష్‌ రావుతో ఒక ఛానల్‌లో ప్రత్యేకంగా ఇంటర్వ్యూ ఏర్పాటు చేయిస్తే కెసిఆర్‌ చెప్పినట్టే దడుచుకుంటానని ప్రకటించాల్సి వచ్చింది.

కేటీఆర్‌ కొత్త నియామకం తర్వాత కొద్ది వారాలపాటు పాటు మంత్రివర్గం ఏర్పాటు చేయకుండా కేసీఆర్‌ జాప్యం చేశారు. చివరకు ఫిబ్రవరి తర్వాతే అది జరిగింది. అయితే ఈ విస్తరణలో కేటీఆర్ హరీష్‌ రావు తో సహా చాలామందికి చోటు కల్పించలేదు. అందుకోసం మరో ఆరు నెలలు ఆగవలసి వచ్చింది. మొదటి పర్యాయం తుమ్మల నాగేశ్వరరావు వంటి వారిని చేర్చుకొని సంచలనం సృష్టించినట్టే ఈ మలిదఫాలో సబితా ఇంద్రారెడ్డి ఇలాంటి వాళ్లను కేసీఆర్‌ మంత్రులను చేశారు. ఈ కాలమంతా కేటీఆర్‌ వర్కింగ్‌ ప్రెసిడెంట్గా కీలక స్థానంలో కొనసాగుతుంటే మరోవైప హరీష్‌ రావు తీవ్రమైన ఒత్తిడికి గురయ్యాడంటారు.

కుటుంబ సభ్యుల మధ్య నాయకత్వ పోటీ ఏమీ లేదని చెబుతున్నా సహజంగానే ఇలాంటి పరిణామాలు విషయాలు వాస్తవాలను చెబుతూ వచ్చాయి. 2019 మార్చి నెలలో లోక్ సభ ఎన్నికలు ప్రకటించగానే మళ్లీ కేసిఆర్‌ ‘ఆశీర్వాద సభ’ జరిపారు. ఆయన ఊహించినట్టే శాసనసభ తో పోలిస్తే ఈసారి ఫలితాలు బాగా తగ్గాయి 17 లో 9 స్థానాలు మాత్రమే అంటే ఇంచుమించు సగం మాత్రమే బి ఆర్‌ ఎస్‌ కి వచ్చాయి స్థానిక ఎన్నికల్లో మాత్రం ఆ పార్టీ మంచి ఫలితాలు సాధించింది. కవిత ఎన్నికల్లో ఓడిపోవడం కొత్త పరిస్థితికి దారి తీసింది.

ఈటెల రాజేందర్ ఎపిసోడ్ మొదట దెబ్బ

హరీష్‌ రావు విషయం ఎలా ఉన్నా ఈటెల రాజేందర్‌ అసంతృప్తి బయటపడటం తనని కావాలని దూరం పెడుతున్నారని ఆయన ఆరోపించడం పార్టీలో ప్రభుత్వంలో పరిస్థితిని మార్చివేసింది. కరోనా తాకిడి, ఆ సమయంలో రాజేందర్‌ ఆరోగ్య మంత్రిగా ఉండటం ఎందుకు తోడైంది. పార్టీ అధికారంలోకి రాకముందు శాసన సభ పక్ష నాయకుడిగా ఉండి తర్వాత సీనియర్‌ మంత్రిగా పనిచేసిన ఈటెల రాజేందర్‌ పై అక్రమాల ఆరోపణలు వాటిని ఆయన బహిరంగంగా ఖండిరచటం , అనేక మలుమలుపుల తర్వాత రాజేందర్‌ తొలగింపు జరిగిపోయింది. కెసిఆర్‌ కీలక నేతలకు సీనియర్‌ మంత్రులకు కూడా అందుబాటులో ఉండరనే మాట ,ఎవరికి అపాయింట్మెంట్‌ ఇవ్వాలనే మాట సర్వసాధారణమైపోయింది. రాజేందర్‌ రాజీనామా వల్ల వచ్చిన హుజురాబాద్‌ ఉపఎన్నికకు ముందు ‘దళిత బంధు’ పేరుతో పెద్ద పథకం ప్రకటించడమే కాక దానికోసం విస్తృత సమావేశాలు జరిపి కొత్త సమీకరణాలకు తెర లేపినప్పటికీ ఆ ఎన్నికల్లో పెద్ద మెజార్టీతో రాజేందర్‌ విజయం సాధించటం కెసిఆర్‌ ప్రభావానికి మొదటి బహిరంగ విఘాతంగా మారింది. ఆ సమయంలో ఆయన మాటలు చేతలు చర్యలు అన్నింటిలో తీవ్రమైన ఒత్తిడి పెరిగింది.

