‘కాంగ్రెస్‌ను ఓడిస్తేనే పథకాల అమలు’
జూబ్లీహిల్స్ ఉపఎన్నిక ముంగిట రేవంత్‌పై కేటీఆర్, హరీస్ రావు ధ్వజం.
జూబ్లీహిల్స్ పోరుకు రాజకీయ పార్టీలన్నీ సన్నద్ధం అవుతున్నాయి. ప్రచార రథాలను జోరుపైన ముందుకు దూకిస్తున్నాయి. విజయమే లక్ష్యంగా వ్యూహాలు రచిస్తున్నారు. ఈ క్రమంలోనే సీఎం రేవంత్ రెడ్డి, కాంగ్రెస్‌పై మాజీ మంత్రులు కేటీఆర్, హరీష్ రావులు ఘాటు వ్యాఖ్యలు చేశారు. అసెంబ్లీ ఎన్నికల ముంగిట కాంగ్రెస్ ఇచ్చిన హామీలు అమలు కావాలంటే జూబ్లీహిల్స్.. హస్తం గుర్తు ఓడిపోవాలని హరీస్ రావు వ్యాఖ్యానించారు. ఈ ఎన్నికలో గెలవడం కోసం కాంగ్రెస్.. దొంగ ఓట్ల పంచాన చేరిందని, ఒకే కుటుంబంలో 43 దొంగ ఓట్లను చేర్చారని కేటీఆర్ ఘాటు విమర్శనాస్త్రాలు సంధించారు. ప్రతి రోజును రేవంత్ అండ్ కో అబద్ధాలతో ప్రారంభిస్తోందని, తమ అబద్ధాలతో ప్రజలను మభ్యపెట్టాలని చూస్తోందని వారు ధ్వజమెత్తారు. రహమత్‌నగర్‌లో నిర్వహించిన పార్టీ కార్యకర్తల విస్తృతస్థాయి సమావేశంలో వీరు కాంగ్రెస్‌పై విమర్శలు గుప్పించారు.
కారు.. బుల్డోజర్.. ఏం కావాలి: కేటీఆర్
ఇప్పటికే బీసీలను 42శాతం రిజర్వేషన్ల పేరిట రేవంత్ మోసం చేశారని కేటీఆర్ అన్నారు. ఇలాంటి దివాలాకోరు సీఎంను తాను ఎక్కడా.. ఎప్పుడూ చూడలేదని ఆగ్రహం వ్యక్తం చేశారు. ఓట్లు వేసి గెలిపించిన పాపానికి ప్రజలతో ఆడుకుంటున్నారని అన్నారు. ‘‘గతంలో కాంగ్రెస్ తరుఫున జూబ్లీహిల్స్‌లో అజారుద్దీన్ పోటీ చేశారు. ఇప్పుడు ఎమ్మెల్సీ ఇస్తానని ఆయనని పక్కనబెట్టారు. జూబ్లీహిల్స్ ఓటర్లు పంచ్ కొండితే దెబ్బ కాంగ్రెస్ హైకమాండ్‌కు తగలాలి. కారు కావాలా.. బుల్డోజర్ కావాలా అనేది ఓటర్లే తేల్చుకోవాలి. కాంగ్రెస్ నేతు ఒకే ఇంట్లో 43 దొంగ ఓట్లు చేర్చింది. అలాంటివి ఎదర్కోవడంపై పార్టీ పరంగా దృష్టి సారించాం’’ అని కేటీఆర్ చెప్పారు.
ఆరు గ్యారెంటీలు కావాలంటే ఓడించండి: హరీష్
‘‘కాంగ్రెస్ ప్రభుత్వంలో ఏ పని జరగాలన్నా కమీషన్‌లు ఇచ్చుకోవాల్సి వస్తుంది. జూబ్లీహిల్స్‌లో కాంగ్రెస్ ఓడితేనే వాళ్లు ఇచ్చిన ఆరు గ్యాంరెటీలు అమలవుతాయి. మా హయాంలో పేదల కోసం బస్తీ దవాఖానాలు ఏర్పాటు చేశాం. అక్కడ పనిచేసే వైద్యులు, సిబ్బందికి ఈ ప్రభుత్వం జీతాలు ఇవ్వడం లేదు. ఆ దవాఖానాల్లో ఔషధాలు కూడా లేకుండా చేస్తున్నారు. హైడ్రా పేరుతో పేదల ఇళ్లనే టార్గెట్‌గా చేసుకుని కూలుస్తున్నారు. కేసీఆర్‌కు పేరు వస్తుందన్న భయంతోనే బస్తీ దవాఖానాలను బంద్ పెడుతున్నారు’’ అని హరీష్ రావు ఆగ్రహం వ్యక్తం చేశారు.