జర్నలిస్టు రేవతి అరెస్టుపై స్పందించిన ‘‘ఎడిటర్స్ గిల్డ్’’

‘‘తెలంగాణ ప్రభుత్వం విలేఖరులపై ఏ చర్య తీసుకున్నా.. చట్ట పరిధులకు లోబడి ఉండాలి. విలేఖరులు కూడా నిష్పాక్షికత, నిబద్ధతతో వ్యవహరించాలి’’- ఎడిటర్స్ గిల్డ్.;

Update: 2025-03-12 13:08 GMT
Click the Play button to listen to article

హైదరాబాద్‌కు చెందిన జర్నలిస్ట్ రేవతిని పోలీసులు అరెస్టు చేయడంపై భారత ఎడిటర్స్ గిల్డ్(Editors Guild of India) ఆందోళన వ్యక్తం చేసింది. బుధవారం తెల్లవారుజామున రేవతి(Journalist Revathi) ఇంటికి చేరుకున్న పోలీసులు ఆమెతో పాటు భర్తను స్టేషన్‌కు తీసుకెళ్లారు. తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గురించి ఓ రైతు మాట్లాడిన వీడియోను తన యూట్యూబ్ ఛానల్‌లో అప్‌లోడ్ చేసినందుకు రేవతిని అరెస్టు చేశారు. అందులో సీఎంపై చేసిన వ్యాఖ్యలు తీవ్ర అభ్యంతరకరంగా ఉన్నాయి. తెలంగాణ ప్రభుత్వం విలేఖరులపై ఏ చర్య తీసుకున్నా, చట్ట పరిధులకు లోబడి ఉండాలని గిల్డ్ అధ్యక్షుడు అనంత్ నాథ్, ప్రధాన కార్యదర్శి రూబెన్ బెనర్జీ, కోశాధికారి ప్రసాద్ కోరారు. విలేఖరులు కూడా రిపోర్టింగ్‌లో నిష్పాక్షికత, నిబద్ధతతో వ్యవహరించాలని వారు గుర్తుచేశారు. 

Tags:    

Similar News