ఈ నేపథ్యంలోనే కెసిఆర్‌ 2022 లో తెలంగాణ రాష్ట్ర సమితి పేరును భారత రాష్ట్ర సమితి (బిఆర్‌ఎస్‌) గా ఏర్పాటు పార్టీ పేరు మారుస్తున్నట్టు ప్రకటించారు. తెలంగాణ సాధన అభివృద్ధి లక్ష్యాలు నెరవేరాయి. కనుక ఇదే నమూనాలో దేశమంతటిని అభివృద్ధి చేయడం తమ లక్ష్యం అని పదేపదేమాట్లాడుతూ వచ్చారు. ఒక రాష్ట్ర సాధన కోసం ఏర్పడిన పార్టీ పేరు మార్పు గానే కాక స్వభావంలోనే మార్పుగా టిఆర్‌ఎస్‌ ను చాలా మంది పరిగణించారు. తెలంగాణ సెంటిమెంటు నుంచి కొంత దూరమైనట్టుగా వ్యాఖ్యలు ఒకవైపున వచ్చాయి. టిఆర్‌ఎస్‌ ఆంధ్రప్రదేశ్‌ శాఖ కూడా ఏర్పాటు చేయడం వల్ల జాతీయ రాజకీయ పరిభాష మాట్లాడడం వల్ల తెలంగాణకు మాత్రమే పరిమితమైన అదివరకటి దూకుడు కు అవకాశాలు లేకుండా పోయింది

బిఆర్‌ఎస్‌ అన్న తర్వాత కెసిఆర్‌ బిజెపి మత రాజకీయాలపై విమర్శలు పెంచుత్తూ వచ్చారు. 2022 నవంబర్లో వచ్చిన మునుగోడు ఉపఎన్నికలో వామపక్షాల సహకారం తీసుకుని గట్టెక్కడం వల్ల హుజురాబాద్‌ ఓటమి ప్రభావం నుంచి బయటపడినట్లు భావించారు.

అచ్చిరాని జాతీయ నాయకత్వం మోజు

కానీ రాజకీయమైన అస్పష్టత కొనసాగింది. కెసిఆర్‌ చెప్పే మరో ప్రత్యామ్నాయం ఎటువైపు ఉంటుంది ఎవరితో అన్నది పజిల్‌గా మారింది. తానే జాతీయ నాయకుడు కావాలని కోరుకోవటం, పరోక్షంగా చెప్పుకోవడం చెల్లుబాటు కాలేదు. అప్పటికే అరవింద కేజ్రీవాల,్‌ మమతా బెనర్జీ, నితీష్‌ కుమార్‌ వంటి వారు అందుకు వరుసలో ఉండగా కొత్తగా మరో ప్రధాని అభ్యర్థిగా ముందుకు వచ్చే అవకాశాలు పూర్తిగా మూసుకుపోయాయి.

కాంగ్రెస్‌లో రాహుల్‌గాంధీ వుండనే వున్నారు. మహారాష్ట్ర మధ్యప్రదేశ్‌ వంటిచోట్ల పర్యటనల కోసం బిఆర్‌ఎస్‌ వ్యయ ప్రయాసలు ఎటుపోతున్నాయో తెలియని పరిస్థితి ఏర్పడిరది. కేసీఆర్‌ కు జాతీయమైన ఆశలకన్నా ఆ పేరుతో 2018లాగే మరోసారి రాష్ట్రంలో ఆమోదం పొందడమే అసలు వ్యూహం అన్న అభిప్రాయం బలపడిరది. ఆపరేషన్‌ ఫామ్‌ హౌస్‌ వంటివి ఆచరణలో నిలవలేదు.

