తెలంగాణ పంచాయతీ ఎన్నికల తొలి విడత పోలింగ్, కౌంటింగ్ ప్రక్రియ ముగిసింది. మొదటిదశలో 3834 సర్పంచ్ పదవులతో పాటు 27,678 వార్డుసభ్యులకు బ్యాలెట్ పద్దతిలో ఎన్నిక జరుగింది. మొత్తంగా 56,19,430 మంది ఓటర్లు ( 27,41,070 పురుషులు, 28,78,159 స్త్రీలు 201 ఇతరుు) ఓటర్లు ఉన్నారు. ఈ ఎన్నికల కౌంటింగ్ ప్రక్రియ మధ్యాహ్నం ప్రారంభమైన సాయంత్రం 6:30 గంటల వరకు కొనసాగింది. ఈ ఫలితాలను ఎన్నికల సంఘం విడుదల చేసింది. కాంగ్రెస్ మద్దతుదారులు 816 మంది, బీఆర్ఎస్ మద్దతు దారులు 464, బీజేపీ మద్దతు దారులు 89, ఇతరులు 205 మంది విజయం సాధించారు.
అదే విధంగా ఈ తొలి విడత ఎన్నికల్లో మొత్తం 395 మంది ఏకగ్రీవాలుగా నిలిచారు. వారిలో కాంగ్రెస్ మద్దతు దారులు 303 మంది, బీఆర్ఎస్ మద్దతుదారులు 47 మంది, బీజేపీ మద్దతుదారులు 6, ఇతరులు 39 మంది ఏకగ్రీవంగా నిలిచారు. దీంతో మొత్తంగా కాంగ్రెస్ మద్దతుదారులు 1119 మంది, బీఆర్ఎస్ మద్దతుదారులు 511 మంది, బీజేపీ మద్దతుదారులు 95 మంది, ఇతరులు 244 మంది విజేతలుగా నిలిచారు.