'కట్టా సర్కార్'ను కోరుకోవద్దు: ప్రధాని
ఓటింగ్‌కు భారీగా తరలివచ్చి ప్రతిపక్షాలకు నిద్రలేని రాత్రులు మిగిల్చారన్న మోదీ..
ప్రధాని మోదీ(PM Modi) భారత కూటమిపై తీవ్రస్థాయిలో ధ్వజమెత్తారు. బీహార్(Bihar)లో మహాఘట్‌బంధన్ కూటమి అధికారంలో వస్తే మళ్లీ అరాచన పాలన మొదలవుతుందన్నారు. బీహార్ రెండో విడద పోలింగ్ నవంబర్ 11వ తేదీన జరగనున్న నేపథ్యంలో ఎన్నికల ప్రచారంలో భాగంగా సీతామర్హి జిల్లాలో ప్రధాని శనివారం పర్యటించారు. తొలి దశ ఎన్నికలు నవంబర్ 6న జరిగిన విషయం తెలిసిందే.
‘జనం జంకుతున్నారు’
మహాఘట్‌బంధన్ కూటమి అధికారంలోకి వస్తే తలపై 'కట్టా ' (దేశంలో తయారు చేసిన తుపాకీ) పెట్టి పాలిస్తుందని, ఆ కారణంగానే జనం భయపడి వాళ్లకు ఓటు వేయడం లేదని చెప్పారు. ' కట్టా ' (తుపాకులు), ' కుశాసన్ ' (దుష్పరిపాలన), ' క్రూర్త ' (క్రూరత్వం), అవినీతి ప్రభుత్వాన్ని బీహార్ కోరుకోవడం లేదని చెప్పారు.
ఓటర్లకు మోదీ అభినందనలు..
రెండు రోజుల క్రితం(గురువారం) జరిగిన మొదటి దశ ఎన్నికల్లో పోలింగ్ 65.08 శాతం నమోదు కావడంపై ప్రధాని మోదీ హర్షం వ్యక్తం చేశారు. "ఓటింగ్‌లో భారీగా పాల్గొని మీరు ప్రతిపక్షాలకు పెద్ద షాక్ ఇచ్చారు. ప్రస్తుతం వారు నిద్రలేని రాత్రులు గడుపుతున్నారు" అని మోదీ పేర్కొన్నారు.
నెల రోజుల క్రితం తాను ప్రారంభించిన 'ముఖ్యమంత్రి మహిళా ఉద్యమి యోజన' గురించి మోదీ ప్రస్తావిస్తూ.. ఆ పథకం కింద కోటి మందికి పైగా మహిళల ఖాతాల్లోకి ఒక్కొక్కరికి రూ. 10వేలు నగదు జమ అయ్యిందన్నారు. ఇలా చేయడం ‘‘జంగిల్ రాజ్’’కు సాధ్యం కాదన్నారు. ప్రభుత్వం మంజూరు చేసిన ప్రతి రూపాయిలో కేవలం 15 పైసలు మాత్రమే ప్రజలకు చేరుతుందని మాజీ ప్రధాని రాజీవ్ గాంధీ వ్యాఖ్యలను మోదీ గుర్తు చేశారు. ఛత్ మయ్యా, మహాకుంభమేళా, అయోధ్య రామాలయ నిర్మాణం గురించి హిందువుల మనోభావాలు దెబ్బతినేలా మాట్లాడిన వారికి ఓట్లు వేయవద్దని కోరారు.