రాబోయే ఓటమికి ఎన్ని సూచనలో...

ఈ పూర్వ రంగంలో వరుస సర్వేలు టిఆర్‌ఎస్‌ ఓటమినే స్పష్టంగా సూచిస్తూ వచ్చాయి. కెసిఆర్‌ తమపై ఆగ్రహించి అభ్యంతరాలు చెప్పాక వాటిని చేశామని ఆ సర్వే సంస్థల వారు తర్వాత నాతో చెప్పారు. ఒకవైపు, బండి సంజయ్‌ దూకుడుతో బిజెపి మత రాజకీయాలు మరోవైపు సాగుతుంటే మునుగోడు తర్వాత వామపక్షాల ఊసుపట్టించుకోకుండా. ఒంటరి పోటీ అని చెప్పడం, హఠాత్తుగా అభ్యర్థుల జాబితా ప్రకటించడం ఇవన్నీ బీఆర్‌ఎస్‌ ను ఒంటరి పాటు చేశాయి. కానీ లిక్కర్స్‌ స్కాం కవితను చేర్చడం వల్ల బిజెపి పట్ల కెసిఆర్‌ మెతక వహిస్తున్నారనే భావం బలపడింది. ఈలోగా మరో స్థాయిలో కేటీఆర్‌ ఫామ్‌ హౌస్‌ డ రేవంత్‌ రెడ్డి లేవనెత్తిన వివాదం ఇవన్నీ ప్రజల దృష్టిని ఆకర్షిం ఛాయి. కాంగ్రెస్‌ పుంజుకోవటం గమనించిన బిజెపి నాయకత్వం దూకుడుగా ఉండే బండని తప్పించి కిషన్‌ రెడ్డిని రాష్ట్ర పార్టీ అధ్యక్షుడు చేయటం కెసిఆర్‌ పై రాజకీయాలపై సందేహాలు పెంచింది.

బిఆర్‌ఎస్‌ ఏర్పడినప్పటి నుంచి పార్టీ యంత్రాంగం విషయంలో సమిష్టి నిర్ణయాలు ఎప్పుడు ఉన్నది లేదు. ట్రబుల్‌ షూటర్‌ గా హరీష్‌ రావు, పార్టీ కీపర్‌ గా కేటీఆర్‌ నడిపించడమే. రాజేందర్‌ ఉదంతం తర్వాత సీనియర్లు క్రమంగా స్తబ్దతలోకి జారుకొని దూరమయ్యారు. జాతీయ స్థాయిలో ఇండియా వేదిక ఏర్పడుతున్నా అప్పటికే నితీష్‌ బిజెపి వైపు వెళ్లిపోయారు. కేసీఆర్ ఏ ‌ వైఖరి నిర్ణయించుకోలేకపోయారు.

పెద్ద ఎదురుదెబ్బ 2023

ఈ పరిస్థితుల్లో 2023 శాసనసభ ఎన్నికల నాటికి బి ఆర్‌ ఎస్‌ విజయం ఖచ్చితంగా ప్రశ్నార్థమై కూర్చుంది ఆ సమయంలో జరిగిన మీడియా చర్చల్లో కూడా ఆ పార్టీ కీలక నేతలు కనీసమెజార్టీతో బయటపడతామని మాత్రమే చెప్పగలిగే వారు. చివరకు అది కూడా సాధ్యం కానంతగా టిఆర్‌ఎస్‌ పట్టుకోల్పోయింది. 8 స్థానాలతో బిజెపి పుంజుకోగా కనీస మెజార్టీతో కాంగ్రెస్‌ అధికారంలోరి వచ్చింది. కొంత ఆలోచన వ్యవధితోనైనా రేవంత్‌ రెడ్డి ఖచ్చితమైన పట్టుతోనే ముఖ్యమంత్రి కాగలిగారు. ఆయన ప్రభుత్వం రెండు మాసాలకు మించి ఉండదని ఏవేవో జోష్యాలు ఊహలు కబుర్లు నడిచినా ఇప్పటికి కొనసాగుతోంది.

