పూర్వాంచల్ వాసులకు కాంగ్రెస్ ఆఫర్ ..

ఢిల్లీలో నివసిస్తున్న ఉత్తరప్రదేశ్, బీహార్, జార్ఖండ్ వాసులను ప్రత్యేక మంత్రిత్వ శాఖ, బడ్జెట్ కేటాయింపు;

Update: 2025-01-24 12:50 GMT
Click the Play button to listen to article

ఢిల్లీని ఆమ్ ఆద్మీ పార్టీ (AAP) చెత్తగా మార్చిందని, ఆరోగ్య శాఖలో రూ. 382 కోట్ల అవినీతికి పాల్పడిందని  కాంగ్రెస్ (Congress) పార్టీ బీహార్ యూనిట్ అధ్యక్షుడు, మాజీ కేంద్రమంత్రి అఖిలేష్ ప్రసాద్ సింగ్ (Akhilesh Prasad Singh) ఆరోపించారు. ఆయన శుక్రవారం ఢిల్లీ పార్టీ కార్యాలయంలో మీడియాతో మాట్లాడారు. ఢిల్లీ అసెంబ్లీ ఎన్నికల్లో (Delhi polls) పార్టీ తాము అధికారంలోకి వస్తే పూర్వాంచల్(Poorvanchalis) వాసులకు ప్రత్యేక మంత్రిత్వ శాఖ, బడ్జెట్ కేటాయిస్తామని ప్రకటించారు. 

ఢిల్లీలో తూర్పు ఉత్తరప్రదేశ్, బీహార్, జార్ఖండ్ ప్రాంతాలవాసులను పూర్వాంచల్ వాసులుగా పిలుస్తారు. ఎన్నికలలో వీరి ప్రభావం ఎక్కువగా ఉంటుంది. గెలుపు ఓటములను నిర్దేశిస్తారు. ఆ కారణంగానే కాంగ్రెస్, బీజేపీ, ఆప్ పార్టీలు ఎన్నికల సమయంలో వీరి ఓట్ల కోసం తీవ్రంగా ప్రయత్నిస్తాయి.

"పూర్వాంచల్ వాసులు దేశంలోని ప్రతి మూలకు వెళ్లి ఆ ప్రాంతాలను అభివృద్ధి చేశారు. కానీ వారి హక్కుల విషయంలో మాత్రం అన్యాయం జరుగుతోంది,’’ అని కాంగ్రెస్ నాయకురాలు సుప్రియా శ్రీనేత్ అన్నారు.

ఢిల్లీ అసెంబ్లీ ఎన్నికలు ఫిబ్రవరి 5న జరగనున్నాయి. 8న ఫలితాలు వెలువడతాయి. 

Tags:    

Similar News