‘సుప్రీం’లో కేజ్రీవాల్ మరో పిటిషన్.. ఎందుకంటే..

ఎన్నికల ప్రచారంలో పాల్గొనేందుకు అత్యున్నత న్యాయస్థానం ఢిల్లీ సీఎం కేజ్రీవాల్ కు అది జూన్ 1 వరకు మధ్యంతర బెయిల్ మంజూరు చేసింది. అయితే ఆయన మరో పిటిషన్ వేశారు.

Update: 2024-05-27 06:49 GMT

తన మధ్యంతర బెయిల్‌ను పొడిగించాలని ఢిల్లీ సీఎం అరవింద్ కేజ్రీవాల్ సుప్రీంకోర్టును ఆశ్రయించారు. బెయిల్ జూన్ 1తో ముగియనుండడంతో ఆరోగ్య కారణాల వల్ల మరో ఏడు రోజులు పొడిగించాలని కోరారు.

మద్యం కుంభకోణంతో ముడిపడి ఉన్న మనీలాండరింగ్ కేసులో ఎన్‌ఫోర్స్ మెంట్ అధికారులు (ఈడీ) కేజ్రీవాల్ ను అరెస్టు చేసిన విషయం తెలిసిందే. లోక్ సభ ఎన్నికల ప్రచారంలో పాల్గొనేందుకు వీలుగా ఆయనకు అత్యున్నత న్యాయస్థానం ఇటీవల 21 రోజుల పాటు షరతులతో కూడిన మధ్యంతర బెయిల్ మంజూరు చేసింది. తన కార్యాలయాన్ని లేదా ఢిల్లీ సచివాలయాన్ని సందర్శించకూడదని, అలాగే అధికారిక ఫైళ్లపై సంతకం చేయకూడదని షరతులు విధించింది.

వైద్య పరీక్షల కోసం..

ముఖ్యమంత్రి తన తాజా పిటిషన్‌లో తాను 7 కిలోల బరువు తగ్గానని పేర్కొన్నారు. కొన్ని వైద్య పరీక్షలు చేయించుకోవాల్సి ఉన్నందున మధ్యంతర బెయిల్‌ను పొడిగించాలని కోరారు.

సుప్రీం జోక్యంతో బెయిల్..

మధ్యం కుంభకోణంలో విచారణకు హాజరుకావాలని ఈడీ గతంలో పలుమార్లు కేజ్రీవాల్‌కు నోటీసులిచ్చింది. అయితే ఆయన హాజరుకాలేదు. ‘దర్యాప్తు సంస్థకు సహకరించడానికి కేజ్రీవాల్‌ సిద్ధంగా ఉన్నారని, ఎన్నికలు సమీపిస్తోన్న వేళ నోటీసులు పంపడాన్ని ఆప్ నేతలు తప్పుబట్టారు. అరెస్టు నుంచి మినహాయింపు కోసం కేజ్రీవాల్ ఢిల్లీ హైకోర్టును ఆశ్రయించారు. కేసు పురోగతి దృష్ట్యా తాము జోక్యం చేసుకోలేమని చెప్పిన గంటల వ్యవధిలోనే ఈడీ అధికారులు కేజ్రీవాల్ ఇంటికి చేరుకుని అదుపులోకి తీసుకున్నారు. మార్చి 21న ఆయనను అరెస్టు చేశారు. ఏప్రిల్‌ 15 వరకు తీహార్ జైలులో జ్యుడిషియల్‌ రిమాండ్‌లో ఉన్నారు. తన పిటిషన్‌ను పరిశీలించిన సుప్రీం కోర్టు కేజ్రీవాల్‌కు జూన్ 1వరకు మధ్యంతర బెయిల్ మంజూరు చేసింది. 

Tags:    

Similar News