లోపాలు విమర్శలు చాలానే ఉన్నా రేవంత్‌ రెడ్డి ముఖ్యమంత్రిగా నిలదొక్కుోక్కున్నారు .కొత్త ప్రభుత్వం ఏర్పడుతుండగానే కెసిఆర్‌ కాలుజారి పడటం చికిత్స విశ్రాంతితో ఆరు మాసాలు గడపడం ఎందుకు తోడైంది ఈ కాలమంతా టిఆర్‌ఎస దాదాప్‌ు స్తబ్దంగానే ఉండిపోయింది. శాసనసభలో కేటీఆర్‌ ,హరీష్‌ రావు ఇతర మాజీలు గట్టిగా తలపడుతున్న కాంగ్రెస్‌ మరి ముఖ్యంగా రేవంత్‌ రెడ్డి అడుగడుగునా అడ్డు తగులుతూ వచ్చారు. కాలు బాగయ్యాక కూడా కేసీఆర్‌ శాసనసభకు రాకపోవడంతో మాటలు మాంత్రికుడు మూగబోయినట్టుంది. మధ్యలో సభలు జరిపిన తీవ్రంగా మాట్లాడిన పెద్ద ప్రభావం కనిపించలేదని చెప్పాలి ఈలోగా టిఆర్‌ఎస్‌ సీనియర్లు చాలామంది కండువాలు మార్చుకున్నారు అది మరో కథ.

కెసిఆర్ ని నిరాశ పర్చిన 2024

2024 లోక్ సభ ఎన్నికల్లో అంత మారిపోతుందని తమ పూర్వ వైభవం వచ్చేస్తుందని కేసీఆర్‌ జోస్యాలు చెప్పారు కానీ ఒక్క లోక్సభ స్థానం కూడా సాధించలేకపోవడం అశనిపాతమైంది. బిజెపిని గెలిపించడానికి టిఆర్‌ఎస్‌ ఓట్లు మళ్ళించిందని కాంగ్రెస్‌ ఆరోపణలు చేసింది.ఈలోగా కవిత అరెసు,్ట విచారణ చాలా జరిగాయి.ఏది ఏమైనా లోక్సభ ఎన్నికల్లో విజయం సాధించిన ఈటెల రాజేందర్‌ మళ్లీ విజేతగా ముందుకు రాగా ఆయనపై చర్య తీసుకున్న కేసీఆర్‌ అహం దెబ్బతిన్నట్టే అయింది. ఫామ్‌ హౌస్‌ కి వచ్చిన కార్యకర్తలు నాయకులతో మాట్లాడటం తప్ప ప్రజా జీవితంలోకి గాని శాసనసభలో కానీ బలంగా ముందుకు వచ్చేందుకు ఆయన ప్రయత్నించలేదు. కేటీఆర్‌ దీటుగా మాట్లాడుతూ క్రియాశీలంగా ఉన్నా అధినేత కదలిక లేకపోవడం ఆటంకంగానే మారింది. దానికి తోడు రేవంత్‌ రెడ్డి ప్రభుత్వం కాళేశ్వరం తో సహా గత విషయాలపై తీవ్రంగా దృష్టి పెట్టి వెంటాడిరది. ఇన్నింటి మధ్యన అస్తిత్వ పోరాటం లాగే టిఆర్‌ఎస్‌ పరిస్థితి మారింది శూన్యంలో నుంచి సునామి సృష్టించానని నేనే తెలంగాణ గతం భవిష్యత్తు అనే కెసిఆర్‌ స్వయంగా చెప్పుకున్నప్పటికీ అంతకుముందున్న స్పందన కొరవడింది.

