బీజేపీ ‘తిరంగా యాత్ర’..
రేపటి నుంచి దేశవ్యాప్తంగా 11 రోజుల పాటు ప్రచార యాత్ర..;
ఆపరేషన్ సిందూర్ విజయాన్ని పురస్కరించుకుని, కేంద్ర ప్రభుత్వం ‘తిరంగా యాత్ర(Tiranga Yatra)’ నిర్వహించనుంది. మే 13 నుంచి 23 వరకు 11 రోజుల పాటు ఈ కార్యక్రమం నిర్వహిస్తారు. ఈ యాత్ర ద్వారా ప్రజల్లో దేశభక్తిని ప్రేరేపించడంతో పాటు, పాక్, పాక్ ఆక్రమిత కశ్మీర్ (PoK)లోని ఉగ్ర శిబిరాలపై భారత సాయుధ దళాలు వీరోచిత విజయాన్ని వివరించనున్నారు. ఈ ప్రచార యాత్రకు సంబంధించిన ప్రణాళికపై మే 11 (ఆదివారం)న కేంద్ర మంత్రులు అమిత్ షా, రాజనాథ్ సింగ్, బీజేపీ(BJP) జాతీయ అధ్యక్షుడు జేపీ నడ్డా నేతృత్వంలో సమావేశం జరిగింది. సోమవారం (మే 12) బీజేపీ జాతీయ ప్రధాన కార్యదర్శులు తరుణ్ చుగ్, వినోద్ తావ్డే, దుశ్యంత్ గౌతమ్‌తో నడ్డా మరోసారి సమావేశమై ప్రచార కార్యక్రమానికి తుది రూపమిచ్చారు. ఈ యాత్రలో కేంద్ర మంత్రులు, పార్టీని నడిపించే ముఖ్య నేతలు పాల్గొననున్నారు.