స్కూళ్ల నుంచి బయటకు ఉరుకులు, పరుగులు

బెంగళూర్ లోని 15 ప్రయివేట్ స్కూల్లకు శుక్రవారం బాంబు బెదిరింపులు వచ్చాయి. దాంతో పోలీసులు, విద్యార్థులు, టీచర్లు, ఉరుకులు పరుగులు పెట్టారు. ఈ సంఘటన తల్లిదండ్రుల్లో తీవ్ర భయాందోళనలకు దారితీసింది.

Translated by :  Chepyala Praveen
Update: 2023-12-01 08:55 GMT
పాఠశాల గది

తమ కమాండ్ సెంటర్ కు బాంబు బెదిరింపుతో కూడిన ఈ మెయిల్ వచ్చిందని దాంతో ప్రభుత్వ యంత్రాంగాన్ని అప్రమత్తం చేశామని పోలీస్ ఉన్నతాధికారులు వెల్లడించారు. బాంబు డిస్పోజల్ స్క్వాడ్లను నగరంలోని వివిధ పాఠశాలకు తరలించినట్లు చెప్పారు. మొదట విద్యార్థులను, పాఠశాల సిబ్బందిని బయటకు తరలించి మొత్తం గాలించామని వివరించారు. అయితే ఇప్పటి వరకూ పాఠశాలల్లో అనుమానాస్పద వస్తువులు దొరకలేదని తెలిపారు. ఇది బెదిరింపు ఈ మెయిల్ గా భావిస్తున్నామని ఈ కేసును పరిశీలిస్తున్న సీనియర్ అధికారి మీడియాకు చెప్పారు. మా బృందాలు ఇంక పాఠశాల మైదానాల్లోనే నిలిపినట్లు పేర్కొన్నారు. గత ఏడాది కూడా కొంతమంది దుండగులు బెంగళూర్ లోని పలు పాఠశాలలకు బాంబులు పెట్టినట్లు ఈ మెయిల్స్ పంపగా అది బూటకంగా తరువాత తేలింది.

బెదిరింపు పాఠశాలను సందర్శించిన డీకే శివకుమార్

బాంబు బెదిరింపు వచ్చిన పాఠశాలల్లో ఒకదానిని కర్ణాటక ఉప ముఖ్యమంత్రి డీకే శివకుమార్ సందర్శించారు. పాఠశాల పరిస్థితిపై అధికారులను వివరాలు అడిగి తెలుసుకున్నారు. టీవీలో బాంబు బెదిరింపు వార్తలు విని ఆందోళనకు గురైయ్యాయని, వెంటనే ఇంటికి దగ్గరగా ఉన్న బెదిరింపుకు గురైన పాఠశాలకు వచ్చానని అన్నారు. పోలీసుల దగ్గర నుంచి బెదిరింపు వచ్చిన ఈ మెయిల్ చూశామని చెప్పారు. అది నకిలీదని తెలుస్తోందని, పోలీసులు ఈ అంశంపై ఆరా తీస్తున్నట్లు వివరించారు. తల్లిదండ్రులు తమ పిల్లల భద్రతపై ఆందోళన చెందవద్దని, వారు క్షేమంగా ఉంటారని హమీ ఇచ్చారు. సైబర్ క్రైమ్ టీం దుండగుల కోసం వెతుకుతోందని, 24 గంటల్లోనే వారిని పట్టుకుంటామని అన్నారు. 

Tags:    

Similar News