తన అరెస్టుకు కారణాన్ని బయటపెట్టిన ఆప్ మాజీ మంత్రి సత్యేందర్ జైన్

ఢిల్లీ లిక్కర్ స్కాం కేసులో అరెస్టయిన ఆమ్ ఆద్మీ పార్టీ సీనియర్ నేత, మాజీ మంత్రి సత్యేందర్ జైన్ శుక్రవారం సాయంత్రం బెయిల్‌పై విడుదలయ్యారు.

Update: 2024-10-19 07:34 GMT

ఢిల్లీ లిక్కర్ స్కాం కేసులో అరెస్టయిన ఆమ్ ఆద్మీ పార్టీ సీనియర్ నేత, మాజీ మంత్రి సత్యేందర్ జైన్ శుక్రవారం సాయంత్రం బెయిల్‌పై విడుదలయ్యారు. ఈ సందర్భంగా జైన్ మాట్లాడుతూ.. మొహల్లా క్లినిక్‌లు, యమునా నదీ ప్రక్షాళన వంటి ఆమ్ ఆద్మీ పార్టీ ప్రభుత్వ ప్రాజెక్టులను అడ్డుకునేందుకే తనను అరెస్టు చేశారని పేర్కొన్నారు. తనను, అరవింద్ కేజ్రీవాల్, మనీష్ సిసోడియా, సంజయ్ సింగ్ లాంటి ఆప్ నేతలను అరెస్టు చేయడం ద్వారా సామాన్యులు రాజకీయాల్లోకి రాకూడదన్న సంకేతాన్ని కేంద్రం పంపాలనుకుందని ఆరోపించారు. ఢిల్లీవాసుల సంక్షేమం కోసం పనిచేస్తున్న కేజ్రీవాల్‌ను మానసికంగా దెబ్బతీయడమే కాకుండా పార్టీ ప్రతిష్టను దిగజార్చేందుకే తనను అరెస్ట్ చేశారని చెప్పారు.

"అన్యాయానికి వ్యతిరేకంగా మేము మన పోరాటాన్ని కొనసాగిస్తాం. సామాన్యుల కోసం పని చేద్దాం" అంటూ తీహార్ జైలు ఆయన కోసం వేచిచూస్తున్న AAP శ్రేణులతో అన్నారు జైన్.

‘‘ప్రజల కోసం చేయాల్సిన పనులన్నీ చేస్తాం. మా సత్తా ఏంటో ప్రపంచానికి చూయిస్తాం.’’. ఢిల్లీ ప్రస్తుత ముఖ్యమంత్రి అతిశీ గురించి కూడా కొన్ని వ్యాఖ్యలు చేస్తూ.. "అతిశీ జీ, మీరు కూడా జైలుకు వెళ్లవలసి ఉంటుంది. అయితే మేం అన్యాయానికి వ్యతిరేకంగా పోరాడుతూనే ఉంటాం. కేజ్రీవాల్ కూడా తమలాంటి వాడే అని ఆయన ప్రతిష్టను దిగజార్చాలని చూస్తున్నారు. కానీ కేజ్రీ అలాంటి వ్యక్తి కాదు. కేజ్రీవాల్ నిజాయతీ, అవినీతికి వ్యతిరేకంగా పోరాడిన వ్యక్తి.’’ అని పేర్కొన్నారు.

ఢిల్లీ ముఖ్యమంత్రి అతిషి, పార్టీ నాయకుడు మనీష్ సిసోడియా, రాజ్యసభ ఎంపీ సంజయ్ సింగ్ పలువురు ఎమ్మెల్యేలు నాయకులు జైన్‌కు స్వాగతం పలికారు. అనంతరం ఆయన ఆప్ చీఫ్ కేజ్రీవాల్‌ని ఫిరోజ్‌షా రోడ్‌లోని ఆయన నివాసంలో కలిశారు.

మనీలాండరింగ్ కేసులో ఎన్‌ఫోర్స్‌మెంట్ డైరెక్టరేట్ (ED) జైన్‌ను మార్చి 2022లో అరెస్టు చేసింది. 873 రోజుల పాటు జైలులో ఉన్నారు.

Tags:    

Similar News