ఏడాదిన్నర గడిచిన రేవంత్‌ ప్రభుత్వం పై దాడి ఒక్కటే బిఆర్‌ఎస్నుకు తీర్చుకోగలదన్నది ఇప్పటికీ సందేహాస్పదమే. గతం తాలూకు ఆరోపణల నుంచి బయటపడటం, రాజకీయ అవకాశవాదాలు ఊగిసలాటల నుంచి బయటపడి ఒక ఖచ్చితమైన విధానం తీసుకోవడం ఇప్పుడు టిఆర్‌ఎస్‌ ముందున్న మరీ ముఖ్యంగా కేసీఆర్‌ ముందున్న సవాలు. ఏపీలో జగన్మోహన్‌ రెడ్డి ఓడిపోయి చంద్రబాబు నాయుడు బిజెపి జనసేన తో కలిసి మళ్ళీ అధికారంలోకి రావడం కూడా టిఆర్‌ఎస్‌ కు సంతోషం కలిగించే విషయం కాదు.

రాష్ట్రానికి కేంద్రానికి కెసిఆర్ వ్యూహం ఏమిటి?

ఈ పరిస్థితుల్లో జాతీయంగాను రాష్ట్రంలోనూ కేసీఆర్‌ ఏం చేస్తారు.. బిజెపికి వ్యతిరేకంగా గట్టిగా నిలబడతారా ముందు కాంగ్రెస్‌ ను జయించడానికి అన్నది ప్రశ్న. గతంలో అనేకసార్లు అనేక విధాల మాటలుే మార్చిన నేపథ్యంలో ప్రజలను విశ్వసనీయత సాధించటం కష్టమైన సవాల.ే బిజెపి కాంగ్రెస్‌ ఒకటేనని ఎన్నిసార్లు చెప్పినా ఇతరులు నమ్మడం జరిగేది కాద.ు ఈ మూడు పార్టీలు తక్కిన రెండు ఒకటేనని మూడో పార్టీ చిత్రించే ప్రయత్నం చేయడం వృధా ప్రయాస మాత్రమే. టిఆర్‌ఎస్‌ కాంగ్రెస్‌ మధ్య మజిలీ రాజకీయాలు కూడా నడుస్తున్నాయి బిజెపిని మతతత్వాన్ని ప్రధాన ప్రత్యర్థిగా పరిగణించే వామసక్షాలు ఈ అస్పష్టతను ఆమోదించవు.

కనుక అంతర్గతంగా పార్టీ పరిస్థితినీ, రాజకీయంగా పార్టీ విధానాన్ని కెసిఆర్‌ ఎలా నిర్దేశిస్తారు నిర్వచిస్తారు అన్నది ఏప్రిల్ 27న హన్మకొండ జిల్లా ఎల్కతుర్తి లోజరిగే సభలోనే తేలవలసి ఉంటుంది. కాంగ్రెస్‌ పై విమర్శలు ఎన్ని చేసినా తన స్వీయ తప్పిదాలను ఆయన దిద్దుకోగలరా, ఏకపక్ష పొగడ్తలను వదులుకుంటారా? ఇవన్నీ చూడాల్సిందే.

ఎన్నికల్లో ఓడిపోయినా తమకు ఓట్లు బాగా వచ్చాయని 39 శాసనసభ సీట్లు తెచ్చుకున్నామని టిఆర్‌ఎస్‌ చెప్పుకుంటూనే ఉంది. కేసిఆర్‌ ఊహించినట్టే మోదీ ప్రభుత్వం టిడిపి జేడీయులపై ఆధారపడాల్సి వచ్చిందని ఆ పార్టీ నేతలు ఇప్పటికి సమర్థించుకుంటున్నారు. అంటే వారు కూడా అలా బిజెపిని సమర్థించడం ద్వారా కేంద్రంలో స్థానం పొందడానికి సిద్ధమేనా? ఈ ప్రశ్నకు ఎల్కతుర్తి ఏం చెబుతుంది ?చూద్దాం

Tags:    

Similar News