మోదీ మరో ‘‘ఝుమ్లా’’
‘ఉపాధి ఆధారిత ప్రోత్సాహకం’ ఏమైందని ప్రశ్నించిన రాహుల్;
ప్రధాని మోదీ(PM Modi)పై కాంగ్రెస్ (Congress) నాయకుడు రాహుల్ గాంధీ మరోసారి విరుచుకుపడ్డారు. 'ఉపాధి ఆధారిత ప్రోత్సాహకం' పథకం గురించి గట్టిగా నిలదీశారు. మోదీ రోజూ కొత్త నినాదాలు చేస్తున్నా.. యువత ఉద్యోగ అవకాశాల కోసం ఎదురు చూస్తున్నారని, ఇది "ఇది మోదీ మరో మోసం" అని ఘాటుగా విమర్శించారు.
2024 ఎన్నికల తర్వాత మోదీ "ఉపాధి ఆధారిత ప్రోత్సాహకం" పథకాన్ని ఎంతో ఆర్భాటంగా ప్రకటించారని, మన యువతకు ఉపాధి కల్పిస్తామని హామీ ఇచ్చారని లోక్‌సభలో ప్రతిపక్ష నాయకుడు రాహుల్(Rahul Gandhi) గుర్తు చేశారు.
"ఈ పథకాన్ని ప్రకటించి ఏడాది కావస్తోంది. పథకానికి కేటాయించిన రూ. 10వేల కోట్లను తిరిగి వచ్చాయి. నిరుద్యోగుల గురించి ప్రధానికి ఎంత ప్రేమ ఉందో ఇదే నిదర్శనం," అని ధ్వజమెత్తారు.
పెద్ద కార్పొరేట్‌లపై మాత్రమే దృష్టి పెట్టడం, ఫెయిర్-ప్లే వ్యాపారాల కంటే స్నేహితులను ప్రోత్సహించడం ద్వారా ఉద్యోగాల సృష్టి సాధ్యంకాదని ఆరోపించారు.
"ప్రధాని ఈ ఆలోచనలతో ఏకీభవించరు. కానీ నేను ఆయనను నేరుగా అడగాలి. ప్రధానమంత్రి జీ, మీరు చాలా గొప్పగా ELI ప్రకటించారు - కానీ రూ. 10 వేల కోట్ల పథకం మాయమైంది. మీరు మీ వాగ్దానాలతో పాటు మా నిరుద్యోగ యువతను విడిచిపెట్టారా? మీరు ప్రతిరోజూ కొత్త నినాదాలు చేస్తున్నా.. మా యువత ఇప్పటికీ ఉద్యోగ అవకాశాల కోసం ఎదురు చూస్తుంది. దేశానికి ఎంతో అవసరమైన కోట్ల ఉద్యోగాలను సృష్టించడానికి మీ నిర్దిష్ట ప్రణాళిక ఏమిటి? లేక ఇది మరో జుమ్లా మాత్రమేనా?" అని ప్రశ్నించారు.
అదానీ, అతని "బిలియనీర్ స్నేహితులను" సంపన్నులుగా చేయడం నుంచి అణగారిన వర్గాల యువతకు ఉపాధి కల్పించడంపై మోదీ దృష్టి ఎప్పుడు మారుతుందని రాహుల్ ప్రశ్నించారు.