‘అమల్లోకి పబ్లిక్ ఎగ్జామినేషన్ యాక్ట్-2024’

పబ్లిక్ ఎగ్జామినేషన్ యాక్ట్-2024 ప్రకారం.. ప్రశ్నపత్రం లీకేజీలకు పాల్పడే వారిపై ఇకనుంచి ఎలాంటి చర్యలు ఉంటాయి?

Update: 2024-06-22 06:07 GMT
పేపర్ లీకులతో కేంద్రం సతమతమవుతోంది. ప్రతిపక్ష పార్టీలు దుమ్మెత్తి పోస్తున్నాయి. దీంతో కేంద్ర ప్రభుత్వం యాక్షన్ ప్లాన్ మొదలుపెట్టింది. యుద్ధప్రాతిపదికన 'ది పబ్లిక్ ఎగ్జామినేషన్స్(ప్రివెన్షన్ ఆఫ్ అన్ ఫెయిర్ మీన్స్)యాక్ట్-2024ను అమల్లోకి తెచ్చింది. జూన్ 21 నుంచి అమల్లోకి వచ్చినట్లు గెజిట్ నోటిఫికేషన్ విడుదల చేసింది. ఇందుకు సంబంధించి న్యాయశాఖ నిబంధనలు రూపొందిస్తోందని కేంద్ర విద్యాశాఖ మంత్రి ధర్మేంద్రప్రధాన్‌ జూన్ 20న ఒక ప్రకటనలో తెలిపారు.
బిల్లుకు రాష్ట్రపతి అమోదం..
పబ్లిక్ ఎగ్జామినేషన్స్ బిల్లు - 2024 ను ఫిబ్రవరి 9న రాజ్యసభ ఆమోదించింది. ఫిబ్రవరి 6న లోక్ సభ ఆమోదించింది. రాష్ట్రపతి ముర్ము ఫిబ్రవరి 12న బిల్లుకు ఆమోదం తెలిపారు.
గరిష్టంగా పదేళ్ల జైలుశిక్ష..
‘పబ్లిక్ ఎగ్జామినేషన్ యాక్ట్-2024’ ప్రకారం ఎవరైనా ప్రశ్నపత్రం లీక్ చేసినా, పరీక్ష రాసే వారికి సహకరించినా, కంప్యూటర్ నెట్‌వర్క్‌ను ట్యాంపరింగ్ చేసినా, నకిలీ పరీక్షలు నిర్వహించినా, నకిలీ ప్రవేశపరీక్ష కార్డులు జారీ చేసినా నేరంగా పరిగణిస్తారు. లీకేజీకి పాల్పడే వారికి 5 నుంచి 10 సంవత్సరాల వరకు జైలుశిక్షతో పాటు రూ.కోటి వరకు జరిమానా విధిస్తారు. ఒకవేళ వ్యవస్థీకృత నేరానికి పాల్పడినట్లు రుజువైతే..ఆస్తులనూ కూడా జప్తు చేస్తారు. పరీక్ష నిర్వహణకు అయిన ఖర్చునూ వారినుంచే వసూలు చేస్తారు.

UGC-NEET 2024 ప్రశ్నాపత్రం లీకేజీపై సెంట్రల్ బ్యూరో ఆఫ్ ఇన్వెస్టిగేషన్ (సీబీఐ) గురువారం కేసు నమోదు చేసింది.

Tags:    

Similar News