అందరికీ పిచ్చెక్కిస్తున్నగోషామహల్ ఎంఎల్ఏ రాజాసింగ్
రాజాసింగ్ అసలు బీజేపీలో ఉన్నట్లా ? లేనట్లా ? అన్నదే ఎవరికీ అర్ధంకావటంలేదు.
గోషామహల్ బీజేపీ ఎంఎల్ఏ రాజాసింగ్ అందరికీ పిచ్చెక్కిస్తున్నాడు. ఎంఎల్ఏ అసలు పార్టీలోనే లేడు. ఎందుకంటే పార్టీకి తాను రాజీనామా చేశాడు. (BJP)బీజేపీ మొత్తంమీద రాజాసింగ్(MLA Raja Singh) అంతటి వివాదాస్పద నేత మరోకళ్ళు లేరు అనటంలో అతిశయోక్తిలేదు. ప్రతిరోజు సొంతపార్టీ నేతలతో సహా ఎవరో ఒకళ్ళపై నోటికొచ్చినట్లు ఆరోపణలు, విమర్శలతో రెచ్చిపోతుంటాడు. ఈయన అతి ధోరణులు నచ్చక పార్టీయే సస్పెండ్ చేసి దూరంగా పెట్టేసింది. అలాంటి నేపధ్యంలో రాష్ట్ర అధ్యక్షపదవికి నామినేషన్ వేయనివ్వకుండా అడ్డుకున్నారన్న కోపంతో పార్టీకి రాజీనామా చేశాడు. ఎంఎల్ఏ చేసిన రాజీనామాను పార్టీ జాతీయ అధ్యక్షుడు(JP Nadda)జేపీ నడ్డా ఎలాంటి ఆలస్యంచేయకుండా వెంటనే ఆమోదించేశాడు.
ఏ పార్టీలో కూడా ఎంఎల్ఏ రాజీనామాను అంత తొందరగా ఆమోదించరు. అలాంటిది రాజాసింగ్ రాజీనామాను నడ్డా ఆమోదించారంటే పార్టీ నేతలు ఎంతగా విసిగిపోయారో అర్ధమవుతోంది. పార్టీకి రాజీనామా చేసినా ఎంఎల్ఏ మనసంతా పార్టీలోనే తిరుగుతోంది. పార్టీ నాయకత్వమేమో రాజాసింగ్ కు బీజేపీకి సంబంధంలేదని ప్రకటిస్తోంది. ఇలాంటి నేపధ్యంలోనే రాజాసింగ్ గురువారం ఢిల్లీలో ప్రధానమంత్రి నరేంద్రమోదీ సమావేశంలో ప్రత్యక్షమయ్యారు. తెలంగాణ బీజేపీ ప్రజాప్రతినిధులు అంటే ఎంపీలు, ఎంఎల్ఏలు మోదీతో భేటీ అయ్యారు. ఆభేటీలో మోదీ పక్కనే రాజాసింగ్ నిలబడ్డారు. బీజేపీ ప్రజాప్రతినిధుల సమావేశంలో రాజాసింగ్ ఎలా ప్రత్యక్షమయ్యాడు ? ప్రధానితో భేటీలో ప్రత్యక్షమయ్యాడంటే ఎవరో అత్యంత ప్రముఖ నేత దగ్గరుండి రాజాసింగ్ ను తీసుకుని వెళ్ళినట్లు అర్ధమవుతోంది.
ఇంతకీ రాజాసింగ్ బీజేపీలోనే ఉన్నాడా ? లేడా అన్న విషయమే ఎవరికీ అర్ధంకావటంలేదు. బీజేపీకి రాజాసింగ్ రాజీనామా చేసింది వాస్తవం, పార్టీ జాతీయ అధ్యక్షుడు రాజీనామాను ఆమోదించిందీ వాస్తవం. అందుకనే రాజాసింగ్ కు బీజేపీతో ఎలాంటి సంబంధంలేదని చెప్పింది. అయితే టెక్నికల్ గా రాజాసింగ్ బీజేపీ ఎంఎల్ఏనే. ఎందుకంట 2023 అసెంబ్లీ ఎన్నికల్లో రాజాసింగ్ బీజేపీ టిక్కెట్ మీదనే పోటీచేసి గెలిచాడు కాబట్టి. రాజాసింగ్ ను బీజేపీ ఎంఎల్ఏ అనే అంటారు 2028 ఎన్నికలు జరిగేవరకు. ఇదంతా టెక్నికల్ వ్యవహారం పైగా అసెంబ్లీ వరకే పరిమితం.
గ్రౌండ్ రియాలిటీ ఏమిటంటే రాజాసింగ్ కు బీజేపీతో ఎలాంటి సంబంధంలేదు. అలాంటపుడు మోదీతో భేటీలో రాజాసింగ్ ఎలా ప్రత్యక్షమయ్యాడు ? అన్నదే అర్ధంకావటంలేదు. పార్టీకి రాజీనామా చేశాడు కాబట్టి ఎంఎల్ఏని పార్టీ కార్యక్రమాలు, సమావేశాలకు పిలవటంలేదు. హైదరాబాద్ లేదా తెలంగాణలో జరిగే పార్టీసమావేశాలకే దూరంపెడుతున్నపుడు ఏకంగా మోదీతో భేటీలో రాజాసింగ్ ఎలా పార్టిసిపేట్ అయ్యాడు ? తాజాగా విడుదలైన ఫొటోల్లో మోదీ పక్కనే రాజాసింగ్ కనబడ్డాడు. అందుకనే రాజాసింగ్ అసలు బీజేపీలో ఉన్నట్లా ? లేనట్లా ? అన్నదే ఎవరికీ అర్ధంకావటంలేదు.
పార్టీ ఆహ్వానిస్తే జాయిన్ అవుతానని ఒకటి, రెండుసార్లు రాజాసింగ్ మీడియాతోనే చెప్పినా పార్టీ నుండి ఎలాంటి సమాధానంలేదు. ఒకవైపు పార్టీలో చేరాలని అనుకుంటున్నట్లు చెబుతునే మరోవైపు కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి, రాష్ట్ర అధ్యక్షుడు నారపరాజు రామచంద్రరావుపై ఆరోపణలు, విమర్శలతో విరుచుకుపడుతునే ఉన్నాడు. ఈమధ్యనే జరిగిన జూబ్లీహిల్స్ అసెంబ్లీ ఉపఎన్నికల్లో పార్టీ ఓటమిపైన కూడా రాజాసింగ్ చాలా ఆరోపణలు చేశాడు. రాజాసింగ్ మాటల్లో బీజేపీని వ్యతిరేకిస్తు, చేతల్లో మాత్రం బీజేపీ నేతలతో అంటకాగుతు చూసేవాళ్ళకు పిచ్చెక్కిఃచ్చేస్తున్నాడు. రాజాసింగ్ అసలు పార్టీలో ఉన్నాడా లేడా అన్న విషయంలో నాయకత్వం క్లారిటి ఇస్తే బాగుటుంది.