మతసామరస్యానికి ప్రతీక.. ఛత్ 'మహాపర్వ్'

ముస్లింలకు జీవనోపాధి కల్పిస్తున్న మట్టి పొయ్యిల తయారీ..

Update: 2025-10-26 11:33 GMT
Click the Play button to listen to article

బీహార్‌(Bihar)లో హిందువులు అత్యంత భక్తి శ్రద్ధలతో జరుపుకునే పండుగల్లో ఛత్ 'మహాపర్వ్' ఒకటి. ప్రధానంగా బీహార్, ఉత్తర ప్రదేశ్ రాష్ట్రాలవారు ఈ పండుగను అక్టోబర్ 25 నుంచి అక్టోబర్ 28 వరకు జరుపుకుంటారు. నాలుగు రోజుల పాటు సూర్యభగవానుడికి వివిధ రకాల వంటలను తయారుచేసి ప్రసాదంగా పెడతారు. ఈ పండగ సందర్భంగా కొంతమంది మహిళలు ఉపవాసం కూడా ఆచరిస్తారు.


మత సామరస్యానికి ప్రతీక..

ఈ పండుగ మత సామరస్యానికి ప్రతీక. సూర్యభగవానుడికి సమర్పించే ప్రసాదం తయారీకి మట్టితో తయారుచేసిన పొయ్యిలను వినియోగించడం ఆనవాయితీగా వస్తుంది. వీటిని ముస్లిం(Muslim) మహిళలు తయారు చేసి విక్రయిస్తుంటారు. వీటి అమ్మకాలతో పెద్దగా లాభాలు రాకపోయినా.. తెలిసిన విద్య కావడంతో కుటుంబ ఖర్చుల కోసం వస్తాయని వీటి తయారీలో నిమగ్నమయ్యారు. రాష్ట్ర రాజధాని పాట్నాలోని బీర్ చంద్ పటేల్ పాత్, దరోగా ప్రసాద్ రాయ్ పాత్ బెయిలీ రోడ్ వంటి ప్రధాన వీధుల వెంట ఈ పొయ్యిలను విక్రయిస్తున్నారు.

‘‘దాదాపు ముఫై ఏళ్లుగా ఈ మట్టి పొయ్యిలను తయారుచేస్తున్నాం. చేయడం బాగా తెలుసు కావడంతో ఈజీగా చేయగలుగుతున్నాం. వీటి వల్ల పెద్దగా లాభాలేమీ ఉండవు. మా లాంటి పేద ముస్లిం మహిళలకు కాస్తంత జీవనోపాధి ’’ అని చెప్పారు ఖురైషా ఖాతూన్.


మాంసాహారం ముట్టరు..

మట్టి పొయ్యిల తయారీదారులు వాటిని తయారుచేసేటప్పుడు కొన్ని నియమ నిబంధనలు పాటిస్తారు. పని ప్రారంభించే ముందు స్నానం చేస్తారు. మాంసాహారం తీసుకోరు. వెల్లుల్లి, ఉల్లిపాయలు తినడం మానేస్తారు. తయారుచేసిన పొయ్యిలు పాదాలకు తాకకుండా జాగ్రత్త పడతారు. ఇలా వీరు తయారుచేసిన మట్టి పొయ్యిలు సామాన్యుల ఇళ్ల నుంచి ముఖ్యమంత్రి, ఇతర మంత్రులు, న్యాయమూర్తులు, వీఐపీల ఇళ్లలోనూ కనిపిస్తాయి.


మనుగడ కోసం పోరాటం..

పొయ్యిలు తయారు చేసే పేద ముస్లిం మహిళలు ఎక్కువగా బఖో సమాజానికి చెందినవారు. ఇది పస్మాండ ముస్లింల కంటే తక్కువ కులం. సామాజికంగా, విద్యాపరంగా, ఆర్థికంగా అత్యంత వెనుకబడినవారు. మనుగడ కోసం జీవన పోరాటాన్ని సాగిస్తున్నారు.


