Delhi polls | ఆప్ పాలనపై విమర్శలు గుప్పించిన ప్రధాని మోదీ

ప్రధాని మోదీ ఢిల్లీ సర్కారుపై విరుచుకుపడ్డారు. కేజ్రీవాల్‌ను టార్గెట్ చేస్తూ ఆప్ ప్రభుత్వాన్ని ఆపదగా ప్రభుత్వంగా అభివర్ణించారు.;

Update: 2025-01-05 16:17 GMT

దేశ రాజధానిలో రాజకీయాలు వేడెక్కాయి. ఢిల్లీ (Delhi) అసెంబ్లీ ఎన్నికలకు సమయం సమీపిస్తుండడంతో పార్టీలు తమ అభ్యర్థుల పేర్లను ఖరారుచేసి ప్రచారంలోకి దిగాయి. ఇక ప్రధాని మోదీ(Modi), ఆమ్ ఆద్మీ ఫార్టీ చీఫ్ అరవింద్ కేజ్రీవాల్(Arvind Kejriwal) ఒకరిపైఒకరు విమర్శనాస్త్రాలు సంధించుకుంటున్నారు. ఆదివారం ఢిల్లీలోని రోహిణి ప్రాంతంలో జరిగిన సభలో ఆప్ ప్రభుత్వంపై విరుచుకుపడ్డారు. ఆప్ ప్రభుత్వాన్ని "ఆపద" ప్రభుత్వంగా అభివర్ణించారు. డబుల్ ఇంజిన్ సర్కారుతోనే అభివృద్ధి సాధ్యమన్నారు. ఢిల్లీని భవిష్యత్తు నగరంగా మార్చే అవకాశం బీజేపీ(BJP) కి ఇవ్వాలని ప్రజలను కోరారు. కేంద్ర ప్రభుత్వం ఢిల్లీలో హైవేల అభివృద్ధి, మెట్రో విస్తరణ, నమో భారత్ రీజినల్ రాపిడ్ ట్రాన్సిట్ సిస్టమ్ వంటి అనేక కార్యక్రమాలు చేపట్టిందని గుర్తుచేశారు.

కేజ్రీవాల్‌పై 'షీష్ మహల్' విమర్శ

కొవిడ్‌ సమయంలో ప్రజలంతా సరైన వైద్య సదుపాయాలు లేక ఇబ్బందులు పడుతుంటే కేజ్రీవాల్‌ మాత్రం 'షీష్ మహల్' (అద్దాల మేడ) నిర్మించుకోవడంలో బిజీగా ఉన్నారని మండిపడ్డారు. దాని నిర్మాణం కోసం ఆయన చాలా డబ్బు ఖర్చుచేశారని విమర్శించారు.

కేజ్రీవాల్ కౌంటర్..

మోదీ వ్యాఖ్యలపై కేజ్రీవాల్ కౌంటర్ ఇచ్చారు. ప్రధాని తన ప్రసంగంలో చాలా భాగం ఢిల్లీ ప్రభుత్వాన్ని విమర్శించేందుకు కేటాయించారని దుయ్యబట్టారు. ఆదివారం ప్రధాని ప్రారంభించిన రెండు ప్రాజెక్టులు కేంద్ర, నగర ప్రభుత్వాల సంయుక్త పథకాలని పేర్కొన్నారు. స్వయంగా రూ.2700 కోట్లుతో ఇల్లు కట్టించుకుంటున్న వారు, రూ.8400 కోట్ల విలువైన విమానంలో తిరిగే వారు, రూ.10 లక్షల విలువైన కోటు వేసుకునే వారికి 'షీష్ మహల్' గురించి మాట్లాడే అర్హత లేదని అని కేజ్రీవాల్ మోదీపై విరుచుకుపడ్డారు.

Tags:    

Similar News