"హిందూ భక్తుల కోసం ప్రసాదం తయారు చేయడానికి మేం ప్రత్యేక మట్టి పొయ్యిలను తయారు చేస్తాము. మా చేతితో తయారు చేసిన మట్టి పొయ్యిలు సేంద్రీయమైనవి. అందుకే వాటికి అధిక డిమాండ్. వ్యవసాయ భూమి బంకమట్టి, గోధుమ గడ్డి, స్వచ్ఛమైన నీరు వాడతాం," అని న్యూ పాట్నా క్లబ్ సమీపంలోని రోడ్డు మీద కూర్చుని, మట్టి పొయ్యిలను అమ్ముతున్న ఖురైషా చెప్పారు.

‘‘గతంలో కంటే ఇప్పుడు కాలం మారిపోయింది. మతపర, ద్వేషపూరిత రాజకీయాలు ఛఠ్ సమయంలో అమ్మకాలపై ప్రభావం చూపుతుంది’’ అని ఆవేదన వ్యక్తం చేశారు.

అయితే ముస్లింలు తయారు చేసి విక్రయించే విషయంలో హిందూ కొనుగోలుదారులకు పెద్దగా పట్టింపు లేదని అన్నారు మైమునా అనే వృద్ధ మహిళ. "గత ఐదు దశాబ్దాలుగా మేం వీటిని తయారుచేస్తున్నాం. ఛత్ కోసం 'మిట్టి కా చుల్హా' తయారు చేసే మా పెద్దల సంప్రదాయాన్ని కొనసాగించడం మాకు సంతోషంగా ఉంది" అని ఆమె ది ఫెడరల్‌తో అన్నారు .

మట్టి పొయ్యి తయారీదారు అయిన అఫ్సానా భర్త షేర్ మొహమ్మద్ మాట్లాడుతూ.. ఒక్కో పొయ్యి రూ.110 నుంచి 120 వరకు హోల్‌సేల్ వ్యాపారులకు విక్రయిస్తున్నారని, వారు డజన్ల కొద్దీ వాటిని కొనుగోలు చేస్తారని చెప్పారు. పూజలో మట్టి వస్తువులను ఉపయోగిస్తారు. కాబట్టి వాటి తయారీలో తాము చాలా జాగ్రత్తలు తీసుకుంటామని పేర్కొ్న్నారు. భక్తులు-కస్టమర్లు పెద్దగా బేరసారాలు చేయనందున తాము మంచి మొత్తంలో డబ్బు సంపాదిస్తున్నామని చెప్పారు.


తయారీదారులకు అభినందనలు..

పాట్నాలోని మిత్రా మండల్ కాలనీ నివాసి, భక్తురాలు శోభా దేవి మాట్లాడుతూ.. మట్టి పొయ్యిలో తీపి వంటకాలను వండడానికి మామిడి కట్టెలను మాత్రమే ఉపయోగిస్తారని చెప్పారు. ఈ సందర్భంగా ఆమె రెండు పొయ్యిలను కొనుగోలు చేసింది. రాష్ట్ర రాజధానిలోని శ్రీ కృష్ణ నగర్‌కు చెందిన మధ్య వయస్కురాలైన ఛత్ భక్తురాలు నీనా సింగ్.. మైనారిటీ వర్గానికి చెందిన 'మిట్టి కా చుల్హాస్' తయారీదారులకు కృతజ్ఞతలు తెలిపారు.


"నాలాంటి భక్తులకు 'మిట్టి కా చుల్హాలు' పవిత్రమైనవి. వాటిలో ఛాఠ్ కోసం ప్రసాదం తయారు చేయడం అనాదిగా వస్తున్న సంప్రదాయం. మండుతున్న ఎండ, ధూళిని లెక్కచేయకుండా కష్టపడి పనిచేసే ముస్లింలకు మేము కృతజ్ఞతలు చెబుతున్నాం. ఈ స్టవ్‌లను తయారు చేసి సరసమైన ధరలకు మాకు అమ్ముతున్నాము. ఇక్కడ తప్ప మీకు అది ఎక్కడా దొరకదు, ” అని ఆమె అన్నారు. 

Tags:    

Similar News